Tuesday, 9 February 2016

మేకని అరెస్ట్ చేసిన పోలిసులు



ఒక్క మేకని మాత్రమే కాదండోయ్...దానితో పాటు మేక యజమాని అబ్దుల్ హసన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.ఈ సంఘటన చత్తీస్ ఘడ్ లోని కొరియ జిల్లా లోని జనక్ పూర్ లో నిన్న జరిగింది.ఈ మేక జుడీషియల్ మేజిస్ట్రేట్ గారి తోట లోనికి అక్రమంగా చొరబడి కొన్ని మొక్కల్ని తినివేయడమే కాక తోటని కూడ పాడు చేసిందిట.గతం లో అంటే ఫిబ్రవరి 6 వ తేదీన కూడా ఇలాగే చేయగా ఆ మేక యజమానిని పిలిచి పోలీసులు చీవాట్లు పెట్టి వదిలేశారు.అయినా బుద్ది తెచ్చుకోకుండా ఈ మేక మళ్ళీ ఆ తోట లోకి వెళ్ళి చికాకు చేయడం తో మేక మీద ,దాని యజమాని మీద మేజిస్ట్రేట్ గారు కంప్లైంట్ చేయడం తో ఇరువురిని అరెస్ట్ చేశారు.అయితే ఈరోజు వారికిద్దరికీ బెయిల్ దొరికింది. అదీ కొసమెరుపు.Click here 

No comments:

Post a Comment