Tuesday, 31 May 2016

ఏ.ఆర్. రెహమాన్ కి జపాన్ దేశపు అత్యున్నత పురస్కారం



ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ కి ఆసియా ప్రాంతపు సాంస్కృతిక  విలువలను ప్రచారం చేసినందుకు గాను ,ప్రత్యేకించి సంగీత విభాగానికి సంబందించి చేసిన సేవలకి గాను Grand Fukuoka Prize ని 2016 ఏడాది కి గాను జపాన్ దేశం ప్రకటించింది.ఈ పురస్కారం సందర్భంగా రెహమాన్ తన కళ గురించి ప్రత్యేక ఉపన్యాసం చేస్తారు.ఆయనతో పాటుగా ఫిలిప్పైన్స్ కి చెందిన అమెత్ ఆర్ ఒకాంపో (విద్య) ,పాకిస్తాన్ కి చెందిన యాసిన్ లారి (కళలు) కూడా పురస్కారాలు అందుకుంటారు.గతం లో రవి శంకర్ (సితార్),పద్మా సుబ్ర్హమణ్యం(నృత్యం),రొమిల్లా థాపర్ (చరిత్ర),అంజాద్ అలీ ఖాన్ (సరోద్ వాయిద్యం),ఆశిష్ నంది(రచయిత) ,ఇంకా ఇతరులు భారత్ నుంచి ఈ పురస్కారాన్ని పొందారు. 

1 comment:


  1. రెహమానుకిచ్చిరి గదా
    అహరహ కృషియన జిలేబి అద్బుత ఫుకువో
    క! అమెత్ ఆర్ ఓ కంపో
    కు, ఆసినుకునిచ్చిరి, మన కుర్రడు భేషూ !

    ReplyDelete