Saturday, 14 May 2016

బీహార్ విద్యార్థులు మా పట్టణం ని చెడగొడుతున్నారు అంటున్న M.L.A.



నిన్న శుక్రవారం రాజస్థాన్ లోని కోట లో కోచింగ్ కోసం వచ్చి నివాసం ఉంటున్న విద్యార్థుల మధ్య గొడవలు జరిగి ,దాని లో సత్య ప్రకాష్ అనే బీహారి విద్యార్థి హత్య కాబడ్డాడు.ఈ యువకుడు మెడిసిన్ ఎంట్రెన్స్ కోసం కోచింగ్ కి ఇక్కడికి వచ్చాడు.25 మంది విద్యార్థులు మూకుమ్మడిగా ఇద్దరు విద్యార్థులపై దాడి చేయడం తో ఒక విద్యార్థి గాయపడగా సత్యార్తి గా పిలువబడే సత్యప్రకాష్ (19) అక్కడే మృతి చెందాడు.ఈ కోట పట్టణం రాజస్థాన్ లో కోచింగ్ కేంద్రాలకి పెద్ద పేరు.ఏటా లక్షన్నర పై చిలుకు విద్యార్థులు శిక్షణ కోసం వస్తుంటారు.గత కొన్ని రోజులు గా ఘర్షణలు జరుగుతూ ఇవి తీవ్ర స్థాయికి  చేరుకున్నాయి.అయితే కోట M.L.A భవానీ సింగ్ రజావత్ మాట్లాడుతూ బీహార్ విద్యార్థులు తమ పట్టణం కి చెడు పేరు తెస్తున్నారని ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.బీహార్ ఉపముఖ్యమంత్రి తేజశ్వనీ ప్రసాద్ యాదవ్ రాజస్థాన్ ముఖ్యమంత్రికి ఈ విషయమై లేఖ రాస్తూ దుండగుల్ని శిక్షించవలసిందిగా కోరారు. 

No comments:

Post a Comment