ప్రఖ్యాత ఆంగ్లో ఇండియన్ రచయిత రస్కిన్ బాండ్ సాహిత్య ప్రియులకు అనేక నవలల ద్వారా,ఇంకా కధల ద్వారా చిర పరిచయస్థుడే.భారత దేశం లో బ్రిటిష్ దంపతులకు( Aubrey Bond,Edith Clerke) 1934 మే 19 న జన్మించారు.ఆ తర్వాత ఆయన ఈ దేశాన్నే చిర వాసంగా చేసుకొని ముస్సోరి దగ్గర లోని ఒక కంటోన్మెంట్ గ్రామం లో నివసిస్తూ ఆంగ్ల భాష లో తన రచనా వ్యాసాంగాన్ని సాగించారు.నిన్న ఆయన 82 వ పుట్టిన రోజు ,ఆ సందర్భంగా మాట్లాడుతూ తాను ఇప్పుడు టైప్ రైటర్ తో రాయడం లేదని కంప్యూటర్ మీద కూడా టైప్ చేయడం తనకి ఇష్టం ఉండదని ,కేవలం చేతి తోనే రాస్తున్నానని తెలిపారు.పాతిక పైగా నవలలు,వందలాది కధలు రాసిన ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులున్నారు.పద్మశ్రీ ,పద్మభూషణ్ లని స్వీకరించారు.శ్యాం బెనిగళ్,విశాల్ భరద్వాజ్ వంటి దర్శకులు ఆయన రచనల్ని సినిమాలుగా తీశారు.
Friday, 20 May 2016
నిన్న ఆ ప్రసిద్ధ రచయిత పుట్టిన రోజు...

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment