Saturday, 17 December 2022

Jason Statham నటించిన The Mechanic సినిమా..

 Jason Statham ప్రధాన పాత్రలో  నటించిన The Mechanic అనే హాలీవుడ్ సినిమా గురించి కొద్దిగా చెప్పుకుందాం. ఇది 2011 లో రిలీజ్ అయినప్పటికీ యాక్షన్ సినిమాల్ని ఇష్టపడేవారు తప్పక చూడవలసిన చిత్రం ఇది. పేరు చూస్తే మెకానిక్ అని ఉందేమిటి అనుకుంటున్నారా...అదంతే.నిజానికి హీరో ఒక హిట్ మేన్. అంటే కావలసిన డబ్బు ఇచ్చి తగిన వివరాలు ఇస్తే చాలు ఆ మనిషిని సునాయసంగా ఒక యాక్సిడెంట్ లోనో,సహజం గానో పోయినంత ఇదిగా చాకచక్యం గా లేపేస్తాడు అన్నమాట.దానికి కావలసిన అన్ని హంగులు తన వద్ద ఉంటాయి.

ప్రధాన పాత్ర పేరు Arthur Bishop. దీన్ని Jason Statham పోషించాడు.ఎక్కువగా మాట్లాడడు,అవసరం ఉంటే తప్పా.ఈ హిట్ మేన్ కార్యక్షేత్రం ప్రపంచం లో ఎక్కడైనా ఉండవచ్చు.అవసరాన్ని బట్టి ప్లానింగ్ ఉంటుంది.సినిమా ప్రారంభం లోనే చాలా కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఓ మాఫియా లీడర్ ని స్విమ్మింగ్ ఫూల్ లో చంపడం తో సినిమా శ్రీకారం చుట్టుకుంటుంది. అతనికి ఎలాంటి రాగద్వేషాలు ఉండవు.తనకి అప్పగించబడిన పనిని ఏ విధంగా చేయాలి ఆ ఆలోచనే ఉంటుంది అంతే.

ఈ Bishop ఈ వృత్తి లోకి రావడానికి ముందు Harry అనే అతని దగ్గర శిక్షణ పొందుతాడు. అతను ఒక సందర్భం లో చంపబడతాడు.ఆ Harry కొడుకు Steve ఈ Bishop దగ్గర తన తండ్రిని చంపిన వాళ్ళని చంపడానికి గాను హిట్ మేన్ గా శిక్షణ పొందడానికి చేరతాడు. గురుపుత్రుడికి అన్నీ మెళుకువలు నేర్పుతాడు. భవిష్యత్ లో తనకి పార్ట్నర్ గా ఉంటాడని అనుకుంటాడు. ఒక మనిషిని ఏ రకంగా చంపాలి అనే దాన్ని నేర్పించేందుకు కొన్ని ప్రాజెక్ట్ లు కూడా ఇస్తాడు Bishop.ఒక స్వలింగ సంపర్కుడైన డ్రగ్ డీలర్ ని చంపడం దాంట్లో ఒకటి.మొత్తానికి దాంట్లో కష్టబడి నెగ్గి తనని నిరూపించుకుంటాడు Steve. 

ఒకసారి Bishop ఇంట్లో ఉన్నప్పుడు చనిపోయిన తన తండ్రి పిస్టల్ ని చూస్తాడు Steve. ఓహో అయితే తండ్రిని ని చంపింది ఇతనే అన్నమాట అనుకుంటాడు. ఏమి తెలియనట్లే వ్యవహరిస్తూ Bishop ని ఏదో ఓ సమయం లో వేసెయ్యాలని నిర్ణయించుకుంటాడు. కారు లో వెళుతున్నప్పుడు జరిగిన ఓ సంభాషణ లో Steve తన గురించి తెలుసుకున్నాడని గమనిస్తాడు Bishop. ఏమీ తెలియనట్లే ఉంటాడు. ఒక పెట్రోల్ బంక్ దగ్గర కారుని పెట్రోల్ నింపి ఆ తర్వాత తుపాకి తో పేల్చి యాక్సిడెంట్ చేస్తాడు Steve,అదీ Bishop ఒక్కడే లోన ఉన్నప్పుడు.అతను పోయాడులే అనుకుని Bishop ఇంటికి వచ్చి చక్కగా రికార్డ్ పెట్టుకుని కాసేపు విని,షెడ్ లో ఉన్న మరో కారుని తీసి డ్రైవ్ చేసుకుంటూ చక్కగా వెళుతుంటాడు Steve. ఇంతలో ఆ ఇల్లు,ఆ తర్వాత కారు ధడేలున పేలిపోతాయి.Steve చనిపోతాడు. శత్రువుల కోసం Bishop చేసిన ఏర్పాటు అది.

పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ లో Bishop తప్పించుకుంటాడు. చక్కగా మరో ఆపరేషన్ నిమిత్తం సాగిపోతాడు. అదీ కథ టూకీగా.Jason Statham హిట్ మేన్ గా ,ఎత్తుకి పై ఎత్తు వేసే కన్నింగ్ మాన్స్టర్ గా చక్కగా చేశాడు.యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి.సినిమా తీసిన లొకేషన్ లు కూడా బాగున్నాయి. Steve గా Ben foster చేశాడు.Simon West దర్శకుడు.సినిమా ని ఆసక్తిదాయకం గా తీర్చిదిద్దాడు. ఈ Mechanic సినిమా కి సీక్వెల్స్ కూడా ఉన్నాయి.వీలైతే చూడవచ్చును. దీంట్లో ఓ డైలాగ్ ఉంది. " Good judgement comes from experience and a lot of that comes from bad judgement" అని.బాగుంది కదూ.      

--- NewsPost Desk

No comments:

Post a Comment