Tuesday 6 September 2016

ఆ పుస్తకాలే నన్ను తీర్చిదిద్దాయి అంటున్నదామె



Arya fell through the fault ఈ ఏడాది ఓం ప్రచురణకర్తలు పబ్లిష్ చేసిన ఈ బుక్ ని రాసినది మరెవరో కాదు ముంబాయి కి చెందిన రీనిత మల్ హోత్ర హోర అనే ఆమె,ప్రస్తుతం హాంగ్ కాంగ్ లో ఒక రేడియో లో పనిచేస్తున్నారు.ఈ కధ మొత్తం శాన్ ఫ్రాన్సిస్కో లో వలస వెళ్ళిన భారతీయ కుటుంబం నేపధ్యం లో సాగుతుంది.దీని లో ని ఆర్య అనే కుర్రవాని పాత్ర ప్రధానమైనది.ఒకవేపు భారతీయ ఇతిహాసం రామాయణం  ని తీసుకొని దానికి సమకాలీనతని జోడించారు.రీనిత ఆయుర్వేదం,ఆర్దిక సంబంధ విషయాలపై గతం లో కొన్ని పుస్తకాలు రాశారు.చిన్నప్పటినుంచి జేన్ ఆస్టిన్ రచనలు ఆసక్తి గా చదివేదాన్నని ఆ నవలల పఠనమే తనని రచయిత్రి గా తీర్చిదిద్దిందని చెబుతున్నారు.

Monday 22 August 2016

విడాకులు పొందటం కూడా కష్టం కావడమే దీనికి కారణమా...?



దంపతులు విడి పోవడం ఇంకా విడాకులు తీసుకోవడం వంటివి కేవలం పట్టణాలకి ,నగరాలకే పరిమితం కాలేదు,మన దేశం లో గ్రామీణ ప్రాంతాల్లో ఒక మాదిరి పట్టణాల్లో కూడా ఈ ట్రెండ్ పెరుగుతున్నదని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి.2011 లో తీసిన జనాభా లెక్కల్ని అనుసరించి చూస్తే ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా  పై స్థానం లో ఉంది.28,754 మంది వేరు పడిన వాళ్ళు ఉండగా, తెలంగాణా లో డైవర్స్ తీసుకున్నవాళ్ళు కరీం నగర్ జిల్లా లో ఎక్కువ గా ఉన్నారు.7,922 మంది అక్కడ సంఖ్య అని భోగట్టా.ఈ గణాంకాలు హైదరా బాద్ లోని వారి కంటే ఎక్కువ,అక్కడ వేరు పడి జీవిస్తున్న వారు 8,195 మంది కాగా కోర్ట్ నుంచి విడాకులు తీసుకున్నవారు 3,912 గా ఉంది.ఇక విశాఖ లో సెపరేట్ అయిన వారు 19,689 కాగా విడాకులు పొందిన వారు 3,782 గా ఉన్నారు.డైవర్స్ తీసుకున్న వారి కంటే ,తీసుకోకుండా వేరు గా జీవిస్తున్న వారే ఎక్కువ.దేశం మొత్తం మీద చెప్పాలంటే సెపరేట్ గా ఉంటున్న వారు 35,35,202 మంది కాగా విడాకులు పొందిన వారు 13,62,316 మంది మాత్రమే.

Sunday 21 August 2016

కేరళ లో బీఫ్ ఎందుకని ఫేవరేట్ కూర..?



మన దేశం లో కేరళ రాష్ట్రం లోని ప్రజల టేస్టే వేరు.బీఫ్ ఫ్రై అనేది చాలా సాధారణంగా తినే వంటకం.క్రైస్తవులు,ముస్లింలనే కాదు హిందువుల లో కూడా చాలా మంది సర్వ సాధారణంగా  తింటారు.దోసె,ఇంకా ఇతర వాటి తో కలిపి తింటారు.అందు లోను నస్రాని తీరు లో చేసే బీఫ్ కి ఆదరణ ఎక్కువ.కేరళ లో ముస్లిం లు 23 శాతం,క్రైస్తవులు 19 శాతం,హిందువులు 56 శాతం ఉంటారు.పండుగలు కాని,తినడం లో గాని కలిసి మెలిసి చేసుకొనే ఆచారం మొదటి నుంచి ఎక్కువ.మతాల మధ్య అంతర్వివాహాలు సాధారణమైన విషయం.అన్ని ఫుడ్ ఐటంస్ ని బోర్డ్ మీద రాసినట్లే బీఫ్ ని కూడా రాస్తారు.1950 ల నుంచి కమ్యూనిజం  ప్రభావం ఎక్కువ కావడం,మతాల మధ్య సామరస్య ధోరణి ఇలాంటివి కేరళ ని బీఫ్ విషయం లో మిగతా రాష్ట్రాల నుంచి వేరు గా ఉంచిందని చెప్పాలి.

Thursday 18 August 2016

ఆదివాసీ ల పై పరిశోధన చేసిన విదేశీయునికి నివాళి ఈ రూపం లో....



బ్రిటన్ కి చెందిన ఆంత్రోపాలజిస్ట్ ఇంకా భారతీయ ఆదివాసీల జానపద కధలపై పరిశోధన చేసిన వెరియర్ ఎల్విన్ ని ఒక ఎనిమేషన్ పాత్ర గా సృష్టించి ఆ వ్యక్తి చేత వివిధ రాష్ట్రాల కి చెందిన గిరిజన సంస్కృతి లో ఉన్న కధలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు వివిధ రాష్ట్రాలకి చెందిన ఆదివాసి యువకులు. జార్ఖండ్,ఒడిస్సా ,అస్సాం,అరుణాచల్ ప్రదేశ్ ,మేఘాలయా లకి చెందిన వీరంతా భువనేశ్వర్ లోని సెంచూరియన్ యూనివర్శిటి లో జరుగుతున్న వర్క్ షాప్ లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.బ్రిటన్ లోని ఆదివాసి ఆర్ట్స్ ట్రస్ట్ అనే సంస్థ దీనికి సహాయపడుతున్నది.మధ్య ప్రదేశ్ లోని మంఝూర్ ఝలి కధలు,అరుణాచల్ ప్రదేశ్ లోని అబోటిని కధలు,నాగా లాండ్ లోని మేన్ టైగర్ స్పిరిట్ కధలు ,మణి పూర్ లోని తప్త కధలు,సిక్కిం లోని నై మకాల్ క్యొయంగ్ కధలు నిక్షిప్తం చేసి సి.డి లు ద్వారా విడుదల చేస్తారు.ఈశాన్య మరియు మధ్య భారత ఆదివాసి తెగల పై విస్త్రుతంగా పరిశోధనలు చేసిన వెరియర్ ఎల్విన్ ని వీటన్నిటిని వివరించే ఎనిమేటర్ పాత్ర గా సృష్టించి ఆయనకి అంజలి ఘటిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ తారా డగ్లస్ తెలిపారు.



Monday 8 August 2016

జాతీయ గీతాన్ని పాడటం లో తప్పు లేదు: ఎం.ఏ ఖలీద్



అలహాబాద్ లోని సైదా బాద్ లో ఉన్న ఒక పాఠశాల యాజమాన్యం జాతీయ గీతం పాడటాన్ని వ్యతిరేకించిన నేపధ్యం లో నేడు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.ముంబాయి లో అనేక పాఠశాలలు,కాలేజీ లను నడిపే అంజుమన్ -ఎ-ఇస్లాం ట్రస్ట్ అధ్యక్షుడు జహీర్ కాజీ ఈ చర్యని ఖండిస్తూ ముందు దేశ రాజ్యాంగాన్ని గౌరవించాలని ,జాతీయ గీతాన్ని పాడగూడదని   నిషేధించరాదని తెలిపారు.సామాజిక కార్యకర్త ఎం.ఏ.ఖలీద్ మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం అజాద్ వంటి వారే జాతీయ గీతం పాడారని,దేశ ప్రజల్ని ఏకం చేసే జాతీయ గీతాన్ని అవమానించరాదని చెప్పారు.

Sunday 31 July 2016

జైలు లో అంతర్యుద్ధం, ముగ్గురు మృతి



నిన్న శనివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ లోని సాజివ సెంట్రల్ జైలు లో సౌది అరేబియా దేశానికి చెందిన ఇద్దరు ఖైదీలు యూసుఫ్(21),అబ్దుస్(22) లు జైలు లోనే ఉన్న మరో ఖైదీ థాంగ్ మిన్లిన్ జొవ్ ని ఆయుధాల తో పొడిచి చంపారు.దాని తో రెచ్చిపోయిన మిగతా ఖైదీలంతా కలిసి ఈ ఇద్దరు ఖైదీలని కొట్టి చంపారు.ఈ సంఘటన పట్టపగలు ఒంటి గంటకి జరిగింది. మరణించిన యూసుఫ్,అబ్దుస్ ల్ని మైన్మార్ ,మణిపూర్ రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమంగా సంచరిస్తుండడం తో కొద్ది కాలం క్రిందట అరెస్ట్ చేశారు. మూడు మృత దేహాల్ని ఆసుపత్రికి పంపినట్లు మణిపూర్ రాష్ట్ర డిజిపి (ప్రిజన్స్) పి.దౌంజెల్ మీడియా కి వెల్లడించారు. 

Friday 29 July 2016

తుపాకులు అక్కడ చాక్లెట్ ల లా దొరుకుతాయి...!


 పాకిస్తాన్ లోని పెషావర్ కి 35 కి.మి. దూరం లో ఉన్న డర్రా అడాంఖేల్ అనే ఊరు తుపాకుల తయారీకి పెట్టింది పేరు.చిన్న సైజు కుటీర పరిశ్రమల్లా ఇక్కడ ఆయుధాల్ని తయారు చేస్తుంటారు.స్క్రాప్ మెటల్ ని ఉపయోగించి కలాశ్నికోవ్ ల్ని తయారు చేసే నైపుణ్యం వీరి సొంతం.వీటి తో పాటు ఇతర ఆయుధాల్ని కూడా సరసమైన ధరలకి అందజేస్తుంటారు.కొన్ని దశాబ్దాలు గా ఆయుధాల స్మగ్లర్లకి  ,డ్రగ్ డీలర్లకి ఆటపట్టు ఈ ప్రదేశం.దొంగిలించిన కార్ల నుంచి యూనివర్సిటి ఫేక్ సర్టిఫికెట్ ల దాకా ఇక్కడ తగు ధరలకి లభ్యం అవుతాయి.80 దశకం లో ముజాహిదిన్ లు సోవియట్ పై యుద్ధం ప్రారంభం చేసినప్పుడు ఇక్కడి ఆయుధాలకి మంచి గిరాకి ఉండేది. 2009 లో ఒక పోలెండ్ కి చెందిన ఇంజనీర్ ని పీక తెగ్గోసినపుడు   దీని పేరు మారుమోగింది.MP5  రకం తుపాకులు 67 డాలర్లకి లేదా ఏడువేల రూపాయలకి లభ్యం అవుతాయి.అసలు వాటికి ఇవి ఏ మాత్రం తీసిపోవు.నవాజ్ షరీఫ్ ప్రభుత్వం వచ్చిన తరువాత పరిస్థితి కొంత మెరుగుపడినా ,ఆయుధాల వ్యాపారం మాత్రం అలాగే జరిగిపోతున్నదని భోగట్టా.