Friday 30 September 2016

జయలలిత ఆరోగ్యం నిర్ధారిస్తూ ఫోటో విడుదల చేయాలి : కరుణానిధి



గత వారం రోజులు గా అనారోగ్య కారణాల తో అపోలో హాస్పిటల్ లో ఉన్న తమిళ నాడు ముఖ్యమంత్రిణి జయలలిత ఆరోగ్యం ఎలా ఉందో నిజాలు వెల్లడి చేయాలని ,అందుకు గాను ఆమె ప్రస్తుత ఫోటో ని ప్రజల కోసం పత్రికలకి విడుదల చేయాలని డి ఎం కె అధినేత కరుణానిధి డిమాండ్ చేశారు.ఆమె ని సందర్శించడానికి  వెళ్ళిన మంత్రులు పొన్ రాధాకృష్ణన్ వంటి వారు ఎందుకని ఆ విషయం లో నోరు విప్పడం లేదన్నారు.నిజాలు ప్రజలకి తెలియాలని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే అధికార పక్ష ప్రతినిధి సరస్వతి మాట్లాడుతూ వైద్యుల కోరిక మేరకు ఆమె కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారని వివరించారు.

Monday 26 September 2016

భారతీయులపై పరుష పదజాలం వాడిన పాక్ నటుడిని టీవి షో నుంచి తప్పించిన బ్రిటన్ టివి



పాక్ జాతీయుడై ఉండి  ఒక బ్రిటిష్ టీవి సోప్ లో నటిస్తున్న అన్వర్ ని అతను నటిస్తున్న సీరియల్ నుంచి తప్పించారు.కారణం అతను ట్విట్టర్ లో భారతీయుల్ని ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలే." B...s"  అని p...s drinking  c..ts అని ట్విట్టర్ లో దూషించాడు.జమ్మూ కాశ్మీర్ లో మా సోదరీ సోదరుల్ని చంపుతున్న దుర్మార్గులు భారతీయులని,వారి దగ్గర పాక్ కి చెందిన ఆర్టిస్ట్ లు ఎందుకు పనిచేస్తున్నారు..డబ్బులు ఇంకా సంపాయించడానికా..అంటూ పలు వ్యాఖ్యలు చేశాడు.దానితో ప్రస్తుతం నటిస్తున్న కోరోనేషన్ స్ట్రీట్ అనే సీరియల్ నుంచి నిర్వాహకులు తప్పించారు.ఈ అన్వర్ రెండు హాలివుడ్ సినిమాల్లో చిన్న పాత్ర లు పోషించాడు. 

Monday 12 September 2016

జీన్స్ తయారీ లోకి వస్తోన్న రాం దేవ్ బాబా ...



దాదాపు గా 500 రకాల ఉత్పత్తుల్ని స్వదేశీ పేరు తో పతంజలి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అమ్ముకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.రాం దేవ్ బాబా స్థాపించిన ఈ కంపెనీ త్వరలో జీన్స్ తయారీ లొకి దిగబోతున్నది.ఈ మేరకు ఒక విదేశీ సంస్థ తో చర్చలు జరుగుతున్నాయి.పూర్తిగా విదేశీ తరహా దుస్తులు గా చెప్పబడే జీన్స్ ని మార్కెట్ ఏ పేరు తో చేస్తారో వేచి చూడవలసిందే.1800 సంవత్సరం లో ఇటలీ లోని జెనోవా నుంచి అమెరికా కి ఈ జీన్స్ లు రావడం జరిగింది.మొదట్లో తాపీ పనివాళ్ళు,రైతులు,ఇతర మోటు పనిచేసేవారు ఈ డెనిం తో చేసిన జీన్స్ ని ధరించేవారు.పోను పోను అమెరికన్ పాప్ కల్చర్ లో ఒక భాగమయ్యి క్రమేణా అనేక దేశాల్లో జీన్స్ విస్తరించింది.

Tuesday 6 September 2016

ఆ పుస్తకాలే నన్ను తీర్చిదిద్దాయి అంటున్నదామె



Arya fell through the fault ఈ ఏడాది ఓం ప్రచురణకర్తలు పబ్లిష్ చేసిన ఈ బుక్ ని రాసినది మరెవరో కాదు ముంబాయి కి చెందిన రీనిత మల్ హోత్ర హోర అనే ఆమె,ప్రస్తుతం హాంగ్ కాంగ్ లో ఒక రేడియో లో పనిచేస్తున్నారు.ఈ కధ మొత్తం శాన్ ఫ్రాన్సిస్కో లో వలస వెళ్ళిన భారతీయ కుటుంబం నేపధ్యం లో సాగుతుంది.దీని లో ని ఆర్య అనే కుర్రవాని పాత్ర ప్రధానమైనది.ఒకవేపు భారతీయ ఇతిహాసం రామాయణం  ని తీసుకొని దానికి సమకాలీనతని జోడించారు.రీనిత ఆయుర్వేదం,ఆర్దిక సంబంధ విషయాలపై గతం లో కొన్ని పుస్తకాలు రాశారు.చిన్నప్పటినుంచి జేన్ ఆస్టిన్ రచనలు ఆసక్తి గా చదివేదాన్నని ఆ నవలల పఠనమే తనని రచయిత్రి గా తీర్చిదిద్దిందని చెబుతున్నారు.

Monday 22 August 2016

విడాకులు పొందటం కూడా కష్టం కావడమే దీనికి కారణమా...?



దంపతులు విడి పోవడం ఇంకా విడాకులు తీసుకోవడం వంటివి కేవలం పట్టణాలకి ,నగరాలకే పరిమితం కాలేదు,మన దేశం లో గ్రామీణ ప్రాంతాల్లో ఒక మాదిరి పట్టణాల్లో కూడా ఈ ట్రెండ్ పెరుగుతున్నదని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి.2011 లో తీసిన జనాభా లెక్కల్ని అనుసరించి చూస్తే ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా  పై స్థానం లో ఉంది.28,754 మంది వేరు పడిన వాళ్ళు ఉండగా, తెలంగాణా లో డైవర్స్ తీసుకున్నవాళ్ళు కరీం నగర్ జిల్లా లో ఎక్కువ గా ఉన్నారు.7,922 మంది అక్కడ సంఖ్య అని భోగట్టా.ఈ గణాంకాలు హైదరా బాద్ లోని వారి కంటే ఎక్కువ,అక్కడ వేరు పడి జీవిస్తున్న వారు 8,195 మంది కాగా కోర్ట్ నుంచి విడాకులు తీసుకున్నవారు 3,912 గా ఉంది.ఇక విశాఖ లో సెపరేట్ అయిన వారు 19,689 కాగా విడాకులు పొందిన వారు 3,782 గా ఉన్నారు.డైవర్స్ తీసుకున్న వారి కంటే ,తీసుకోకుండా వేరు గా జీవిస్తున్న వారే ఎక్కువ.దేశం మొత్తం మీద చెప్పాలంటే సెపరేట్ గా ఉంటున్న వారు 35,35,202 మంది కాగా విడాకులు పొందిన వారు 13,62,316 మంది మాత్రమే.