Sunday 15 January 2023

ఏ విదేశీ బ్రీడ్ కి తీసిపోమని నిరూపించిన దేశవాళీ వీథికుక్క


గత నెల లో భువనేశ్వర్ నగరం లో జరిగిన "నేషనల్ డాగ్ షో" పోటీ లో మన దేశం లోని వీథి కుక్కలు ఏ విదేశీ బ్రీడ్ కుక్కలకీ తీసిపోవని నిరూపించాయి. అయితే మనం వాటికి ఇవ్వవలసింది మంచి తిండి,పోషణ,తర్ఫీదు ...ఇవి గనక ఇస్తే మన వీథి కుక్కలు కూడా తమని తాము నిరూపించుకుంటాయి. విశ్వాసపాత్రత విషయం లో ఇక చెప్పేదేముంది..? అయితే మన దేశం లోని అనేకమంది కి విదేశీ బ్రీడ్ కుక్కలు అంటే వల్లమాలిన అభిమానం.లాబ్రాడర్,జర్మన్ షెప్పర్డ్,గోల్డెన్ రిట్రీవర్ లాంటి వాటికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఇహ పోతే వీథికుక్కలు...పాపం సరైన తిండి తిప్పలు లేక బతకలేక బతుకుతుంటాయి.వాటిని చూస్తేనే చాలా మందికి అసహ్యం.ఇకవాటిని పెంచేదెవరు..? చిన్నప్పుడు చూస్తే అన్నీ జీవుల్లాగే ఎంతో ముద్దుగా గంతులేస్తూంటాయి.కాలం గడిచే కొద్దీ అవీ మట్టిలో మట్టిలా తయారయిపోతాయి. ఆలనా పాలనా లేక.అయితే భువనేశ్వర్ నగరం లోని గౌరవ్ అగర్వాల్ అనే కాలేజ్ కుర్రాడు మాత్రం అందరకి మల్లే ఊరుకోలేదు.ముద్దుగా ఉండే ఓ వీథి కుక్క ని తీసుకొచ్చిపెంచుకున్నాడు.ఇంట్లో వాళ్ళు తిడతారేమోనని అది లాబ్రడర్ జాతి పిల్ల అని తనకి స్నేహితుడు ఇచ్చాడని అబద్ధం చెప్పాడు.

దాన్ని చక్కగా పెంచుతూ మంచి తర్ఫీదు ఇచ్చాడు.ఇతర విదేశీ బ్రీడ్ కి ఏ మాత్రం తగ్గకుండా మంచి తెలివిగా ఉండేది ఈ వీథి కుక్క.అన్నట్టు దానికి టామీ అనే పేరు కూడా పెట్టాడు గౌరవ్.ఒరిస్సా కెన్నెల్ క్లబ్ నిర్వాహకుల్ని సంప్రదించి జరగబోయే డాగ్ షో లో తన ఇండియన్ బ్రీడ్ కుక్కపిల్ల కి కూడా చాన్స్ ఇమ్మని అడగ్గా వాళ్ళు ఓకెయ్ అన్నారు.మొత్తం 400 కుక్కపిల్లలు 35 బ్రీడ్స్ నుంచి ఫాల్గొన్నాయి.అన్ని ఈవెంట్స్ లోనూ టామీ ప్రథమ బహుమతి ని సాధించి వీథికుక్కలంటే తమాషా కాదు అవకాశాలు ఉండేలే గాని తాము ఎవరికీ తీసిపోమని నిరూపించింది.

  దానితో వీథికుక్కల్ని అవమానించే వారి నోళ్ళు మూతబడ్డాయి.ఒడిస్సా అగ్రికల్చరల్ యూనివర్సిటి కి చెందిన ప్రొఫెసర్ నిరంజన్ పండా మాట్లాడుతూ మనం కుక్కల్ని ప్రేమించాలి తప్పా బ్రీడ్ లని ప్రేమించకూడదని దురదృష్టవశాత్తు మన దేశం లో అదే జరుగుతోందని అన్నారు.మన దేశం లోని ప్రజల మైండ్సెట్ మారవలసిన అవసరం ఉందని చెప్పారు. వీథికుక్కల్ని పెంచుకోవడం వల్ల వాటికి ఆశ్రయం దొరికి ఒక సామాజిక సమస్య కి జవాబు దొరికినట్లు అవుతుందని అన్నారు.పైగా మన వాతావరణం లో పెరిగిన కుక్కలు అనేక విధాలుగా శ్రేష్టమైనవని అన్నారు. 

--- NewsPost Network

2 comments:

  1. Yes , U are 100 percent right.As we have 2 dogs whcih we are indian breed we named the breed as street fighter.They are very good in health wise and in all other aspects

    ReplyDelete
  2. True. Hope that there will be a good future for the stray dogs.

    ReplyDelete