Saturday 2 September 2017

ఆ రచయిత ని ముప్పతిప్పలు పెడుతున్న జార్ఖండ్ వాసులు..


హన్స్ దా సౌవేంద్ర శేఖర్ (34) జార్ఖండ్ లోని పకూర్ జిల్లా లో బేల్ దంగా అనే బ్లాక్ లో ప్రభుత్వ వైద్యుని గా పనిచేస్తున్నారు.దానితో పాటు ఈయన రచయిత కూడా.ద ఆదివాసి విల్ నాట్ డాన్స్ అనే కధల సంపుటిని రెండేళ్ళ క్రితం వెలువరించాడు.ఈ ఆంగ్ల పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం కూడా దక్కింది అంతేకాదు హిందూ పేపర్ దీనికి ఉత్తమ ఫిక్షన్ కి ఇచ్చే పురస్కారం ఇచ్చింది.అయితే ఈ పుస్తకం ఇటీవల హిందీ భాష లో అనువాదం కావడం తో చదివిన జార్ఖండ్ వాసులు చాలామంది ఆగ్రహం తో ఊగిపోతున్నారు. సంతాలీ ఆదివాసి స్త్రీలని అవమానించే విధంగా వర్ణనలు ఉన్నాయని ఇంకా స్థానిక నాయకులైన వారిని చిన్నబుచ్చే కొన్ని కధలున్నాయని అంటున్నారు.జార్ఖండ్ రాష్ట్ర విముక్తి కై పోరాడిన నిర్మల్ మహతో పేరు ని ఒక దుష్ట పాత్రకి పెట్టారని ,ఆదివాసి దేవుళ్ళని,సంస్కృతిని కించపరిచే విధంగా ఈ పుస్తకం ఉందని కనుక సెప్టెంబర్ 4 లోపు ఈ పుస్తకానికి సంబందించిన అన్ని కాపీల్ని తగలబెట్టాలని వివిధ సంఘాలు పిలుపునిచ్చాయి.

అయితే హన్స్ దా ని సమర్దిస్తూ కొంతమంది మేధావులు సంతకాల సేకరణ చేస్తున్నారు. ఫేస్ బుక్ , ట్విట్టర్ ల లో దుమ్మెత్తి పోసుకుంటూ మొత్తానికి ఈ రచయిత కి పెద్ద పబ్లిసిటీ నే చేస్తున్నారు.ఈ రోజు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు భోగట్టా.అయితే ఈ రచయిత కూడా సంతాలీ తెగ కి చెందిన వారే.అదీ కొసమెరుపు.   

Thursday 24 August 2017

ఆ నటుడి కోసం 57 కేజీల ఇడ్లీ తయారు చేశారు.


తమిళ సినీ అభిమానుల స్టైలే వేరు.ఈ రోజు 24 న అజిత్ నటించిన వివేగం విడుదల అయిన సందర్భం గా చెన్నై లోని రాయపురంలో 57 కేజీల ఇడ్లీని తయారు చేశారు.ఎందుకంటే ఆ నటుడికి ఇది 57 వ సినిమా మరి.తమిళనాడు సమయిల్ కాలై తొళిలార్ మున్నేట్ర సంఘం ఆధ్వర్యం లో ఈ వంటకం వండి రాయపురం  లోని భరత్ థియేటర్ వద్ద ప్రదర్శనకి పెట్టారు.ఈ ఇడ్లీ మీద అజిత్ ముఖం ఉబ్బినట్లుగా చేశారు.గతం లో కూడా అబ్దుల్ కలాం,కవి భారతీయర్,కామరాజర్,మదర్ థెరిసా ఇలాంటి వారి ముఖాలతో ఇడ్లీలు తయారు చేశారు వీళ్ళు.   

Tuesday 15 August 2017

మేఘాలయ వెళితే ఈ నది అందాలు చూడాలిసిందే...!



మేఘాలయా రాష్ట్రాన్ని చూడవలసి వస్తే షిల్లాంగ్ తో పాటు ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయి.ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకా ఇతర రాష్ట్రాల లో లాగా పర్యావరణ విధ్వంసం ప్రారంభం కాలేదు.ఉమంగట్ నది ఇప్పుడు టూరిస్ట్ ల్ని బాగా ఆకర్షిస్తోంది.ఈ నది లోని నీళ్ళు తేటా తెల్లం గా అడుగు భాగం చక్కగా కనబడేలా ఉంటుంది.చలి కాలం లో మరీ బాగుంటుంది.మన దేశీయులు తో బాటు బంగ్లా దేశీయులు ఉమ్మడి గా దీని లొని చేపల్ని పట్టుకుంటారు.ఒక  రౌండ్ వేసి రావడానికి పడవల వాళ్ళు మూడు వందల రూపాయాలు వసూలు చేస్తున్నారు.  

Sunday 6 August 2017

భారతీయ సంతతి కి చెందిన డాక్టర్ అమ్మాయి ని నిద్ర లేపబోయినందుకు అరెస్ట్ అయ్యాడు.



28 ఏళ్ళు గల  విజయకుమార్ కృష్ణప్ప అనే డాక్టర్ అమెరికా లోని నెవార్క్  ఇంటర్నేషనల్ విమానాశ్రయం లో దిగుతూ విమానం లో తన సీటు పక్కనే ఉన్న మరో సీటు లో నిద్రపోతున్న ఒక టీనేజ్ ప్రయాణీకురాల్ని లేపుదామని ఆమె మీద చేయి వేసి తట్టాడు.దానితో ఆ అమ్మాయి తన పేరెంట్స్ తో ఈ విషయం చెప్పి తన తొడ పై చెయ్యి వేసి  లేపినట్లుగా ఆరోపిస్తూ అక్కడి పోలీస్ లకి ఫిర్యాదు చేశారు. ఇది గత జూలై 23 న జరిగింది.కాగా రికార్డ్ అయిన సిసిటివి ఫుటేజ్ ల సాయం తో ఆ డాక్టర్ ని గుర్తుపట్టి అరెస్ట్ చేశారు.ఆపై బాండ్ మీద బెయిల్ ఇచ్చినట్లు సమాచారం.  

Monday 17 July 2017

తెలుగు కుర్రాణ్ణి తన బర్త్ డే పార్టీ కి పిలిచిన హృతిక్ రోషన్...ఇంతకీ అతనెవరో తెలుసా..?



తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన దాసరి వెంకట విశ్వనాధ్ ని బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ గత జనవరి లో జరిగిన తన పుట్టిన రోజు వేడుకకి అతిధి గా ఆహ్వానించాడు.విశ్వనాధ్ రెండు ఇంగ్లీష్ నవలలు రాశాడు ఇప్పడిదాకా.మొదటిది ఫారో అండ్ కింగ్ కాగా రెండవది ది విక్టోరియన్ అనేది.విశ్వనాధ్ స్వతహ గా హృతిక్ అభిమాని. ట్విట్టర్ ద్వారా తన అభిమానాన్ని చాటి పుస్తకాలను పంపాడు.వాటిని మెచ్చుకుని విశ్వనాధ్ ని తన బర్త్ డే కి ఆహ్వానించాడు. ఫోటో ఫోబియా ఇంకా నైస్టగమస్ అనే కంటి సంబంధ మైన సమస్యలతో  బాధపడుతున్నా వాటిని లెక్క చేయకుండా పురోగమిస్తున్న తెలుగు కుర్రాణ్ణి అభినందించాడు హృతిక్ రోషన్. 

Saturday 8 July 2017

రక్షణ దళాల అలవెన్స్ లు ఇలా పెరిగాయి



సియాచిన్ వంటి దుర్గమ ప్రదేశాల్లో పనిచేసే సైనికులకి అలవెన్స్ లు రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయి.గతం లో ఇవి రూ.14000 ఉండగా 30000 కి పెరిగాయి.ఆఫీసర్లకి 42500 దాకా పెరిగాయి.అంతే కాదు CRPF వంటి పేరా  మిలటరీ దళాలకి ఇంకా ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో  పనిచేసే వారికి సైతం 7వ వేతన కమీషన్ పెంచింది.శాంతి భద్రతలు ఉన్న ప్రదేశాల్లో పని చేసే దళాలకి రేషన్ సౌకర్యాన్ని ఎత్తి వేస్తున్నట్లు నిన్న గెజిట్ లో ప్రకటించారు.   

Friday 23 June 2017

మరో 39 స్మార్ట్ సిటీలను ఈ రోజు ప్రకటించారు..తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవి ఏమిటంటే...



ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మరో 30 స్మార్ట్ సిటీలను ప్రకటించింది.ఆంద్ర నుంచి అమరావతి,తెలంగాణా నుంచి కరీం నగర్ ఈ జాబితా లో చోటుచేసుకున్నాయి. అయితే చత్తిస్ ఘడ్ నుంచి నయా రాయ్ పూర్ ,బిలాస్ పూర్ రెండు సెలెక్ట్ కాగా తమిళ నాడు నుంచి తిరునల్వేలి,తూత్తుకుడి,తిరుచిరాపల్లి మూడు నగరాలు ఎన్నిక అయ్యాయి.మిగతావి వేరే రాష్ట్రాలకి చెందినవి.మొత్తం మీద ఈ విడత ప్రకటన తో 90 నగరాలు స్మార్ట్ సిటీలు గా ప్రకటించినట్లు అయింది.వీటన్నిటికి కలిపి 1,91,155 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయనున్నది.