నిన్న గురువారం అయిదుగంటల సమయానికి నాగాలాండ్వాసులు రాష్ట్రం లోని దిమా పూర్ లోసెంట్రల్ జైల్ నిముట్టడించి అక్కడని నుంచి రేప్ నిందితుడు సయద్ ఫరీద్ ఖాన్ ని లాగి బయటకి తీసుకు వచ్చి బట్టలు విప్పి ఒక వాహననికి కట్టి నగరం నడిబొడ్డు లో ఉన్న క్లాక్ టవర్ దగ్గరకి ఈడ్చుకుంటూ వచ్చారు.ఈ లోగా జనాలు తన్నిన దెబ్బలకి తాళలేక నిందితుడు ఆ క్లాక్ టవర్ దగ్గరకి చేరేసరికి శవంగా మారిపోయాడు.దీనిలో వేలాది జనం తండోపతండాలుగా ఫాల్గొనడటం తో రక్షక సిబ్బంది కూడా ఏమీ చేయలేకపోయారు.
నిజానికి ఈ రేప్ ఫిబ్రవరి 23 న జరిగింది.బాధితురాలు నాగా యువతి కాగా రేపిస్ట్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యాపారి గా తెలుస్తున్నది.అతని పేరు సయద్ ఫరీద్ ఖాన్ (35).అప్పటినుంచే ఆందోళనకారులు పోలీస్ ఠాణాల వద్ద తమ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు సత్వర న్యాయం చేయమని.ప్రశాంత పరిస్థితులు నెలకొల్పడానికి పోలీసులు చేసిన పనులు చివరకి విఫలమై నిందితుడు కోపోద్రిక్తులైన జనాల చేతిలో కన్నుమూశాడు.Click here

No comments:
Post a Comment