"సిటీ ఆఫ్ గాడ్ " పోర్చుగీస్ సినిమా. కాని ఆంగ్లం లో సబ్ టైటిల్స్ ఉండటం వల్ల హాయిగా చూడవచ్చు. నిజానికి ఇది భీభత్స రసం నింపుకున్న చిత్రం. ప్రపంచ సినీ చరిత్ర లో పేరెన్నిక గన్న సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. 2002 లో బ్రెజిల్ లోనూ,2003 లో ప్రపంచం అంతటా విడుదల అయింది. పోర్చుగీస్ భాష లో Cida de deus అనే పేరు తో రిలీజ్ అయింది.
1997 లో ఇదే పేరు తో Paulo lins అనే రచయిత రాసిన నవల ఆధారం గా నిర్మించారు.దానికి కొన్ని నిజమైన విషయాల్ని ఆ రోజుల్లో జరిగిన సంఘటన ల నుంచి తీసుకుని జోడించారు.రియో డి జనేరో నగరం లో ఉన్న ఓ శివారు ప్రాంతం ఫావెల దగ్గర దీన్ని ఎక్కువగా చిత్రించారు.డ్రగ్ మాఫియా అనేది యువకుల్ని ఇంకా చిన్న పిల్లల్ని ఎలా ఉపయోగించుకున్నదీ ,దానికి వాళ్ళు ఎలా బలి అయిందీ కళ్ళ కి కట్టినట్లు చూపించారు.
నటీ నటులు చాలామంది ని స్థానికంగా ఉన్నవారినుంచే తీసుకున్నారు.ఆ తర్వాత వారికి కొన్ని రోజులు తర్ఫీదు ఇచ్చారు.అందుకే సినిమా చాలా సహజం గా జరుగుతున్నట్లుగా ఉంటుంది.సినిమా మొదలు కావడమే ఓ కోడిని తరుముతూ మొదలు అవుతుంది.ఆ కాలనీలు,నల్ల వాళ్ళ స్థితిగతులు ,దారిద్ర్యం,పిస్తోళ్ళు సంతలో దొరికినట్లు అందుబాటు లోకి రావడం Alexandre Rodrigues ఇంకా Knockout Ned గ్యాంగ్ ల మధ్య పోరాటాలు వళ్ళు గగుర్పాటు కలిగిస్తాయి.
No comments:
Post a Comment