Showing posts with label ఇతర వార్తలు. Show all posts
Showing posts with label ఇతర వార్తలు. Show all posts

Friday 5 September 2014

టార్గెట్ ని సాధించడం లో సింగరేణి వెనుకంజ



బొగ్గు ఉత్పత్తి లో అనేక మైళ్ళు రాళ్ళు అధిగమించిన సింగరేణి కాలరీస్ గత కొంత కాలంగా టార్గెట్ ని అధిగమించడం లో సఫలం కాలాదని తెలుస్తోంది.ఈ ఆర్దిక సంవత్సరం లో SCCL 54 మిలియన్ టన్నుల బొగ్గుని ఉత్పత్తి చేయాలని నిర్దేశించుకున్నది.గత ఆగస్టు నెలకి చూసుకుంటే ఈ అయిదు నెలలకి గాను కరీం నగర్, ఆదిలాబాద్,వరంగల్,ఖమ్మం జిల్లాల లోని ఉత్పత్తి 20.10 మిలియన్ టన్నులు గా ఉండాలి.అయితే ఉత్పత్తి మాత్రం 17.27 మిలియన్ టన్నులు గా మాత్రమే తేలింది.గత నెలలో జరిగిన ఇంటింటి సర్వే సంధర్భంగా సెలవు,ఇంకా కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడం లో ప్రభావాన్ని చూపాయని అంటున్నారు. Click here

Saturday 2 August 2014

మీకు విలేకరి గా వ్యవహరించాలని ఉందా..?



మీరు మారుమూల పల్లె లో ఉండవచ్చు,లేదా నగరం లో ఉండవచ్చు.మీ పరిసరాల్లో జరిగే కల్చరల్ యాక్టివిటీస్ ని మా న్యూస్ వెబ్ సైట్ ద్వారా ప్రపంచానికి తెలియపరచవచ్చు.సాహిత్య పరమైన,సంగీత పరమైన సమావేశాల గురించి కావచ్చు..ఇంకా మీ చుట్టూ ఉన్న గుళ్ళు గోపురాలు కావచ్చు,ప్రాచీన కట్టడాలు కావచ్చు..చూడదగిన ప్రదేశాలు కావచ్చు.ఇలాంటి వాటి గురించి మీరు సంక్షిప్తంగా రాసి పంపితే ప్రచురిస్తాము.ఒక ఫోటోని కూడా జత చేయవచ్చు.మీరు ఒరిజినల్ ఫోటోలని మాత్రమే పంపాలి ..గూగుల్ లోనుంచి తీసుకోవద్దని మనవి.తెలుగు లో గాని,ఇంగ్లీష్ లో గాని 300 పదాల వరకు రాయవచ్చు. అవసరమైతే ఎడిట్ చేసుకుంటాము.ఇది స్వచ్చందం గా చేయవలసినదే తప్ప ఎలాంటి రెమ్యూనరేషన్ మేము ఇవ్వలేము.

మా  ఈ-మెయిల్ కి మీ వార్తలు పంపవచ్చును.(gitika232@gmail.com)    

Saturday 12 July 2014

సెక్స్ ఎడిక్షన్ కూడా డ్రగ్ ఎడిక్షన్ లాంటిదే.



సెక్స్ ఆసక్తి ని మోతాదు కి మించి కలిగిఉన్న కొంత మంది వ్యక్తుల పై పరిశోధన చేసినపుడు అలాంటి భావాలు కలిగినపుడు వారి బ్రెయిన్ చర్యలు కూడా డ్రగ్ ఎడిక్షన్ కలిగిన వారికి లాగానే కనిపించాయని అంటున్నారు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. పోర్నోగ్రఫీ ని బాగా చూస్తూ సెక్స్ పట్ల విపరీతమైన ఎడిక్షన్ ని కలిగిన వారి బ్రెయిన్ యాక్టివిటీ మీద ఇటీవల జరిగిన పరిశోధనలని శుక్రవారం వారు వెల్లడించారు. Click here

Monday 23 June 2014

పెద్ద చేప కి వచ్చిన పెద్ద తిప్పలు (విశేష వార్త)



13 నెలల కాలం లో అంటే ఫిబ్రవరి 2013 నుండి ఇంచుమించు ఇప్పటిదాకా 15 పెద్ద చేపలు (Whale Sharks) తూర్పు తీరం లోని గోదావరి ప్రాంతం లో చంపబడినాయి.ఈ సంఖ్య ఒక రకంగా ఆందోళన కలిగించేదే.ఎందుకంటే గత వంద సంవత్సరాల్లో అంటే 1890 నుంచి లెక్కవేసుకుంటే చంపబడినవి మొత్తం 20 మాత్రమే.ఈ Whale sharks ని అతి పెద్ద చేపలుగా పరిగణిస్తారు.(Largest living non-mammalian vertebrate) గా చెబుతారు.రమారమి 40 అడుగుల పొడుగు,21.5 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుందిది.

పులిని సం రక్షించడానికి ఎంత ప్రాముఖ్యత నిస్తారో ఈ పెద్ద చేప జాతిని రక్షించడానికి ప్రభుత్వం అంత ప్రాముఖ్యతనిస్తున్నది.భార వన్మృగ సమ్రక్షణ చట్టం (protection) Act-1972 ప్రకారం ఈ ప్రాణిని చంపిన వారికి 7 ఏళ్ళదాకా జైలుశిక్షని,జరిమానా తో కలిపి విధించవచ్చు.

ప్రపంచం లో చాలా చోట్ల ఈ పెద్ద చేపని టార్గెట్ చేసి చంపుతున్నారు.1990 దశకం లో గుజరాత్ తీరం లో ఈ చేపల్ని బాగా టార్గెట్ చేసి చంపివేశారు.గోదావరి ప్రాంతం లో మాత్రం ప్రత్యేకంగా టార్గెట్ చేయడం లేదుగాని మత్స్యకారుల వలలో పడితే మాత్రం బయటికి లాగి చంపి కోసివేయడం జరుగుతుంది.

ఈ చేప గనక వల లో పడితే 30 వేల నుండి 50 వేల రూపాయలు ఖరీదు చేసే విలువైన వారి వలలు ఎందుకూ పనికి రాకుండా పోతాయి.మళ్ళీ దీన్ని బయటికి తీసిన తరువాత కోయడానికి 3 వేల నుంచి 5 వేల దాకా ఖర్చు అవుతాయి.కనుక అయినంతవరకు జాలరులు అమ్మివేస్తారు.22  అడుగుల ఈ పెద్ద చేపని 15 వేలు కి భైరవపాలెం లో అమ్మినట్లు వార్తలు చెప్తున్నాయి.ఈ మర్చి నెలలో 15 అడుగులున్న ఇంకో చేపని 10 వేలకి అమ్మినట్లు భోగట్టా.

ఈ పెద్ద చేపని సమ్రక్షించడానికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల గురించి చేపల వేటగాళ్ళకి పెద్దగా తెలియదు.గుజరాత్ లో ఈ చేపని సముద్రం లో దొరికినపుడు మళ్ళీ దాంట్లో వదిలివేస్తే గనక 25 వేల రూపాయల రివార్డ్ ని ఇస్తారు.మన రాష్ట్రం లో అలాంటి స్కీం EGREE Foundation ద్వారా పైలట్ ప్రాజెక్ట్ గా తూ.గో.జిల్లా లో అమలుపరుస్తున్నట్లు సమాచారం.Click here

 -----News Post Special Desk 

Saturday 21 June 2014

ఆదాయాన్ని పెంచుకుంటున్న తాలిబన్లు (విశేష వార్త)



ఒక వైపు అమెరికా తన దళాలను ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఉపసమ్హరించుకోవడానికి ఉద్యుక్తురాలవుతుండగా,మరో వైపు యునైటెడ్ నేషన్స్ కి చెందిన రిపోర్ట్ లు ఆందోళనకరంగా బయటికి వస్తున్నాయి.తాలిబన్లు ధన సంపాదనలో కొత్తపుంతలు తొక్కుతూ ఫండ్స్ ని విపరీతంగా సేకరిస్తున్నాయని ..ఇవి జీహాది ఉగ్రవాదులకు ఉపయోగపడే దిశగా ఉంటున్నాయని తెలుపుతున్నాయి.

గత ఏడాది గంజాయి సాగుతో వచ్చిన ఆదాయం వారికి ఇబ్బడిముబ్బడిగా ఉన్నది.ఇదిగాక extortion వంటి పద్ధతులనుంచి,సహజ వనరులను అక్రమంగా సేకరించడం ద్వారా కూడా ఆదాయం సేకరిస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ లోని హెల్మండ్ ప్రాంతం ఓపియం పంటకి ప్రసిద్ది చెందింది.Poppy ని పండించడం ఇక్కడ నిత్యకృత్యం.ఇలాంటి మాదక ద్రవ్యాల పంటల్ని పండించటానికి డ్రగ్ స్మగ్లర్లు రైతులకి రుణాలు,ఫర్టిలైజర్లు అందజేస్తుంటారు.రైతులు తమ ఆదాయం లో 10 శాతం ని తాలిబన్ లకు పన్నుగా చెల్లించాలి.ఇప్పటికే ఈ ఏడాదికి దాదాపు 50 మిలియన్ డాలర్ల ఆదాయం వారికి సమకూరింది.

హెల్మండ్ నుంచి ఉత్పత్తి అయ్యే Onyx-Marble గనుల నుంచి ఏడాదికి 10 మిలియన్ డాలర్ల కి పైగా తాలిబన్లు పొందుతుంటారు.పాకిస్తాన్ లోని తాలిబన్ నాయకత్వానికి దీని నుంచి 80 శాతం వెళుతుంది.అక్కడి వివిధ గ్రూపులకి మళ్ళీ తిరిగి ఈ నిధుల్లోనుంచి పంపిణీ చేస్తారు.

మనీ లాండరింగ్ ద్వారా కూడా ఆర్దిక వనరులను వివిధ రూపాల్లో పెంచుకుంటున్నారు.ఈ వ్యవహారాలకి సంబందించి మాలిక్ నూర్జాయ్,అతని సోదరుడు ఫైజుల్లా నూర్జాయ్ యునైటెడ్ నేషన్స్ చేత ఎత్తిచూపించబడినప్పటికి వాళ్ళు వేరే covering business లను ఎన్నుకుంటున్నారు.

ఈ ఫండ్స్ లో వాటా కోసం కొత్త జీహాది గ్రూపులు పుట్టుకొస్తున్నాయి.Al-fath,Tora bora,Fidayano mahaz  ఇలాంటివి అలా వచ్చినవే.ఆ చివరి సంస్థ ని నిర్వహించేది తాలిబన్ టాప్ కమాండర్ అయిన ముల్లా దాదుల్లా అబ్దుల్లా సోదరుడే.ఆల్ ఫత ని నిర్వహిస్తున్నది మరో యుద్ధ ప్రభువు గుల్బుద్దీన్ హక్మత్యార్ అనుచరులు.ఇక తోరా బోరా ని నడిపేది ఒసామా ని ఆఫ్ఘనిస్తాన్ కి మొదట ఆహ్వానించిన యూనస్ ఖలిస్ తనయుడే..!

ఈ ఆర్దికలావాదేవీ ల్లో ఒక్కోసారి రక్తపాతం కూడా జరుగుతుంది.లగ్మన్ ప్రావిన్స్ లో తాలిబన్ ప్రధాన నేతల్లో ఒకరిపై గత ఏడాది చివరిలో హత్యా యత్నం జరిగింది.తాలిబన్ సిద్ధాంతకర్త ల్లో ఒకరైన అబ్దుల్లా జకేరి ని ఇలాంటి వివాదం లోనే కాల్చిచంపారు.

తాలిబన్ కమాండర్ల లో ప్రముఖులైన అబ్దుల్ ఖయ్యుం జకీర్,ముల్లా ఘాజీ,అఖ్తర్ మహమ్మద్ మన్సూర్ షా మహమ్మద్ ...ఆర్దిక వ్యవహారాల కమిటీ చీఫ్ ఇషక్జాయ్ వీరంతా ఓపియం సాగు ద్వారా వస్తోన్న సంపాదన విషయంలో అంతర్ వివాదాలతో తలమునకలై ఉన్నారని భావిస్తున్నారు.

             ---News Post Special Desk 

Friday 20 June 2014

పక్షులు తమ గుడ్లమీద సంతకాలు పెడతాయా..?



అవును...అంటున్నారు హార్వార్డ్ యూనివర్సిటి కి చెందిన మేరీ కాస్వెల్.తమ గుడ్లని గుర్తు పట్టేందుకు వీలుగా వాటిమీద చిన్న పిగ్మెంటేషన్లు ఉండేలా పక్షులు జాగ్రత్త తీసుకుంటాయని...దానివల్ల కుక్కూ లాంటి పక్షులు తన గుడ్లని వీటి గుడ్లలో కలిపేసినా గుర్తు పట్టేసి అవతల పెట్టేస్తాయని అంటున్నారు.కుక్కూ లాంటి పక్షులు పొదగడానికి బద్దకించి వాటి గుడ్లని ఇతర పక్షుల గూళ్ళలో పెట్టేస్తుంటాయి.ఈ బాధని తప్పించుకోవడానికి వాటర్ మార్క్ ని కరెన్సీ మీద ఎలా వేస్తుంటారో ఈ పక్షులు సైతం తమ గుడ్లమీద అలాంటి ముద్రలు వేస్తుంటాయిట.ముఖ్యంగా ఎనిమిది రకాల పక్షులు ఇలా చేస్తుంటాయిట.Click here

Thursday 5 June 2014

శారదా చిట్ ఫండ్ ఏజంట్ల బాధలు చెప్పనలవి గానివి ( విశేష వార్త)



పశ్చిమబెంగాల్,ఒడిశా,అసోం,త్రిపుర నాలుగురాష్ట్రాల్లో అసంఖ్యాకమైన సంఖ్యలో ఏజంట్లను నియమించుకొనికొన్ని వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని దిగమింగి చేతులెత్తేసిన "శారదా చిట్ ఫండ్" కంపెనీ ప్రస్తుతం దేశం లో హాట్ టాపిక్ గా మారింది.

ముధురాపుర్ గ్రామం కలకత్తా నగరానికి తూర్పుగా 5కి.మి.దూరం లో ఉంటుంది.అయితే ఇక్కడికి చేరుకోవడానికి సరైన వాహన సౌకర్యం కూడ ఉండదు.24 పరగణాల జిల్లా లోకి వచ్చే ఈ ఊరికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలిసిందే.

ఇక్కడ నివసించే శిబానీదాస్ అనే మహిళ శారదా చిట్ ఫండ్ ఏజంట్ గా పనిచేసేది.రోల్డ్ గోల్డ్ నగలు అమ్మే వేరే చిన్న వ్యాపారం కూడా ఈమెకి ఉంది.2012 లో ఏజెన్సీ తీసుకున్న ఈమె 100 మంది దగ్గరనుంచి కొన్ని లక్షల రూపాయలు సేకరించింది.అంతేకాదు ఆమె కింద కొంతమంది ఏజంట్లని కూడా చేర్పించింది.ఒకటిన్నర లక్షల రూపాయలు శిబానీ కూడా పొదుపు చేసింది.ముందు వడ్డీ బాగానే వచ్చింది.2500 కోట్ల రూపాయలకి కంపెనీ శఠగోపం పెట్టడంతో ఈమె లాంటి ఏజంట్ల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి.

ఈమెని  నమ్మి ఆ చిట్ ఫండ్లో డబ్బులు పెట్టినవారంతా ప్రస్తుతం  వత్తిడి పెడుతున్నారు. మాడబ్బులైనా ఇవ్వు లేదా..లేదా నువ్వైనా మాతో పడుకో అని పచ్చిబూతులు తిడుతున్నారు అని ఆమె వాపోతున్నది.పొద్దుటే బయటికి వెళ్ళిపోయి చీకటి పడినతరువాత వచ్చి ఇంట్లో పడుకుంటున్నానని శిబాని తెలిపింది.చాలామంది ఏజంట్ల జీవితాలు ఇలాగే తయారయ్యాయి.

శారదా చిట్ ఫండ్ ప్రధాన కేంద్రం కలకత్తా నగరం.దాని అధినేత సుదీప్తో సేన్ అనేది తెలిసిన విషయమే.నాలుగు రాష్ట్రాల్లో అంటే బెంగాల్,ఒడిశా,అసోం,త్రిపుర లలో మొత్తం ఈ కంపెనీకి 10 లక్షలమంది ఏజంట్లు ఉన్నారు. వాళ్ళలో చాలామంది పరిస్థితి శిబానీ లాగానే ఉన్నది.

పెట్టిన పెట్టుబడివరకైనా తిరిగి చెల్లిస్తామని పశ్చిమ బెంగాల్ రాష్ట్రప్రభుత్వం ముందు హామీ ఇచ్చిన ..ప్రస్తుతం ఆ విషయాన్ని పట్టనట్లే వ్యవహరిస్తున్నది.తృణమూల్ పార్టీలోని అగ్రనాయకులకి,శారదా చిట్ ఫండ్ అధినేత కి మధ్యగల సంబంధాల వల్ల ఈ కంపెని ని నమ్మి జనాలు మదుపు చేసిన మాట వాస్తవం.

2013 లో శారదా గ్రూప్ ఏర్పాటు చేసిన ఒక మీటింగ్ లో కూడా తృణమూల్ మంత్రులు ఈ కంపెనీ ఏజంట్లుగా చేరమని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. శారదా గ్రూప్ ని ముట్టుకునే సత్తా ఎవరికీ లేదని బాహాటంగా ప్రచారం చేసేవారు.తీరా అలంటి నాయకులంతా ప్రస్తుతం మొహం చాటు వేస్తున్నారని ఏజంట్లు అంటున్నారు.

రవాణాశాఖా మంత్రి అమిత్ మిత్రా ఆనాడు మాట్లాడిన ప్రసంగాన్ని సైతం కొంతమంది యూట్యూబ్ లో పెట్టారు.దీపికా దాస్ అనే గృహిణి మాట్లాడుతూ తాను 75 వేల రూపాయల్ని మదుపు చేశానని చేతికి పైసారాలేదని వాపొయింది.దీదీ ఆశీర్వాదం తమ కంపెనీకి ఉన్నాయని ఏజంట్లు ప్రచారం చేయడం వల్ల పెద్ద ఎత్తున జనం పెట్టుబడులు పెట్టారని చెప్పింది.అది ప్రభుత్వ సంస్థ, ప్రయివేట్ సంస్థ అనేది తమకి తెలియదు అని తృణమూల్ ఎం.పి.లు శతాబ్ది రాయ్ లాంటివాళ్ళు ఈ శారదా గ్రూప్ ఆఫీసులని అట్టహాసంగా ప్రారంభించేవారని ఆ నమ్మకం తోనే చేరి మునిగామని తెలిపింది.

మూడేళ్ళలో పెట్టుబడి రెండింతలు అవుతుందని,ఏడేళ్ళలో నాలుగు రెట్లు అవుతుందని,పన్నెండేళ్ళలో పదిరెట్లు అవుతుందని మాకు ఏజంట్లు చెప్పి తీరా ఇలా ముంచారని దీపికా అన్నది.ఈ కంపెనీ వాళ్ళు అంబులెన్స్ లు విరాళంగా ఇచ్చేవారు.అలాగే స్థానిక దుర్గ పూజ ఉత్సవాలకి కూడా విరాళాలు ఇచ్చేవారు.దీనికి రాష్ట్రమంత్రులు సైతం హాజరయ్యేవారు.అది చూసి జనాలు ఆకర్షితులయ్యారు.ఓ మైక్రో ఫైనాన్స్ లో అప్పుతీసుకొని,ఎక్కువ వడ్డీ వస్తుంది కదాని శారదా గ్రూప్ లో పెట్టినవాళ్ళుకూడా ఉన్నారు.

శ్యామల్ సేన్ కమీషన్ కంపెనీ కి గల ఆస్తులని వేలం వేయడానికి ఆదేశమిచ్చింది.అయితే మమతా సర్కారు ప్రజలకి వారి సొమ్ముని తామే చెల్లిస్తామని ,ఆందోళన చెందనవసరం లేదని ముందు ప్రకటించింది.ప్రస్తుతం సుప్రీం కోర్ట్ ఈ కేసు ని CBI కి అప్పగించమని ఆదేశించడం తో దీదీ ప్రస్తుతం మాట మార్చి కేంద్రప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని తమకి సంబంధం లేదని ఎదురుతిరిగింది.దీంతో జనాల పరిస్థితి దారీతెన్ను లేకుండా అయింది.

ఒడిశా రాష్ట్రం సుప్రీం కోర్ట్ తీర్పుని స్వాగతించింది.దీంట్లో ఇన్వెస్ట్ చేసిన నాలుగు రాష్ట్రాల ప్రజల్ని నిలువునా ముంచారని,దీని ప్రభావం గ్రామీణ ఆర్దిక వ్యవస్త పై దారుణంగా ఉంటుందని ఆశిం చటర్జీ అన్నారు.ఈ శారదా చిట్ ఫండ్ తో పాటు మిగతా చిట్ ఫండ్ స్కాం లని కూడా పరిశోధించమని సుప్రీం కోర్ట్ ఆదేశించింది. Rose valley ఇంకా సన్మార్గ్ చిట్ ఫండ్ వంటి  12 ఇతర కంపెనీలు కూడా ఈ దెబ్బకి భయపడుతున్నాయి.

సుదిప్తో సేన్ స్కాం చేసిన ధనాన్ని మొత్తం ఎక్కడికో తరలించి ఉండవచ్చునని ,నళినీ చిదంబరం లాంటి రాజకీయ పలుకుబడిగల న్యాయవాదులు అతని అమ్ములపొదిలో ఉన్నారని కాబట్టి ఏమి జరుగుతుందో ఊహించలేమని కొందరు అభిప్రాయపడుతున్నారు.రాష్ట్రం లోని కాంగ్రస్ పార్టి నాయకులు రంజన్ చౌధురి,సి.పి.ఎం.నాయకులు గౌతం దేబ్ వంటివారు పరిశోధన నిష్పక్షపాతంగా సాగాలని కోరుతున్నారు.

            --News Post Special Desk   

Tuesday 27 May 2014

టి.వి. వచ్చిన తరవాత రేడియో కనుమరుగయింది..దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్తారు..?



Ex:  Radio became obsolete after the invention of Television. 

Obsolete means out of date

Deterrent అనే పదాన్ని ఎలా ఉపయోగించవచ్చు...?



Deterrent అనే పదానికి అర్ధం చెప్పుకోవాలంటే ఒకరిని ఓ పని చేయకుండా ఆపేది అని చెప్పాలి.ఇంకా ఇంగ్లీష్ లో వివరించాలంటే A thing that discourages someone from doing something).

EX: New laws would act as a deterrent to spammers. Click here

Wednesday 30 April 2014

అతను కోపాన్ని దాచుకోలేకపోయాడు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పవచ్చు...?

అతను కోపాన్ని దాచుకోలేకపోయాడు

He couldn't conceal his anger...!

ఇప్పుడర్ధమైంది గదా conceal  అనే పదం ఎలా ఉపయోగపడుతుందో... ఏ context లో ఉపయోగిస్తారో..!Click here

  

Friday 18 April 2014

రవీంద్రనాధ్ ఠాగూర్ ని గడ్డం లేకుండా చూశారా..? అయితే ఇక్కడ చూడవచ్చు..!




ఈయన ఎవరో కాదు మనందరికీ బాగా తెలిసిన విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ మహాశయుడే..! 1904 లో వాళ్ళ తండ్రి గారి మరణాంతరం తీసిన ఫోటో ఇది.Click here

Monday 14 April 2014

తేనె వల్ల ముఖ్యంగా కలిగే ప్రయోజనాలేమిటో తెలుసా..!



గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం,తేనె కలిపి ప్రతి రోజు  తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.లివర్ లో మరింత బైల్ ని ఉత్పత్తి చేసి శరీరానికి అవసరం లేని టాక్సిన్స్ ని బయటకి వెళ్ళగొడుతుంది.పేగుల్లో మ్యూకస్ యాక్టివేట్ కావడం లో సహకరిస్తుంది.ఇంఫెక్షన్స్ ఇంకా  హానికరమైన బాక్టీరియా నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.అంతే కాక కొలెస్ట్రాల్ ని తగ్గించి బరువు ని పెరగనివ్వదు.రాత్రి సేవించిన మందు వల్ల కలిగే Hangover నుంచి బయటికి తీసుకురావడం లో కూడా సహకరిస్తుంది.శ్వాస కోశ సంబంధమైన అనర్ధాలకి ఇది చాలా మంచిది.అయితే మనం వాడే తేనే స్వచ్చమైనదా కాదా అని పరీక్షించి తీసుకోవడం మంచిది.దీనికి అనేక మార్గాలున్నాయి.ఒక ఈగ గాని తేనె పై వాలి హాయిగా బయటికి ఎగిరిపోయిందంటే అది మంచి తేనే అనుకోవాలి.ఎందుకంటే స్వచ్చమైన తేనె జిడ్డు ఈగకి అంటుకోదు.కాబట్టి అది ఎగిరిపోతుంది.   Click here  

Friday 21 March 2014

"నువ్వు అడిగితే నేను సాయం చేసి ఉండేవాడినేమో" దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి..?

"నువ్వు అడిగితే నేను సాయం చేసి ఉండేవాడినేమో" దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి..?

సాధారణంగా చాలామంది ఇలా చెబుతారు.If you would have asked me,I could have helped you. ముఖ్యంగా మాతృభాషలో ఆలోచించి అనువదించి చెప్పుకునేటప్పుడు ఇలాంటి పొరబాటు దొర్లడం సహజం.

కాని దీన్ని ఇలా చెప్పాలి.If you had asked me,I could have helped you.

"If" అనే క్లాజ్ వచ్చినపుడు  conditional perfect లో చెప్పకూడదని గుర్తుంచుకుంటే చాలు...!Click here

Friday 7 March 2014

Thursday 6 March 2014

కిరణ్ పై డొక్కా లేఖాస్త్రం



గత ఆరునెలల కాలం లో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన అవినీతి భాగోతాలని పరిశీలించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఈరోజు గవర్నర్ కి ఓ లేఖ రాసినట్టు తెలిసింది.దాదాపు 5 నుంచి పదివేల కోట్ల ధనాన్ని కేవలం తన పదవిని అడ్డుపెట్టుకొని ఎడాపెడా సంతకాలు చేసి బదిలీల ద్వారా సంపాదించారని ఆరోపించారు.IAS,IPS అధికారుల ని కూడా వదలకుండా అందినకాడికి దోచుకున్నారని,ఈ వ్యవహారం కిరణ్ సోదరుని కనుసన్నలలో జరిగిందని తెలిపారు.ఒకప్పుడు కిరణ్ కి సన్నిహితంగా మెలిగిన డొక్కా ఆరోపణలు చేయడం కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.Click here

Saturday 4 January 2014

నేను అతనికి ఋణపడి వున్నాను అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా చెప్పవచ్చు.

నేను అతనికి ఋణపడి వున్నాను అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా చెప్పవచ్చు.

 I owe him 

అనేక విధాలుగా రాము నాకు సహాయం చేశాడు. I owe him for his kind services.

Click here

Monday 2 December 2013

Discern అనే పదానికి అర్ధం ఏమిటి..? ఏ విధంగా ఉపయోగించవచ్చు..?

Discern అనే పదానికి అర్ధం ఏమిటి..? ఏ విధంగా ఉపయోగించవచ్చు..?

స్థూలంగా చెప్పాలంటే "గ్రహించడం" అని చెప్పచచ్చు.

ఇక్కడ రెండు వాక్యాలని ఆ పదాన్ని ఉపయోగించి ఇస్తున్నాము.చదివితే ఆ సెన్స్ మీకే అవగతమవుతుంది.

1.It is difficult to discern if he is telling a lie.

2.Discern more about them.







(ఇది బాగా experts ని  ఉద్దేశించిన శీర్షిక కాదు...)

Friday 18 October 2013

సెన్సేషనల్ హంతకుణ్ణి 48 గంటల్లోగా పట్టుకున్న విజయవాడ పోలీస్




గత సోమవారం విజయవాడ లో ఒక వృద్దురాలిని,ఆమె మనవరాలిని ఘోరంగా హత్య చేసిన నిందితుడు వెంకట్ (27) ని నలభై ఎనిమిది గంటలు గడవకముందే పోలీసులు పట్టుకున్నారు.అతడి దగ్గరనుంచి బంగారు ఆభరణాలు రికవరీ చేశారు.నగలని అపహరించే ఉద్దేశ్యం తో చాలా పకడ్బందీ ప్రణాళిక తో జంట హత్యలు చెసిన వెంకట్ ని డిసిపి ఎం.రవిప్రకాష్ నేతృత్వం లోని బృందం అరెస్ట్ చేసింది.Click here



Wednesday 16 October 2013

Forth Coming Book Fairs

National Book Trust,India is conducting book fairs in various states and its details are given here under.

Bhopal/Indore book fair,Madhya Pradesh...........October,2013

Allahabad book fair,Uttar Pradesh......................October,2013

Children book fair,Cochin/Trivandrum................Oct-Nov,2013

Ranchi/Patna book fair,Bihar.............................November,2013

Chandigarh book fair,UT..................................December,2013

Hyderabad book fair,Andhra Pradesh.............December,2013

Mangalore book fair,Karnataka......................January,2014



For more details,visit:www.nbtindia.gov.in