Showing posts with label ఇతర వార్తలు. Show all posts
Showing posts with label ఇతర వార్తలు. Show all posts

Tuesday 12 March 2024

ఈ విషయాలు చదివితే ఏ సూపర్ కంప్యూటరూ మెదడు ముందు సరిపోవు అనిపించక మానదు.

 ఏ కంప్యూటర్ తోనూ మన మెదడు ను పోల్చలేము. జ్ఞానేంద్రియాల నుండి వచ్చే ఆజ్ఞల్ని క్షణం లో స్వీకరించి వెంటనే ప్రాసెస్ చేసి రియాక్ట్ అయ్యేలా చేస్తుంది. వరద లా వచ్చే సమాచారాన్ని ఎంతో వేగం తో ప్రాసెస్ చేస్తుంది.

 

మన మెదడు 100 బిలియన్ల సూక్ష్మమైన సెల్స్ తో తయారయింది. ఈ సెల్స్ నే న్యురాన్లు అంటారు. వాటన్నిటిన్నిటిని కౌంట్ చేయాలంటే 3000 ఏళ్ళు పడుతుంది.


కలగన్నా, చూస్తున్నా, కదులుతున్నా, ఆలోచిస్తున్నా ... ఈ న్యూరాన్లు చలిస్తూ ఎలెక్ట్రికల్ సంకేతాలు పంపించుకుటూ బిలియన్ల సంఖ్యలో కదలాడుతుంటాయి.


మనిషి జీవించి ఉన్నంతదాకా ఈ పని ఆగడం అనేది ఉండదు. ప్రపంచం లో ఆగకుండా మెసేజ్ లు పంపించే ఏకైక స్మార్ట్ ఫోన్ మన మెదడే అనుకోవచ్చు.


శరీరం లో ఉన్న సెన్సరీ న్యూరాన్స్ సమాచారాన్ని వెన్నుముక కి , బ్రెయిన్ కి గంటకి 240 కి.మీ. వేగం తో పంపిస్తాయి.


ఏ ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ ఒకేలా ఉండనట్లే , ఏ ఇద్దరి మెదడు యొక్క అనాటమీ ఒకేలా ఉండదు. 


--- NewsPost Desk  

Sunday 19 November 2023

సంప్రదాయ మీడియా మోనోపలీ ని చావుదెబ్బ కొట్టిన సోషల్ మీడియా

 ఈ రోజు ప్రపంచ టెలివిజన్ దినోత్సవం సందర్భం గా కొన్ని విషయాలు చెప్పుకోవడం సముచితం గా ఉంటుంది. దూరదర్శన్ ప్రారంభమైన ఆ రోజుల్ని తలుచుకుంటే ఎంత దూరం ఈ డిజిటల్ యుగం లో ఎన్ని అనుభవాలతో ప్రయాణం చేశామో అర్థమవుతుంది. ఆశ్చర్యమూ కలుగుతుంది. ఆ చిత్రలహరి,వారానికి ఒకటో రెండో వచ్చే సినిమాలు వాటికోసం కాసుకుని కూర్చునే మనం...అదొక మరపురాని కాలం. ఆ తర్వాత ప్రైవేట్ చానళ్ళ వరద మనల్ని ముంచెత్తింది.

ఎన్ని పాటల,సినిమాల,వార్తల ప్రత్యేక చానెళ్ళు...ఏం కత. అన్నం తింటూ కూడా కళ్ళు అటు అప్పగించవలసిందే. వార్తల చానెళ్ళు అయితే చెప్పిందే చెప్పుకుంటూ ఇరవై నాలుగు గంటలూ అవే. ఇక మొబైల్స్ లో నెట్ రావడం ప్రారంభమైన తర్వాత ఇక చెప్పే పని లేదు.ప్రపంచ వార్తలు దగ్గర నుంచి పోర్న్ వరకు ప్రతి సైట్  ప్రతిఒక్కరి అర చేతి లోకీ వచ్చేసింది.చిన్నా పెద్దా లేకుండా ...అందుబాటు లోకి వచ్చిన ఈ అవకాశం ఎంత మంచి చేసిందో అంత మానసిక కాలుష్యానికి కూడా గురి చేసింది.


ఇక ఓటిటి ...ఇదో విప్లవం ఈ డిజిటల్ యుగం లో..! ఎన్ని భాషల సినిమాలు,వెబ్ సీరీస్ లు,ఇతర ప్రోగ్రాం లు చేతి మునివేళ్ళ దగ్గరకి వచ్చాశాయి.కపిల్ శర్మ ఇంటర్వ్యూలు,కాఫీ విత్ కరణ్,ఇంకా ఇలాంటి ఎన్నో డిమాండ్ ఉన్న కార్యక్రమాలన్ని ఓటిటి కి వచేశాయి.సెలబ్రిటీల పెళ్ళి కార్యక్రమాలు అవీ సరే సరి. ఒకదాని తర్వాత ఒకటి మార్పు వస్తూ ముందుకు పోతున్నదే తప్పా ఆగేదే లే అన్నట్లు గా ఉంది. యూ ట్యూబ్ లు,సోషల్ మీడియా లు వచ్చిన తర్వాత సంప్రదాయ మీడియా కి ఉన్న మోనోపలీ బద్దలైనందనే చెప్పాలి. ప్రస్తుతం ఎన్నో డిజిటల్ పత్రికలు విజయవంతం గా దూసుకుపోతున్నాయి.

గూగుల్ క్రోంకాస్ట్, అమెజాన్ స్టిక్ లాంట్ డిజిటల్ మెటీరియల్స్ తో టి.వి. అనుసంధానమై నూతన ఒరవడులు పోతున్నది. ఇప్పటికీ 82 శాతం మంది సగటు భారతీయులు వినోదప్రధాన కార్యక్రమాలకి టివి మీదనే ఆధారపడుతున్నారు. సమాజం లో విలువలు మారిపోవడం లో ఈ మాధ్యమాలు చురుకైన పాత్ర పోషిస్తున్నాయి.కొన్ని అవాంఛనీయ పరిణామాలు కూడా ఏర్పడుతున్నాయి. సీరియల్స్ ప్రభావం మామూలుగా లేదు. కుటుంబ సంబంధాలు ఘోరం గా దెబ్బతింటున్నాయి.

ప్రస్తుతం గ్రామ సీమలు కూడా సోషల్ మీడియా వల్ల బాగా ప్రభావితం అవుతున్నాయి. ఏ మూలన జరిగేవీ వెంటవెంటనే తెలిసిపోతున్నాయి. ఒక మంచి ఏమిటంటే కొత్త టాలెంట్ బాగా బయటకి వస్తోంది. పాటగాళ్ళు గానీ, ఆటగాళ్ళు గానీ,మాటగాళ్ళు గానీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి తమకి నిజంగా సరుకు ఉంటే దానికి తగ్గా గుర్తింపు పొందుతున్నారు. ఎవరూ ఆపే ప్రసక్తే లేదు. ఏ అభిరుచి గలవాళ్ళకి ఆ అభిరుచి ఉన్న యూట్యూబర్లు దొరుకుతున్నారు. సాధ్యమైనంత వరకు మంచి విషయాలకి వాడుకుంటూ ముందుకి పోతే ఫర్వాలేదు. కానీ ఈ రెండంచుల కత్తిని ఇష్టం వచ్చినట్లు వాడితే నష్టబోయేదీ మనమే..!      

 --- NewsPost Desk

Tuesday 4 July 2023

గంజాయి కి, భంగు కి, చరస్ కి మద్య గల తేడా ఏమిటి

 

నిజానికి గంజాయి,భంగు,చరస్ ఈ మూడు ఒకే మొక్క నుంచి వస్తాయి. తయారు చేసిన విధానాన్ని బట్టి పేర్లు మారతాయి. భంగు ని ఉత్తర భారత దేశం లో హోలీ లాంటి పండగలప్పుడు సేవించడం ఏ నాటినుంచో వస్తున్నదే.గంజాయి మొక్కల ఆకుల్ని నలిపి ఆహారం లోనో,తాగే పానీయం లోనో కలుపుతారు.ఆ మొక్క కి పూసే పూవులు కూడా మంచి నిషాని కలిగిస్తాయి.వాటిని కూడా నలిపి మిశ్రమం గా చేసి వాడతారు.మన దేశం లో భంగు ని కొన్ని పూజల్లో వాడే సంప్రదాయం ఉన్నందున ఉత్తర భారతం లోని కొన్ని రాష్ట్రాల్లో కొంత మేరకు అనుమతి ఉంది.

భంగు బ్రెయిన్ మీద,నెర్వస్ సిస్టం మీద ప్రభావాన్ని చూపుతుంది. సైకోయాక్టివ్ ఎఫెక్ట్ కలిగిస్తుంది.ఎక్కువ సేవిస్తే మతిమరుపు,బలహీనత కలిగిస్తుంది. ఇక గంజాయి మొక్కల ఆకుల్ని,పూలని మరీ ముదరని దశ లో కోసి మిశ్రమం చేస్తారు. దీన్ని సిగెరెట్ లలో చుట్టుకొని పీలుస్తుంటారు.చిలుం పీల్చడానికి కూడా ఉపయోగిస్తారు. టీ లో కూడా కలిపి తాగుతుంటారు. ఇదొక పద్ధతి. గంజాయి దమ్ము అన్నమాట.

గంజాయి మొక్క ఇంకా దాని ఆకుల్లోని రసాన్ని తీసి తయారుచేసేది చరస్ లేదా హషిష్. చాలా ఎక్కువ కాన్సంట్రేషన్ ఉండేలా చూస్తారు. హషిష్ ని రోల్స్ గా చుట్టి పొగ తాగడం ఉన్నది. కొద్దిగా జిడ్డుగా ఉంటుంది.అలా గంజాయి మొక్కలో ఏదీ వేస్ట్ కాదు.ఆకులు,పూవులు,మొక్క రసం అన్నీ రకరకాలుగా ఉపయోగిస్తారు.     

Friday 2 June 2023

ఈ మొక్కలంటే పాములకి ఇష్టం

మంచి సువాసన వెదజల్లే  నైట్ జాస్మిన్ మొక్కలన్నా, అలాగే గంధపు చెట్లు అన్నా పాములకి ఇష్టం అని పరిశోధకులు సెలవిస్తున్నారు. మన గ్రామాల్లో మొగలి పొదల వద్ద త్రాచుపాములు ఉంటాయని పెద్దలు అనేదాంట్లో కూడా కొంత నిజం ఉంది. ఎందుకంటే హాయిగా చక్కని సువాసన ని ఆస్వాదించే తత్వం కదా..!

మేరీ గోల్డ్, ఉల్లి,వెల్లుల్లి మొక్కల వాసన అంటే మాత్రం పాములకి పడదుట. అంతేకాదు లవంగాలు,దాల్చిన చెక్క రసాల్ని తీసి మిక్స్ చేసి పాములు చేరగూడదు అనుకున్న చోట స్ప్రే చేస్తే ఆ దాపుల్లోకి రావు. అలాగే తెల్ల వెనిగర్ ని చల్లినా దాని వాసన కూడా పడదు.

పాము కరిచిన వెంటనే ప్రాథమిక చికిత్స చేసి సాధ్యమైనంత త్వరగా డాక్టర్ వద్ద కి తీసుకు వెళ్ళాలి. స్నేక్ వెనం ఏంటి సిరం ఇంజెక్షన్ ని వాళ్ళు చేస్తారు. సొంతగా ఆ ఇంజెక్షన్ చేయవద్దు. పాము కరిచిన వెంటనే ఒంటి మీద టైట్ గా ఉండే రింగ్ ని గాని,బ్రాసిలెట్ వంటివాటిని తొలగించాలి.      

  

Thursday 2 March 2023

హైదరాబాద్ కెపాసిటీ పెరింగిందన్నమాట

 సాఫ్ట్ వేర్ డెవలపర్స్ ని ఇంటర్వూ చేయడం లో హైదరాబాద్ నగరం కొత్త రికార్డ్ లు సృష్టించి దేశం లో మొదటి స్థానం లో నిలిచింది.సియాటెల్ కేంద్రం గా ఉన్న టెక్నికల్ ఇంటర్వ్యుంగ్ ఫర్మ్ కారట్ ఇచ్చిన రిపోర్ట్ అది.ఈ విషయం లో మొదటి 20 స్థానాలు అమెరికా ఇంకా ఇండియా లో ఉన్నాయి.మన దేశం లోని హై వాల్యూం మార్కెట్ యు.ఎస్. లోని సాఫ్ట్ వేర్ డెవెలపర్స్ తో పోటీపడుతోంది.ముంబాయి,పూణే,బెణ్గళూరు,గురుగ్రాం,చెన్నయ్ ల కంటే కూడా హైదరాబాద్ ముందు స్థానం లో ఉంది.ప్రపంచ వ్యాప్తంగా చెప్పాలంటే 10 వ స్థానం లో ,లండన్ ఇంకా వాషింగ్టన్ ల తర్వాత ఉంది.గ్లోబల్ కంపెనీల నుంచి వచ్చే పెట్టుబడులు ఇక్కడున్న డిజిటైజేషన్ ట్రెండ్ ని మరింత బలోపేతం చేస్తున్నాయి.వాషింగ్టన్ డిసి,ఆస్టిన్ నగరాలు లాస్ ఏంజిల్స్,కన్సాస్ సిటీ,పిట్స్ బర్గ్ ల కన్నా ముందున్నాయి. 

పెద్ద స్థాయి లో ఉన్న టెక్కీ లని ఇంటర్వ్యూ చేయడానికి టాలెంట్ లీడర్స్ ఎంతో ఖర్చు చేస్తున్నారు.ముఖ్యం గా HR tech,Recruiting vendors లాంటి సంస్థలు.వాట్సప్ రిక్రూట్మెంట్ రిమోట్ లాంటి ప్లాట్ ఫాంస్ ని ఉపయోగించుకుంటున్నాయి. ఇండస్ట్రీ లో ఉన్న మిగతా వారితో సంప్రదిస్తున్నాయి.కొన్ని కంపెనీలు చవక గా పనిచేయించుకోడానికి ఇండియా లాంటి దేశాల వైపు చూస్తున్నాయి.ఇది ఎప్పటినుంచో ఉన్నదే.కారట్ సి.యి.వో. మోహింత్ బెండె గత ఏడాది లో తమ ఖాతాదారుల చలనం లో అనేక మార్పులు వచ్చినట్లు చెబుతున్నారు. 

Sunday 15 January 2023

ఏ విదేశీ బ్రీడ్ కి తీసిపోమని నిరూపించిన దేశవాళీ వీథికుక్క


గత నెల లో భువనేశ్వర్ నగరం లో జరిగిన "నేషనల్ డాగ్ షో" పోటీ లో మన దేశం లోని వీథి కుక్కలు ఏ విదేశీ బ్రీడ్ కుక్కలకీ తీసిపోవని నిరూపించాయి. అయితే మనం వాటికి ఇవ్వవలసింది మంచి తిండి,పోషణ,తర్ఫీదు ...ఇవి గనక ఇస్తే మన వీథి కుక్కలు కూడా తమని తాము నిరూపించుకుంటాయి. విశ్వాసపాత్రత విషయం లో ఇక చెప్పేదేముంది..? అయితే మన దేశం లోని అనేకమంది కి విదేశీ బ్రీడ్ కుక్కలు అంటే వల్లమాలిన అభిమానం.లాబ్రాడర్,జర్మన్ షెప్పర్డ్,గోల్డెన్ రిట్రీవర్ లాంటి వాటికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఇహ పోతే వీథికుక్కలు...పాపం సరైన తిండి తిప్పలు లేక బతకలేక బతుకుతుంటాయి.వాటిని చూస్తేనే చాలా మందికి అసహ్యం.ఇకవాటిని పెంచేదెవరు..? చిన్నప్పుడు చూస్తే అన్నీ జీవుల్లాగే ఎంతో ముద్దుగా గంతులేస్తూంటాయి.కాలం గడిచే కొద్దీ అవీ మట్టిలో మట్టిలా తయారయిపోతాయి. ఆలనా పాలనా లేక.అయితే భువనేశ్వర్ నగరం లోని గౌరవ్ అగర్వాల్ అనే కాలేజ్ కుర్రాడు మాత్రం అందరకి మల్లే ఊరుకోలేదు.ముద్దుగా ఉండే ఓ వీథి కుక్క ని తీసుకొచ్చిపెంచుకున్నాడు.ఇంట్లో వాళ్ళు తిడతారేమోనని అది లాబ్రడర్ జాతి పిల్ల అని తనకి స్నేహితుడు ఇచ్చాడని అబద్ధం చెప్పాడు.

దాన్ని చక్కగా పెంచుతూ మంచి తర్ఫీదు ఇచ్చాడు.ఇతర విదేశీ బ్రీడ్ కి ఏ మాత్రం తగ్గకుండా మంచి తెలివిగా ఉండేది ఈ వీథి కుక్క.అన్నట్టు దానికి టామీ అనే పేరు కూడా పెట్టాడు గౌరవ్.ఒరిస్సా కెన్నెల్ క్లబ్ నిర్వాహకుల్ని సంప్రదించి జరగబోయే డాగ్ షో లో తన ఇండియన్ బ్రీడ్ కుక్కపిల్ల కి కూడా చాన్స్ ఇమ్మని అడగ్గా వాళ్ళు ఓకెయ్ అన్నారు.మొత్తం 400 కుక్కపిల్లలు 35 బ్రీడ్స్ నుంచి ఫాల్గొన్నాయి.అన్ని ఈవెంట్స్ లోనూ టామీ ప్రథమ బహుమతి ని సాధించి వీథికుక్కలంటే తమాషా కాదు అవకాశాలు ఉండేలే గాని తాము ఎవరికీ తీసిపోమని నిరూపించింది.

  దానితో వీథికుక్కల్ని అవమానించే వారి నోళ్ళు మూతబడ్డాయి.ఒడిస్సా అగ్రికల్చరల్ యూనివర్సిటి కి చెందిన ప్రొఫెసర్ నిరంజన్ పండా మాట్లాడుతూ మనం కుక్కల్ని ప్రేమించాలి తప్పా బ్రీడ్ లని ప్రేమించకూడదని దురదృష్టవశాత్తు మన దేశం లో అదే జరుగుతోందని అన్నారు.మన దేశం లోని ప్రజల మైండ్సెట్ మారవలసిన అవసరం ఉందని చెప్పారు. వీథికుక్కల్ని పెంచుకోవడం వల్ల వాటికి ఆశ్రయం దొరికి ఒక సామాజిక సమస్య కి జవాబు దొరికినట్లు అవుతుందని అన్నారు.పైగా మన వాతావరణం లో పెరిగిన కుక్కలు అనేక విధాలుగా శ్రేష్టమైనవని అన్నారు. 

--- NewsPost Network

Thursday 13 May 2021

ఇప్పటికీ ఈ శిఖరం ఓ రహస్యమే..!


 ప్రపంచం లో అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు ఎందరో ఉన్నారు. కాని ఆ హిమాలయ శ్రేణుల్లో భాగమైన కైలాస్ శిఖరాన్ని మాత్రం ఇప్పటి దాకా ఎవరూ అధిరోహించలేకపోయారు.ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8850 మీటర్లు కాగా,కైలాస్ శిఖరం ఎత్తు 6638 మీటర్లు మాత్రమే.ఎవరెస్ట్ కన్నా ఎత్తు లో అంత తక్కువ ఉన్న కైలాస్ శిఖరాన్ని ఎందుకని ఎవరూ అధిరోహించలేకపోయారు అనేది ఇప్పటికీ ఓ గొప్ప రహస్యమే..!


ఎక్కడానికి ప్రయత్నించినవారు లేకపోలేదు సుమా..!కల్నల్ విల్సన్ (బ్రిటీష్),సెర్గీ సిస్త్యకొవ్(రష్యన్) వంటి ప్రసిద్ధ పర్వాతారోహక బృందాలు ప్రయత్నించి విఫలమై తిరిగివచ్చారు.సైబీరియా కి చెందిన కొందరు కూడా ప్రయత్నించారు కాని వారు కూడా విజయం సాధించలేకపోయారు.సైబీరియాకి చెందిన వారు ప్రయత్నించిన సంవత్సరం తర్వాత మృత్యు వాత పడ్డారు.ఒక ఏడాది లో పదేళ్ళ లో వచ్చే వృద్ధాప్యం వచ్చింది వారికి.


అధిరోహించడానికి ప్రయత్నించిన వారు అందరూ చెప్పినదేమిటంటే కైలాస్ శిఖరం పరిధిలోకి కొంత దూరం వెళ్ళడం తో గోళ్ళు,వెంట్రుకలు చాలా వేగంగా పెరుగుతాయని తెలిపారు.హిందూ ,బౌద్ధ,జైన,బాన్ మతాల వారికి  కైలాస్ శిఖరం చాలా పవిత్రమైనది.సాక్షాత్ మహాశివుడే తన పరివారం తో ఇక్కడ కొలువై ఉంటాడని హిందూవులు భావిస్తారు.ఇక్కడ దగ్గర లో మానస సరోవరం,రాక్షస తల అనే రెండు సరస్సులు ఉంటాయి.ఒకటి మంచినీటి సరస్సు కాగా మరొకటి ఉప్పు నీటి సరస్సు.  


ఇంకా మిగతా చాలా వివరాలకోసం పైన ఇచ్చిన వీడియో చూడగలరు.

Sunday 22 July 2018

బోర్డు తిప్పేసిన మరో సంస్థ...



ద హేపీ ఫ్యూచర్ మల్టీ పర్పస్ కో ఆపరేటివ్ సొసైటీ పేరు తో తమిళనాడు ,ఆంధ్ర,తెలంగాణా రాష్ట్రాల్లో బ్రాంచీలు తెరిచిన సంస్థ  తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల బోర్డ్ తిప్పేసినట్లుగా ఈ రోజు పత్రిక ల్లో వెలుగు చూసింది.స్థానిక ప్రముఖుల తో ఓపెనింగ్ లు చేయించి కొన్ని నెలల పాటు ఆఫీస్ లు నడిపిన ఈ సంస్థ తమిళనాడు లోని కోయంబత్తూర్ లో ప్రధాన కార్యాలయాన్ని కలిగిఉంది.నిరుద్యోగులు కూడా ఈ సంస్థ లో ఉద్యోగాలు పొందడానికి పెద్ద మొత్తాలు చెల్లించినట్లు తెలుస్తున్నది.

తమ వెబ్ సైట్ లో అనేక సేవలు అందిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నది.ఎలక్ట్రానిక్స్,సూపర్ మార్కెట్,ఆర్గానిక్ ఉత్పత్తులు ఇంకా ఇతర రంగాల్లో సేవలు అందిస్తున్నట్లు ప్రకటనలు చేసింది. కొత్తగూడెం,ఖమ్మం ఇంకా అనేక చోట్ల ఫిర్యాదులు నమోదు అయినట్లు తెలుస్తున్నది. 

Wednesday 25 April 2018

ఈ పేరు తో హోటల్ ని ఎవరైనా ఊహించగలరా..?


ఓల్గా సే గంగా అనే ప్రసిద్ధ నవల  అందరకీ తెలిసిందే.రాహుల్ సాంకృత్యాయాన్ రచించిన ఆ పుస్తకానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది.ఎవరైనాపుస్తకం చదువుతారు కాకపోతే మంచి రచన గా గుర్తుంచుకుంటారు.కాని పశ్చిమ గోదావరి జిల్లా లోని కుకునూరు అనే మండల కేంద్రం లో మటుకు ఆ పుస్తకం పేరు ని తమ హోటల్ కి పెట్టుకున్నాడు ఒక పుస్తక ప్రియుడు.ఇక్కడ పైన చూస్తున్నారు గా ఆ చిత్రందాని గురించి ఆ యజమాని రాం బాబు మాట్లాడుతూ వారి తండ్రి గారు ఈ పేరు పెట్టినట్లు దానిని తాను కొనసాగిస్తున్నట్లు తెలుపుతున్నారు.ఈ స్పూర్తి తో ఇంకా అనేకామంది ఇటువంటి మంచి విషయాల్ని అనుకరిస్తే బాగుంటుంది కదూ ..! 

Tuesday 15 August 2017

మేఘాలయ వెళితే ఈ నది అందాలు చూడాలిసిందే...!



మేఘాలయా రాష్ట్రాన్ని చూడవలసి వస్తే షిల్లాంగ్ తో పాటు ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయి.ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకా ఇతర రాష్ట్రాల లో లాగా పర్యావరణ విధ్వంసం ప్రారంభం కాలేదు.ఉమంగట్ నది ఇప్పుడు టూరిస్ట్ ల్ని బాగా ఆకర్షిస్తోంది.ఈ నది లోని నీళ్ళు తేటా తెల్లం గా అడుగు భాగం చక్కగా కనబడేలా ఉంటుంది.చలి కాలం లో మరీ బాగుంటుంది.మన దేశీయులు తో బాటు బంగ్లా దేశీయులు ఉమ్మడి గా దీని లొని చేపల్ని పట్టుకుంటారు.ఒక  రౌండ్ వేసి రావడానికి పడవల వాళ్ళు మూడు వందల రూపాయాలు వసూలు చేస్తున్నారు.  

Monday 19 June 2017

భద్రాచలం డివిజన్ ని ఆంధ్రా ప్రాంతం లో కలపాలి: గొండ్వానా సంక్షేమ పరిషత్


బ్రిటీష్ వారి కాలం నుండి తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా  ఉన్న భద్రాచలం డివిజన్ ని ఆంధ్ర రాష్ట్రం లోనే కలపాలని,ఇప్పటికీ డివిజన్  లో నిలిచి ఉన్న అప్పటి నిర్మాణాలే దీనికి సాక్ష్యమని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ సొందె వీరయ్య అన్నారు.1956 లో ఉన్న ప్రకారమే విభజనని మాత్రమే కె.సి.యార్. కోరారని కాని కొన్ని శక్తుల కి తలొగ్గి ఈ ప్రాంతాన్ని  తెలంగాణా లో కలిపారని,కేంద్రం ఈ విషయం లో పునరాలోచన చేయాలని అప్పుడు మాత్రమే ఇక్కడ గల ఆదివాసీ తెగలకి న్యాయం జరుగుతుందని తెలిపారు.ఈ డిమాండ్ తో భద్రాచలం లో నిన్న ఒక రోజు దీక్ష ని నిర్వహించారు. 

Thursday 9 February 2017

ఇండియన్ ఎక్స్ ప్రెస్ గుర్తించిన వరంగల్ కుర్రాడి కృషి



అరవింద్ పకిడె (21) వరంగల్ జిల్లా లోని కాంచనపల్లి గ్రామానికి చెందిన కుర్రవాడు.అతని అభిరుచి మూలంగా  చక్కని బ్లాగ్ నిర్వహిస్తూ దాదాపు 400 వందల పురాతత్వ,చారిత్రక ప్రదేశాలను శోధించి తన బ్లాగు లో వివరించాడు.అవి మాత్రమే కాక గుళ్ళు ,చెరువులు ఇలా అనేక ఆసక్తికరమైన అంశాల్ని పొందుపరిచాడు.ఇతను చేపట్టిన మంచి పనులను వివరిస్తూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఈ నెల 6 వ తారీఖు పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చింది.వీలైతే చదవండి. 

Friday 20 May 2016

నిన్న ఆ ప్రసిద్ధ రచయిత పుట్టిన రోజు...



ప్రఖ్యాత ఆంగ్లో ఇండియన్ రచయిత రస్కిన్ బాండ్ సాహిత్య ప్రియులకు అనేక నవలల ద్వారా,ఇంకా కధల ద్వారా చిర పరిచయస్థుడే.భారత దేశం లో బ్రిటిష్ దంపతులకు( Aubrey Bond,Edith Clerke)  1934 మే 19 న జన్మించారు.ఆ తర్వాత ఆయన ఈ దేశాన్నే చిర వాసంగా చేసుకొని ముస్సోరి దగ్గర లోని ఒక కంటోన్మెంట్ గ్రామం లో నివసిస్తూ ఆంగ్ల భాష లో తన రచనా వ్యాసాంగాన్ని సాగించారు.నిన్న ఆయన 82 వ పుట్టిన రోజు ,ఆ సందర్భంగా మాట్లాడుతూ తాను ఇప్పుడు టైప్ రైటర్ తో రాయడం లేదని కంప్యూటర్ మీద కూడా  టైప్ చేయడం తనకి ఇష్టం ఉండదని ,కేవలం చేతి తోనే రాస్తున్నానని తెలిపారు.పాతిక పైగా నవలలు,వందలాది కధలు రాసిన ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులున్నారు.పద్మశ్రీ ,పద్మభూషణ్ లని స్వీకరించారు.శ్యాం బెనిగళ్,విశాల్ భరద్వాజ్ వంటి దర్శకులు ఆయన రచనల్ని సినిమాలుగా తీశారు. 

Saturday 23 April 2016

కంప్యూటర్ వినియోగం లో వెనుకబడిన తెలుగు రాష్ట్రాలు.



తెలంగాణా,ఆంధ్ర రెండు రాష్ట్రాలు కంప్యూటర్ వినియోగం లో బయటకి చెప్పుకుంటున్నంత గొప్ప గా ఏమీ లేవని నేషనల్ శాంపిల్ సర్వె వెల్లడి చేసింది.14-29 మధ్య వయసు లో ఉన్నవారిని ఈ  సర్వె లో లెక్కించారు.ప్రతి వెయ్యిమంది లో తెలంగాణ లో 490 మంది కంప్యూటర్ వినియోగించే వారిగా తేలగా అదే ఆంధ్ర లో ఈ సంఖ్య 463 గా ఉంది.అయితే మిగిలిన దక్షిణాది రాష్ట్రాల  లో ఈ సంఖ్య ఎక్కువగానే ఉంది.తమిళనాడు లో 588 మంది గా ఉండగా,కర్నాటక లో 552 మంది గా తేలింది.కేరళ 810 మంది తో అగ్ర స్థానం లో ఉంది.మెడికల్ ఇంకా ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో కూడా గణనీయమైన సంఖ్యలో  చేరవలసిన అవసరాన్ని  సూచిస్తున్నది. 

Saturday 29 August 2015

స్పెషల్ స్టేటస్ కోసం సిరిపురపు ఉదయభాను ఆత్మహత్య



గుడివాడ లో ఒక వ్యాపారి సిరిపురపు ఉదయభాను (40) నిన్న ఆత్మ హత్య చేసుకున్నాడు.ఆంధ్రప్రదేశ్ రాస్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లో కేంద్రం చేస్తున్న జాప్యానికి నిరసనగా ఫ్యాన్ కి ఉరి వేసుకుని తనువు చాలించాడు.సమైఖ్యాంద్ర ఉద్యమం లో కూడా ఈయన సెల్ టవర్ ఎక్కి ప్రాణార్పణ చేసుకోవాలని ప్రయత్నించాడు అయితే అప్పుడు పోలీసులు కిందకి దింపి విరమింప జేశారు.Click here

Thursday 19 February 2015

లిప్ టు లిప్ ముద్దు పెట్టి మళ్ళీ వార్తలకెక్కాడు ఆ మహానుభావుడు..!


ప్రముఖ లాయర్ కం పొలిటీషియన్ రాం జెఠ్మలానీ ఈ మధ్య గెలుస్తున్న కేసుల మాట ఏమో గాని లిప్ టు లిప్ కిస్ లు పెట్టి మాత్రం వార్తల్లో ఉంటున్నాడు.గత సోమవారం హం లోగ్ 2015 అనే ప్రోగ్రాం లో స్టేజీ మీదనే గత కాలం నాటి హిందీ సినీ గాయకుడు కిశోర్ కుమార్ భార్య లీనా చందార్కర్ ని లిప్ టు లిప్ కిస్ చేశాడు జెఠ్మలానీ.ఇదిలా ఉండగ ఆ మధ్య మరో స్టేజి మీద కూడ ధర్మేంద్ర కి ఇలానే లిప్ టు లిప్ ముద్దు పెట్టాడీయన.Click here 

Sunday 4 January 2015

మమతా బెనర్జీ బంధువు ని స్టేజి మీద తన్నిన పార్టీ వర్కర్...!



ఈ రోజు ఈస్ట్ మిడ్నాపుర్ జిల్లా లోని చండీపూర్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.పశ్చిమ బెంగాల్ ముంఖ్య మంత్రి కి Nephew అయ్యే అభిషేక్ బెనర్జీ ని ఒక పార్టీ మీటింగ్ లో ప్రసంగిస్తుండగా TMC పార్టీ కే చెందిన ఓ కార్యకర్త లాగి పెట్టి చెంప మీద కొట్టాడు.అభిషేక్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు కూడా..!పార్టీ సెక్రెటరీ జనరల్ పార్ధ చటర్జీ దీన్ని ఖండించడమే కాక స్థానిక ఎస్.పి.కి ఫిర్యాదు సైతం చేశారు.Click here

Wednesday 17 December 2014

సైబరాబాద్ పరిధి లో తిరిగే Cab లు ఇక ఆ కార్డుల్ని కలిగిఉండవలసిందే..!



స్త్రీ ల పట్ల జరిగే నేరాలని నిరోధించడానికి సైబరాబాద్ పోలీసులు మరో కొత్త ఆలోచన చేశారు.వచ్చే ఏడు జనవరి 1 నుండి సైబరాబాద్ లో తిరిగే ప్రతి Cab కూడా తప్పనిసరిగా My vehicle is safe అనే Id card ని తప్పనిసరిగా ధరించి రోడ్డు మీదికి రావలసిందే.అంత కాదు ప్రతి కేబ్ యొక్క డ్రైవర్ వివరాలు ,వాహనం వివరాలు పోలీస్ లు సేకరించి ఉంచుకుంటారు.దాదాపు 14000 కేబ్ లు సైబరాబాద్ పరిధి లో IT ఇంకా ఫార్మా ఉద్యోగులకు సేవలందిస్తున్నాయి.యాప్ బేస్డ్ గాని,రేడియో టాక్సి గాని,లోకల్ టాక్సి గాని ఇకమీదట ప్రతి వాహనం పోలీస్ ల వద్ద రిజిస్టర్ అయి ఉండవలసిందే..!Click here 

Monday 1 December 2014

ముంపు మండలాల్లో ఉద్యోగులపై తెలంగాణా ప్రభుత్వానికి ఎలాంటి విధానం లేదా..?



ఖమ్మం జిల్లా లో ఉన్న చింతూరు,కూనవరం,వి.ఆర్.పురం,భద్రాచలం (గ్రామ పంచాయితీ తప్ప),కుక్కునూరు,వేలేరు పాడు మండలాలు రాష్ట్ర పునర్విభజనలో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కలిశాయి.దీని లో మొదటి నాలుగు మండలాలు తూర్పు గోదావరి జిల్లా లో కలవగా,చివరి రెండు మండలాలు పశ్చిమ గోదావరి జిల్లా లో కలిశాయి.అయితే ఈ మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎక్కువగా తెలంగాణా స్థానికులే.ఉపాధ్యాయులంతా ఖమ్మం జిల్లా సెలెక్షన్ ద్వారా నియమింపబడినవారే.ఏ నెలకి ఆ నెల ట్రేజరీ ద్వారా తెలంగాణా ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తున్నది.మమ్మల్ని ఈ ప్రాంతాలనుంచి తీసి తెలంగాణా కి బదిలీ చేయవలసిందిగా ఇక్కడి ఉద్యోగులు,ఉపాధ్యాయులు కోరుతున్నారు.ధర్నాలు ,ఆందోళనలు కూడా ఈ విషయమై నిర్వహిస్తున్నారు.గత నెలలో కూడా వీరంతా ఖమ్మం లో ధర్నా చేశారు.తెలంగాణా ఉద్యమం లో మేము ఫాల్గొన్నాము,మా జీతాల్లో కూడా కోత పెట్టించుకున్నాం,సకల జనుల సమ్మెలో ఫాల్గొన్నాం..కాని ప్రస్తుతం తమని తెలంగాణా వైపు వెంటనే తరలించడానికి ఎందుకు తెలంగాణా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని వీరి ఆవేదన.

ఇంతకంటే చిత్రమైన వార్త ఏమిటంటే ఇప్పటికే కొన్ని శాఖలకి చెందిన ఉద్యోగులు వైద్య,పశువైద్య శాఖల ఉద్యోగులు,వి.ఆర్.వో. లు వంటి వారు ఇంకా ఇతరులు  సెక్రెటేరియట్ స్థాయి నుంచి వారి శాఖల అధిపతులనుంచి గ్రీన్ సిగ్నల్ పొంది హాయిగా ఖమ్మం జిల్లా లోకి బదిలీ అయిపోయారు.అయితే వారి తోటి రాష్ట్ర ఉద్యోగులైన జిల్లా పరిషత్,ఆశ్రమ పాఠశాలలకి చెందిన అనేక మంది ఉపాధ్యాయులు ఇప్పటికీ ఈ ముంపు మండలాల్లోనే ఉండిపోయారు.ఒక వైపు ఆంధ్ర ప్రాంతానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా స్పందిస్తూ పరిపాలనని తమ స్వాధీనం లోకి తెచ్చుకొంటున్నది.కీలకమైన అధికారులను నియమించింది.ముంపు ఉద్యొగుల గోడు ముందు గొయ్యి,వెనుక నుయ్యి లా మారింది.Click here

Monday 29 September 2014

ముంపు మండలాల ఉద్యోగుల గోడు పట్టించుకోని తెలంగాణా ప్రభుత్వం



వచ్చే నెల మొదటి తేదీ నుంచి పోలవరం ముంపు మండలాలు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిందికి రానున్నాయి.సకల విషయాలను ఇక ఆంధ్ర ప్రభుత్వమే పట్టించుకోవలసి ఉంటుంది.ఇప్పటికే అధికారులు సర్వం సన్నద్ధం చేసుకొని తయారుగా ఉన్నారు.అటు తెలంగాణా ప్రభుత్వం కూడా బెట్టు చేసినా అంగీకరించని తప్పనిసరి పరిస్థితి. చింతూరు,వరరామచంద్ర పురం,కూనవరం,భద్రాచలం (పాక్షికం) ,కుక్కునూరు,వేలేరుపాడు వంటి మండలాలు తెలంగాణా నుంచి ఆంధ్రా ప్రాంతం లో కలవనున్నాయి.ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు తమని తెలంగాణా కి మళ్ళించవలసిందిగా కోరుతున్నారు.ఈ మేరకు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు,రాజ్ నాధ్ సింగ్ లు సైతం ఆమోదం తెలిపారు.ఉద్యోగనేతలు వారిని కలిసినపుడు ఈ మేరకు వారికి హామీ ఇచ్చారు.విచిత్రంగా ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం వీరి విషయం లో ఏమీ పట్టనట్లు వ్యవహరించడం దారుణమని భావిస్తున్నారు.దాదాపుగా అయిదు వేల ఉద్యొగులు అన్ని శాఖల్లో కలిపి పనిచేస్తుండగా ,చాలా తక్కువమంది ఆంధ్రా వేపు వెళ్ళడానికి మొగ్గుచూపుతున్నారు.అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా కొత్తగా ఉద్యోగుల్ని నింపడానికి తయారుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.నిజానికి కమలనాధన్ కమిటీ తో పనిలేకుండానే ఈ పని చేయవచ్చు.కాని ఎందుచేతనో నిమ్మకు నీరెత్తి నట్లు తెలంగాణా ప్రభుత్వం మిన్నకున్నది.దీనివెనుక మర్మమేమిటో ఆ దేవుడికే తెలియాలి.ఇంచుమించు అన్ని తెలంగాణా జిల్లాలకి చెందిన వారు ఈ ప్రాంతం లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.