Showing posts with label సినిమా వార్తలు. Show all posts
Showing posts with label సినిమా వార్తలు. Show all posts

Sunday 22 March 2015

డిప్రెషన్ కి మందులు వాడాను అంటున్న నటి..!


డిప్రెషన్ అనేది చాలా భయంకరమైనది అది నేనూ చవి చూశాను అంటున్నది దీపికా పడుకునే.హేపీ న్యూ ఇయర్ సినిమా చేస్తున్న సమయం లో నే ఆ దశలోకి వెళ్ళాను.బెంగుళూరు కి చెందిన డాక్టర్ శ్యాం భట్ ,అన్నా చాందీ ని కలిసి మందులు తీసుకున్నాక చాలా నయమయింది అంటున్నది ఈ నటి. నా తల్లిదండ్రులు నాకు సహాయకారులు గా ఉండటం నా అదృష్టం అని కూడా అంటోంది.Click here   

Monday 16 March 2015

"లింగా" డైరెక్టర్ తర్వాత సినిమా ఎవరితోనో తెలుసా..?


లింగా సినిమా దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తన తదుపరి చిత్రాన్ని కిచ్చా సుదీప్ తో మొదలెడుతున్నట్లు తెలుపుతున్నాడు.ప్రస్తుతం ఇతర సినిమా ల తో అతను బిజీ గా ఉన్నాడు,అవి పూర్తి కాగానే కన్నడం,తమిళం లో రిలీజ్ అయ్యే మా సినిమా ని ప్రారంభిస్తామని తెలిపాడు.రన్న అనే కన్నడ సినిమా త్వరలో రిలీజ్ కాబోతున్నది. ఇంకా ప్రస్తుతం పులి అనే తమిళ్ సినిమా లో కిచ్చా నటిస్తున్నాడు.Click here

Sunday 15 March 2015

డ్రంక్ అండ్ డ్రైవెన్ లో పట్టుబడ్డ సినీ దర్శకుడు..!



కొరియోగ్రాఫర్ మరియు తెలుగు సినీ దర్శకుడు అమ్మ రాజశేఖర్ శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవెన్ లో పట్టుబడ్డారు.ఎక్కువ మోతాదు లో ఆల్కహాల్ సేవించినట్లు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష లో తేలడం తో ఆయన నడుపుతున్న కారుని పోలీసులు సీజ్ చేశారు.ముందు కౌన్సిలింగ్ కి  పంపించి ఆ తర్వాత కోర్ట్ లో ఆయన్ని హాజరుపరుస్తారు.Click here  

Saturday 7 March 2015

నా పాత్ర కేజ్రీవాల్ ని పోలివుంటుంది అంటున్నాడు ఆ నటుడు..!


కె.సి.బొకాడియా సినిమా "డర్టీ పాల్టిక్స్" త్వరలో రిలీజవబోతున్నది.దీనిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న నసీరుద్దీన్ షా ప్రస్తుతం ప్రమోటింగ్ పనులతో బిజీ గా ఉన్నాడు.ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తన పాత్ర ఆ సినిమా లో కేజ్రీవాల్ ని పోలివుంటుందని,అయితే మరీ విమర్శనాత్మక ధోరణి లో గాకుండా ఆయన పాసిటివ్ సైడ్ ని ఎక్కువ చూపించడం జరిగిందని చెప్పుకొచ్చాడు.Click here  

Wednesday 25 February 2015

అలనాటి అడవి రాముడు సినిమా కెమెరా మెన్ ఈరోజు మరణించారు



జయనన్ విన్సెంట్ ఈ పేరు ఈతరం వారికి పెద్దగా తెలియకపోవచ్చునేమో గాని చరిత్ర సృష్టించిన దర్శకేంద్రుని సూపర్ హిట్ సినిమాలకి చాలా వాటికి ఆయనే కెమెరా మెన్.అడవి రాముడు,బొబ్బిలి సిమ్హం,సోగ్గాడు,మేజర్ చంద్రకాంత్ వంటి ఎన్నో హిట్ సినిమాలకి తన కెమెరా ద్వారా జీవం పోశారు.ఆయన పని చేసిన చివరి సినిమా అన్నమయ్య .ఆ తర్వాత ఆయన రిటైర్ అయ్యారు.ఎనిమిది పదులు దాటిన వయసులో ఆయన ఈ రోజు కన్ను మూశారు.Click here 

Thursday 12 February 2015

నేను బాగా పాపులర్ నటిని అని నమ్మడానికి నాకొక కొల మానం ఉంది అంటున్నది బాలీవుడ్ స్టార్



నేను బాగా పాపులర్ నటిని అని నమ్మడానికి నాకొక కొల మానం ఉంది అంటున్నది బాలీవుడ్ స్టార్ అలియా భట్ ..! అదేమిటంటే దేశం లోని చిన్న పట్టణాల్లోని బ్యూటి పార్లర్ లలో కూడా ఎప్పుడైతే నా పోస్టర్లు అతికిస్తారో అప్పుడు మాత్రమే తాను నిజమైన మాస్ స్టార్ గా అంగీకరిస్తానని అంటోందామె.ఎందుకంటె హేమా మాలిని,రేఖ,అమితాబ్,షారుఖ్ ఇలాంటి వాళ్ళంతా చిన్న పట్టణాల్లో సైతం వారి పోస్టర్ల ద్వారా ఆమోదం పొందారు.అంటే అన్ని వర్గాల ప్రాంతాల అభిమానం పొందారు అనడానికి అదే కొలమానం అని అంటున్నది భట్.Click here 

Thursday 5 February 2015

ఆ హీరోని ప్రశ్నించడానికి సమన్లు పంపిన పోలీస్ శాఖ.!



బాలీవుడ్ హీరో అర్జున్ రాంపల్ ప్రస్తుతం ఒక గ్యాంగ్ స్టర్ కధ ఆధారంగా ఓ సినిమా లో నటిస్తున్న సంగతి విదితమే.ఇటీవల ఇతగాడు  ముంబాయి జైలు లో జీవితకాల  జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్ అరుణ్ గావ్లి నీ ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు కలిసి మాట్లాడాడు.ఈ విషయమై ప్రశ్నించడానికి అర్జున్ రాంపల్ కి పోలీసులు సమన్లు అతని ఇంటికి పంపించారు.అతను గనక హాజరు కాకపోతే తామే అతణ్ణి స్వయంగా ప్రశించే అవకాశముందని తెలుపుతున్నారు !Click here  

Tuesday 27 January 2015

నాక అవార్డ్ వచ్చేంత గొప్ప సినిమాలో ఏం నటించానని అంటున్నాడు ఆ సూపర్ స్టార్..!



ఏమిటి గత ఏడాది మీరు నటించిన ఏ సినిమా రాబోయేఅవార్డ్ సినిమాల లిస్ట్ కి నామినీ గాపంపించలేదూ అని ఓ ముంబాయి కి చెందిన టాబ్లాయిడ్ హిందీ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ని అడగగా అతనిచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది.హిట్ అయిన సినిమాల్లో అయితే నటించి ఉండవచ్చునేమో గాని నటన పరంగా గత ఏడాది చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ చేయలేదని కాబట్టి అవార్డ్ రావాలని కూడా తాను ఆశించడం లేదు అన్నాట్ట ఖాన్.అంత నిజాయితీగా ఒప్పుకోవడం అతనికే చెల్లింది.Click here 

Tuesday 16 December 2014

" లింగా" సినిమా రివ్యూ..!

84 ఏళ్ళ వయసు లోను ఆ నటుని తీరే వేరు..!



అటల్ బిహారీ పాండా ..ఒడిశా రంగస్థల నటునిగా పేరెన్నిక గన్న ఈయన ఇటీవల విడుదల అయిన ఆదిం విచార్ అనే ఒడియా సినిమా లో ఓ వృద్ధ గిరిజనుని పాత్ర పోషించి మంచి గుర్తింపు పొందారు.ఆ పాత్ర పేరు కొంధ బుధ ,కొంధమాల్ ప్రాంతం లో నివసించే కొంధ తెగ మీద అల్లిన కధ అది.కపిలేశ్వర్ మొహపాత్ర రాసిన కధ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకున్నది.దీనికి మొదటి భాగాన్ని సాల బుధ అనే పేరుతో తీశారు.దర్శకుడు సబ్యసాచి మొహపాత్ర నన్ను తన సినిమాలో నటించమని కోరినప్పుడు నా వయో భారం వల్ల ఒప్పుకోలేదు.అంతేగాక నాకు అంతకు ముందు సినిమా ల్లో నటించిన అనుభవం కూడా లేదు.దాదాపు 100 నాటకాల్లో నటించాను.63 నాటికలు రాశాను,అయితే కెమెరా అనుభవం గూర్చి తనకి వదిలిపెట్టమని మరీ మరీ దర్శకుడు కోరడం తో నటించాను.రెండు సినిమాలు ఇండియన్ పనోరమ కి ఎన్నిక కావడం,ఇంకా ఉత్తమ నటుని గా అవార్డ్ రావడం సంతోషకరమైన విషయాలు అంటున్నాడు ఈ అటల్ బిహారీ పాండా.

కమర్షియల్ చిత్రాల్లో కంటే ఆర్ట్ చిత్రాల్లో నటించడమే తనకిష్టం అంటున్నాడీయన.కటక్ లోని జనతా రంగ మంచ్ కి చెందిన  ప్రఖ్యాత రంగస్థల నటుడు బాలయ్ బెనర్జీ లా నటిస్తూ స్టేజ్ మీద నే కన్నుమూయాలనేది పాండా అభిమతం.Click here 

Friday 12 December 2014

ఆ నటి కి అతనికి గొడవేమిటో..?



బాబీ ఖాన్ నిర్మిస్తున్న ఒక హిందీ చిత్రం "లీల" సెట్స్ మీద సెక్సీ స్టార్ సన్నీ లియోన్ కి ఇంకో వ్యక్తి కి గొడవ జరిగిందని,ఆ వ్యవహారం లో కో స్టార్ మోహిత్ అహ్లావత్ కలగజేసుకొని చెయ్యి చేసుకోవడం జరిగిందని ఓ టాబ్లాయిడ్ రాసింది.కాగా సదరు సినిమా నిర్మాత,దర్శకులు యధాప్రకారం ఖండించడం జరిగింది.Click here

Wednesday 26 November 2014

అతను కేవలం మిత్రుడే అంటున్న హృతిక్ మాజీ భార్య..



హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే తనకి నటుడు అర్జున్ రాంపల్ కి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అంటున్నది.కొన్ని పత్రికలు అర్జున్ భార్య మెహెర్ కి సుజానే కి సరిపడటం లేదని కధనాలు రాసిన నేపధ్యంలో ఈ ప్రకటన ని పత్రికలకి ఆమె పంపించినట్టు వార్తలు వెలువడ్డాయి.Click here 

Saturday 22 November 2014

కమల్ హాసన్ యూ ట్యూబ్ చానెల్ గురించి తెలుసా..?



ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన సినిమాలు ,కవితలు,కధలు ఇంకా వీటన్నిటిని బయటి ప్రపంచం తో పంచుకోవడానికి "Ulaganaayakan" యూ ట్యూబ్ చానెల్ ని ప్రారంభించారు.ఈ కాలం లో డిజిటాల్ ప్రాధాన్యాన్ని గుర్తించినట్లు చెప్పాలి.వాయ్ మొళి అనే ఓ టీం దీన్ని నిర్వహిస్తుందని వార్త.నాజర్ కూడా కమల్ ని దీనిలో కొన్ని ప్రశ్నలడగటానికి ఒప్పించారట.ఇప్పటికి 2000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఈ చానెల్ కి.Click here

Monday 17 November 2014

త్రిషకి నిన్న ఎంగేజ్మెంట్ అయింది అని వార్త.



నటి  త్రిషకి నిన్న తమిళ వ్యాపారవేత్త వరున్ మణియన్ తో ఎంగెజ్మెంట్ అయిందని వార్త.ట్విట్టర్ లో కూడా హల్ చల్ చేస్తున్నదీ మాట.వరుణ్ రేడియన్స్ రియాలిటి డెవలపర్స్ ఇండియా లిమిటెడ్ కి ఎం.డి.గా ఉన్నాడు.సినిమా నిర్మాణంలో కూడా ఉన్నాడు.వాయిముడి పేసవుం అనే సినిమా కి నిర్మాత గా వ్యవహరించాడు.Click here 

Saturday 15 November 2014

ఐశ్వర్యా రాయ్,అభిషేక్ ల విడాకుల రూమర్లు ఎంతదాకా నిజం..?



అభిషేక్ బచ్చన్,ఐశర్యా రాయ్ ల మధ్య అభిప్రాయ బేధాలు పెరిగాయని అవి విడాకులకు దారి తీయవచ్చునని కొన్ని పత్రికలు కోడై కూస్తున్నాయి. ఎన్ని తగాదాలు ఉన్నా జయాబాధురి,అమితాబ్ లాగానే కలిసి ఉండవచ్చునని కొందరు ఊహాగానం చేస్తున్నారు.ఏమౌతుందో కాలమే చెప్పాలి.ఇటీవల తమ స్వంత వూరు మంగళూరు లో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వీలు కల్పించుకొని వచ్చిందామె.తల్లిదండ్రులు,మిగతా బంధువులని పై చిత్రం లో చూడవచ్చు.ఈ ఫోటోని ఐశ్వర్య తన ట్వీట్ లో భాగంగా పోస్ట్ చేసింది.Click here

Tuesday 4 November 2014

కొడుకు నటించిన సినిమా చెత్తగా ఉందని చెప్పిన జయా బచ్చన్..



ఇటీవల రిలీజయిన సినిమా హేపీ న్యూ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు బాగానే రాబడుతున్నది.షారుక్ ఖాన్,దీపికా ల తో పాటు అభిషేక్ బచ్చన్ కూడా దీని లో ముఖ్య పాత్రలు పోషించారు.జయా బచ్చన్ ని ఆ సినిమా గురించి అడిగినప్పుడు మా అబ్బాయి నటించాడని నేను అబద్ధం చెప్పలేను గాని ఆ సినిమా నాకెంత మాత్రం నచ్చలేదు.పరమ చెత్తగా ఉంది అని కామెంట్ చేసిందావిడ.Click here