Sunday 24 July 2016

"పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మా జాతీయ కవి ని అవమానించింది."



ఈ నెల 13 వ తేదీన నేపాలీ జాతీయ కవి గా గౌరవింపబడే భానుభక్త ఆచార్య యొక్క 202 వ జయంతి వేడుకలు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జరిపిందని దానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ,గవర్నర్ కేసరి నాధ్ త్రిపాఠి  తో పాటుగా మమతా బెనర్జీ హాజరయ్యారని కాని గూర్ఖా ప్రతినిధుల్ని ఒక్కర్ని కూడా వేదిక మీదికి పిలవకపోవడం తమ జాతి కి తీరని అవమానంగా భావిస్తున్నామని GTA ప్రధాన కార్యనిర్వహణాధికారి బిమల్ గురుంగ్ ఆరోపించారు.దానికి నిరసనగా నిన్న శనివారం డార్జిలింగ్ లోని గూర్ఖా రంగ్ మంచ్ భవనం లో ఆ కవి జయంతి వేడుకల్ని ప్రత్యేకంగా జరిపారు.నేపాలీ సాహిత్య సమ్మేళన్ అధ్యక్షుడు జీవన్ నాం డాంగ్ మాట్లాడుతూ జూలై 13 న ఆ కార్యక్రమాన్ని టి.వి. లో ప్రసారం చేసినపుడు చూడగా దాన్ని ఆసాంతమూ ఇంగ్లీష్ భాష లో నిర్వహించారని,అందుకు తమకు అభ్యంతరం లేదు గాని తమ భాష లోకి దాన్ని అనువదించకపోవడం దారుణమని అన్నారు.జాయ్ కాక్టస్ మాట్లాడుతూ గూర్ఖాల్ని విభజించాలని బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.వివిధ సాంస్కృతికోత్సవాలు ఈ వేదిక పై జరిగాయి.

Thursday 21 July 2016

అడ్వకేట్ల చేతి లో జర్నలిస్ట్ లకి గాయాలు...



ఈ రోజు కేరళ రాజధాని తిరువనంతపురం లోని హైకోర్ట్ లో న్యాయవాదులకి,జర్నలిస్ట్ లకి వాగ్వివాదం చెలరేగి దెబ్బలాట కి దారి తీసింది.ఆసియా నెట్ టివి,జీవన్ టివి రిపోర్టర్లకి గాయాలయ్యాయి.జూలై 14 న గవర్నమెంట్ ప్లీడర్ ధనేష్ మాథ్యు మంజురన్ ని ఒక మహిళ ని కించపరిచిన కేసు లో అరెస్ట్ చేయడం జరిగింది,ఆ తరువాత బెయిల్ కూడా వచ్చింది.ఈ ఘటన విషయం లో  వివరణ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాటా మాటా పెరిగి  అడ్వకేట్లు జర్నలిస్ట్ ల్ని చితక బాదారు. 

Sunday 17 July 2016

తన గోడ పక్కన మూత్రం పోశాడని కాల్పులు జరిపిన డాక్టర్.



నిన్న శనివారం ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లో చిన్న కారణానికి తుపాకి తీసి కాల్పులు జరిపాడు ఒక హోమియోపతి డాక్టర్ . ఇంతకీ కారణం ఏమిటంటే ఆయన క్లినిక్ కి దగ్గర లోని ఒక చెత్త కుప్ప మీద మహేశ్వర్  రౌత్రాయ్ అనే ఉద్యోగి మూత్రం పోశాడట. ఎందుకు అక్కడ మూత్రం పోశావు అని డాక్టర్ ప్రధాన్ గద్దించి అడగ్గా ,అది చెత్త కుప్ప కాబట్టి పోశా నీకెందుకు అని జవాబిచ్చాడు రౌత్రాయ్.మాటా మాటా పెరిగి డాక్టర్ ఆవేశం తో లోనికి వెళ్ళి తుపాకి తెచ్చి రౌత్రాయ్ మీద కాల్పులు జరిపాడు.ఎడమ కాలుకి బాగా గాయం అయి రక్తం కారుతుండటం తో కటక్ లోని  ఆసుపత్రికి చేర్చారు.కాల్పులు జరిపి తాపీ గా పేషంట్ లని చూస్తున్న డాక్టర్ ప్రధాన్ ని పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు.చుట్టుపక్కల వాళ్ళు ఆసుపత్రిని ధ్వంసం చేశారు. 

Thursday 14 July 2016

స్మృతి ఇరాని చేసిన నియామకాన్ని ఆపిన ప్రధాని కార్యాలయం



స్మృతి ఇరాని మానవ వనరుల శాఖా మంత్రి గా ఉన్నప్పుడు చేసిన నియామకాన్ని ప్రస్తుతం ప్రధాని మంత్రి కార్యాలయం అనుమతించనట్లుగా వార్తలు తెలుపుతున్నాయి.డా.సర్వేంద్ర విక్రం బహదూర్ సింగ్ ని C.B.S.E. (సెకండరీ విద్య) చీఫ్ గా ఆమె నియామకం చేయడానికి పచ్చ జెండా ఊపగా ,మళ్ళీ తదుపరి ఉత్తర్వులు ప్రధాని ఆధీనం లో ఉన్న అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ ఇస్తుందని అంత వరకు ఆ పోస్ట్ ఖాళీ గా ఉంటుందని తాజా గా లేఖ HRD మంత్రిత్వ శాఖ కి అందింది.2014 నుంచి ఈ పోస్ట్ లో రెగ్యులర్ అధికారి గా ఎవరూ లేరు.కనీసం మూడేళ్ళు విద్యా శాఖ పరిపాలన లో అనుభవం ఉన్న వారికి మాత్రమే ఈ నియామకం లో ప్రాముఖ్యతనిస్తారు.ఆ విధంగా చూస్తే మరో ఇద్దరు అధికారులు సింగ్ కంటే ముందు ఉన్నట్లు భోగట్టా.

Sunday 10 July 2016

మొత్తానికి శవం నిన్న దొరికింది.



ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ కి సమీపం లోని మంచేశ్వర్ లోని ఒక స్లం ప్రాంతం లో అశోక్ దాస్, దీప దంపతులు తమ అయిదేళ్ళ పాప తో గత కొన్ని నెలలుగా నివసిస్తున్నారు.ఉన్నట్టుండి అశోక్ మాయమవడం,భార్య కూడ వేరే చోట కి మకాం మార్చడం తో తెలిసిన ఇరుగు పొరుగు పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఇంటి వెనుక వాసన రావడం తో నిన్న శనివారం మేజిస్ట్రేట్ సమక్షం లో తవ్వగా అశోక్ శవం లోపల కనిపించింది.అయితే ఆ శవాన్ని చాలా జాగ్రత్త గా అయిదు పొరలుగా ప్లాస్టిక్ పదార్ధాల్ని పేర్చి దాని కింద కప్పెట్టారు.కియోంజర్ జిల్లా  కి చెందిన ఈ జంట కొంత కాలం కిందట ఇక్కడకి వచ్చారు.అశోక్ (35) డ్రైవర్ గా పని చేస్తున్నాడు.భార్య భర్తలు తరచు తగాదాలు పెట్టుకొనేవారని ఇరుగు పొరుగు తెలిపారు.భార్య దీప కనిపించకుండా పోవడం తో ఆమె తో పాటు ఇంకెవరి హస్తమైనా ఉందా అని పోలిసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Thursday 16 June 2016

ఆ స్వచ్చంధ సంస్థ గుర్తింపు ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం



ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సబ్రంగ్ ట్రస్ట్ అనే ఎన్ జి వొ యొక్క గుర్తింపు ని రద్దు చేసింది.దీనిని తీస్తా సెతల్వాడ్ అనే సామాజిక కార్యకర్త నడుపుతున్న విషయం తెలిసినదే. విదేశాల నుంచి వచ్చిన నిధులను నిర్దేశించబడని ఇతర పనులకు కేటాయించారనే కారణం తో ఈ చర్య తీసుకున్నారు.FCRA నిబంధనల్ని ఉల్లంఘించి ఓ పబ్లిషింగ్ కంపెని కి 50 లక్షలు  తరలించినట్లు అభియోగం.ఈ ఎన్ జి వొ గుజరాత్ సంఘర్షణల్లో బాధిత ముస్లిం ల తరపున చురుకు గా పనిచేసి 2002 ప్రాంతం లో అప్పటి మోడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టింది.