Sunday 9 April 2017

అతను ఈశాన్య రాష్ట్రాల మైకేల్ జాన్సన్ అని చెప్పాలి.




ఈశాన్య రాష్ట్రాల ల లో రాక్ సింగర్ గా ప్రసిద్దుడైన Michael M Sailo గత  శుక్రవారం అర్ధ రాత్రి మిజోరాం రాస్ట్ర రాజధాని ఐజ్వాల్ లో ఒక బైక్ ప్రమాదం లో మృతి చెందాడు.రాక్,హిప్ హాప్,రాప్,మెటల్ ప్రక్రియల్లో తనకంటూ ఒక బాణీ ని ఏర్పరచుకున్నాడు.అతని భార్య Spi Bawitlung కూడా సింగర్ గా ఉన్నది.అనేక పాటలు పాడి,రాసి,మ్యూజిక్ సమకూర్చి అనేక మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన మరణం ఈశాన్య భారతం ని శోక సముద్రం లో ముంచింది.

Friday 7 April 2017

డాక్టర్ ఇంకా రచయిత గా రాణిస్తున్న ఆ ప్రాంత వాసి ఎందరికి తెలుసు...?


                                                                Dr.Gumlat Maio

ఈశాన్య రాష్ట్రాల్లో ఎంతో వైవిధ్యం ఉంది.కాని అది మిగతా ప్రపంచానికి తెలిసింది తక్కువ అనే చెప్పాలి.డాక్టర్ గుంలాట్ మేయొ మేఘాలయారాష్ట్రం లో Bordumsa అనే పట్టణం లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూనే మరో వైపు రచయిత గా కార్టునిస్ట్ గా తన ప్రతిభ ని చూపిస్తున్నారు.ఆయన ఫేస్ బుక్ పేజీ ని ఇప్పటి దాకా 4 మిలియన్ల మంది సందర్శించారు. ఆయన రాసిన Once upon a time in a college"  అనే ఆంగ్ల నవల ఇప్పటికి రెండు సంపుటులు గా వెలువడింది.ఇవి అమెజాన్,ఫ్లిప్ కార్ట్ ల లో లభ్యమవుతున్నాయి. ఖాళీ ఏ మాత్రం దొరికినా రచనలు చేస్తుంటానని తెలుపుతున్నారు.రస్కిన్ బాండ్,జెరోం కె జెరోం, కిరణ్ దేశాయ్ ,అరుంధతి రాయ్ ఇట్లా చాలా మంది రచయితల్లో ఒక్కో సంవిధానం తనకి నచ్చుతుందని ప్రాంతీయ భాషల్లో కాక ఈశాన్య రాష్ట్రాలనుంచి ఇంగ్లీష్ లో రాసేవారు ఇప్పుడు పెర్గుతున్నారని తెలిపారు.


నాగా లాండ్ గురించి తెలిపే TemsulaAo  రచనలు,సిక్కిం నుంచి రాస్తున్న వారు బాగా అలరిస్తున్నారని అయితే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు సంగీత ప్రియులని 20 నుంచి 50 రాక్ బ్యాండ్ లు ఈ ప్రాంతం నుంచి ఉన్నాయని రచనా రంగం లో దానితో పోలిస్తే తక్కువ గానే ఉన్నారని అభిప్రాయపడ్డారు.AIIMS ధిల్లీ లోను ,ఇటా నగర్ లోని రామకృష్ణ హాస్పిటల్ లోను ఉత్తర బెంగాల్ లోని మెడికల్ కాలేజి లోను గతం లో పనిచేశానని అన్నారు.

Wednesday 29 March 2017

అతనికి డబ్బంటే చేదా ..?



ఈ సారి సాహిత్యానికి ఇచ్చే నోబెల్ బహుమతిబాబ్ డైలాన్ అనే అమెరికన్ వాగ్గేయకారుడి కి ప్రకటించడం జరిగింది అయితే దాన్ని అతను తీసుకుంటాడా లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.జూన్ 10 వ తేదీ లోగా ఆనవాయితీ ప్రకారం బాబ్, స్వీడిష్ అకాడెమి లో తన ప్రసంగం ని వినిపించాలి.అది పెద్ద గా ఉండొచ్చు,చిన్న గా ఉండొచ్చు వేరే విషయం.అలా అయితేనే నోబెల్ బహుమతి తో పాటు ఇచ్చే తొమ్మిది లక్షల పది వేల డాలర్లు ఆయనకి ఇవ్వడం జరుగుతుంది.ఈ విషయాన్ని కమిటీ ఇప్పటికే తెలియజేసినా బాబ్ డైలాన్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు ఇంతదాకా..మరి అతని అంతరంగం ఏమిటో..!  

Thursday 23 February 2017

వికటించిన శోభా డే ట్వీట్



గత మంగళ వారం సోషలైట్ , రచయిత్రి శోభా డే ఒక ట్వీట్ చేసింది.ముంబాయి స్థానిక ఎన్నికలు జరిగినపుడు ఆ భద్రతా పరమైన విధుల్లో  లావు గా కనిపించిన ఒక పోలీస్ అధికారి ఫోటొ ని ట్వీట్ చేస్తూ భారీ బందోబస్త్ జరిగింది అంటూ వ్యాఖ్యానించింది. అయితే ఇది ముంబాయి పోలీస్ లది అని ఆమె అనుకుంది...అయితే ముంబాయి పోలీస్ దానికి స్పందించి ఈ ఫోటో తమ ముంబాయి పోలీస్ వర్గాలది కాదని పద్దతి గా వ్యాఖ్యానించడం నేర్చుకొమ్మని  సలహానిచ్చింది.అయితే ఈ ఫోటో మధ్య ప్రదేశ్ కి చెందిన దౌలత్రాం జోగేవత్ అనే పోలీస్ ఉద్యోగిది ..దీన్ని చూసిన ఆయన తీవ్రంగా స్పందించాడు,బందో బస్త్ కి ముంబాయి వెళ్ళినప్పుడు ఇది తీశారని,అయితే తాను బాగా తిని లావు ఎక్కలేదని తనకి 1993 లో గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగిన పిమ్మట అనారోగ్యం వల్ల అలా అయినానని తన మీద అనుచిత వ్యాఖ్యాలు చేసిన శోభా డే మీద ఎలాంటి చర్య తీసుకోవాలనే విషయం లో తన పై అధికారు తో సంప్రదిస్తున్నానని చెప్పాడాయన.

Saturday 11 February 2017

ఈ సినిమా పిచ్చి అవసరం అయినదాని కంటే చాలా ఎక్కువ.



సోనం వాంగ్ చుక్ (Sonam Wangchuk) అంటే ఎవరు..అని ప్రశ్నించవచ్చు.కాని రాజ్ కుమార్ హిరాని త్రీ ఇడియట్స్ సినిమా  లో ఫున్సుక్ వాంగ్ డు పాత్ర పెట్టడానికి కారణం ఈయనే అని తెలిస్తే పని ఈజీ అవుతుంది. అందరికి మల్లేనే ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళాడు.ఆ తర్వాత తన రూటు తెలుసుకొని తమ ప్రాంతం లడక్ వచ్చేశాడు.ప్రపంచం లోని ఎత్తైన ప్రదేశాల్లో అది ఒకటి.విపరీతమైన చలి.సరైన సదుపాయాలు రవాణా పరంగా లేకపొయినా టూరిస్ట్ లు మొండి కోరిక వల్ల రాగలుగుతున్నారు.ఇంకా అక్కడి సమస్యలు ..ఎన్నో అవి తమ లాంటి వారే తీర్చుకోవాలి.తమ ప్రాంతం గూర్చి తమ కంటే తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు.ఏప్రిల్,మే నెలల్లో అక్కడ హిమం అంతా నీళ్ళ సమస్య ఏర్పడుతుంది.దానికి గాను వాంగ్ చుక్ హీమ స్తూపాలు నిర్మించడం మొదలు పెట్టాడు.అలా నీటిని వాడుకోవడాన్ని తెలివి గా కొనసాగిస్తున్నారు.అలానే సోలార్ సిస్టం ద్వారా మొత్తం లడక్ ని వెలిగిస్తున్నారు.పర్వత ప్రాంతాల్లోని ప్రత్యేక సమస్యల్ని అధ్యయనం చేసి వాటికి సొల్యూషన్లు కనిపెట్టడానికి ఒక యూనివర్శిటి ని పెట్టాడు.దాని పేరు హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అల్టర్నేటివ్స్ ,ఫ్యూచర్ యూనివర్సిటి అని ముద్దు పేరు.ప్రపంచ వ్యాప్తం గా ఎంతో గుర్తింపు వచ్చింది.మన సిలబస్ లు మన ప్రాంత సమస్యల మీద పరిష్కారాలు చూపే విధంగా ఉండాలి తప్ప ఇంకో దేశం నుంచి అరువు తెచ్చుకోకూడదు.అవి ఎంత గొప్పవైనా ..అంటున్నాడు ఈ మేధావి.

మీ నుంచి ఇన్స్పిరేషన్ పొంది సినిమా తీశారు గదా అని అడిగితే మన భారతీయులకి ఈ సినిమా పిచ్చి అవసరం అయినదాని కంటే చాలా ఎక్కువ.దానిని పెద్ద గా పట్టించుకోను అంటాడు వాంగ్ చుక్.విరాళాలు ఓ మంచి పనికి ఇచ్చే సంస్కృతి మన వద్ద రావలసినంత రాలేదు.మూఢ నమ్మకాల పేరు మీద అందినంత ఇస్తుంటారు తప్ప విజ్ఞాన జ్యుతులు వెలిగించడానికి మాత్రం చేతులు రావు అంటాడు.

Thursday 9 February 2017

ఇండియన్ ఎక్స్ ప్రెస్ గుర్తించిన వరంగల్ కుర్రాడి కృషి



అరవింద్ పకిడె (21) వరంగల్ జిల్లా లోని కాంచనపల్లి గ్రామానికి చెందిన కుర్రవాడు.అతని అభిరుచి మూలంగా  చక్కని బ్లాగ్ నిర్వహిస్తూ దాదాపు 400 వందల పురాతత్వ,చారిత్రక ప్రదేశాలను శోధించి తన బ్లాగు లో వివరించాడు.అవి మాత్రమే కాక గుళ్ళు ,చెరువులు ఇలా అనేక ఆసక్తికరమైన అంశాల్ని పొందుపరిచాడు.ఇతను చేపట్టిన మంచి పనులను వివరిస్తూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఈ నెల 6 వ తారీఖు పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చింది.వీలైతే చదవండి.