Monday 19 June 2017

భద్రాచలం డివిజన్ ని ఆంధ్రా ప్రాంతం లో కలపాలి: గొండ్వానా సంక్షేమ పరిషత్


బ్రిటీష్ వారి కాలం నుండి తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా  ఉన్న భద్రాచలం డివిజన్ ని ఆంధ్ర రాష్ట్రం లోనే కలపాలని,ఇప్పటికీ డివిజన్  లో నిలిచి ఉన్న అప్పటి నిర్మాణాలే దీనికి సాక్ష్యమని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ సొందె వీరయ్య అన్నారు.1956 లో ఉన్న ప్రకారమే విభజనని మాత్రమే కె.సి.యార్. కోరారని కాని కొన్ని శక్తుల కి తలొగ్గి ఈ ప్రాంతాన్ని  తెలంగాణా లో కలిపారని,కేంద్రం ఈ విషయం లో పునరాలోచన చేయాలని అప్పుడు మాత్రమే ఇక్కడ గల ఆదివాసీ తెగలకి న్యాయం జరుగుతుందని తెలిపారు.ఈ డిమాండ్ తో భద్రాచలం లో నిన్న ఒక రోజు దీక్ష ని నిర్వహించారు. 

Sunday 28 May 2017

సుదర్శన్ పట్నాయక్ ...ఈ ఒక్క పేరు చాలు.



సుదర్శన్ పట్నాయక్ ...ఈ ఒక్క పేరు చాలు.సైకత కళ కి మన దేశం లో పర్యాయపదం ఆయన పేరు.జాతీయ,అంతర్జాతీయ ప్రాముఖ్యత గల రోజులను భావ యుక్తం గా ఇసుక లో శిల్పాలు గా మార్చి మనల్ని అలరించే వ్యక్తి ఆయన.అసలు ఆ రంగం ని ఎందుకు ఎలా ఎంచుకున్నారో సుదర్శన్ ఒక పత్రిక కి ఇటీవలనే చెప్పారు.ఆయన చిన్నతనం లో తండ్రి ని కోల్పోయారు ,బామ్మ పెన్షన్ తో చిన్నప్పుడు కుటుంబం అంతా గడిచేది.అది సరిపోక పక్క ఇంట్లో పనిమనిషి గా పనిచేశాడు.ఖాళీ గా ఉన్నప్పుడు తను పుట్టిన ఆ పూరి పట్టణం లోని బీచ్ కి వెళ్ళి ఇసుక తో రకరకాల గూళ్ళు నిర్మించేవాడు.ఇది కేవలం ఆర్ట్ మీద ఉన్న తనకున్న ఇష్టం తోనే చేశేవాడు.తప్ప ఎలాంటి ప్రతిఫలం కోసం కాదు.

ఒకసారి తను నిర్మించిన ఇసుక శిల్పాల్న్ని చూసిన విదేశీయులు అతడిని అభినందించారు.దానితో ఆసక్తి పెరిగి దానిని కొనసాగించాడు.రమారమి అయిదు ఏళ్ళు అలాగే పైసా ఆదాయం లేకుండా రోజు అలాంటివి బీచ్ లో నిర్మించేవాడు.ఇట్లా ఇసుక లో వేసేవి కొట్టుకుపోయేవి యే గదా..దీనివల్ల ఏం ప్రయోజనం అని కొంతమంది విమర్శించేవాళ్ళు.కాని ఎందుకనో అది తప్పనిపించేది..మనిషి జీవితం కూడా ఏదో ఒకరోజు పోయేదే అలా అని జీవించడం మానేస్తున్నామా.. అనిపించేది.కొన్నాళ్ళకి చూసే వాళ్ళు పెరిగారు.తన శైలిని ఇంకా మార్చుకొని రకరకాల ప్రయోగాలు ఆ ఇసుక లోనే చేశాడు.

బెర్లిన్ లో జరిగిన అంతర్జాతీయ సైకత పోటీ లో గోల్ మెడల్ వచ్చిన తర్వాత దేశ విదేశాల్లో అతని పేరు మారుమోగింది.ఆ తర్వాత ఒకటా రెండా ఎన్నో పోటీల్లో ఫాల్గొని సైకత కళ కి మన దేశం లో పర్యాయపదం గా మారాడు.పెద్ద గా చదువుకోని ఒక నాటి బాల కార్మికుడు ఈ కళ ద్వారా నే పద్మశ్రీ ఇంకా డాక్టరేట్లు పొందాడు.పట్టు విడువకుండా తన హృదయం చెప్పే పనిని చేసేవారికి గొప్పదనం వెదుక్కుంటూ వస్తుందనడానికి పట్నాయక్ జీవితమే ఓ ఉదాహరణ.ఒడియా ప్రజలు తమ కళా ప్రతినిది గా ఈయనని ఎంతో అభిమానిస్తారు. 

Sunday 9 April 2017

అతను ఈశాన్య రాష్ట్రాల మైకేల్ జాన్సన్ అని చెప్పాలి.




ఈశాన్య రాష్ట్రాల ల లో రాక్ సింగర్ గా ప్రసిద్దుడైన Michael M Sailo గత  శుక్రవారం అర్ధ రాత్రి మిజోరాం రాస్ట్ర రాజధాని ఐజ్వాల్ లో ఒక బైక్ ప్రమాదం లో మృతి చెందాడు.రాక్,హిప్ హాప్,రాప్,మెటల్ ప్రక్రియల్లో తనకంటూ ఒక బాణీ ని ఏర్పరచుకున్నాడు.అతని భార్య Spi Bawitlung కూడా సింగర్ గా ఉన్నది.అనేక పాటలు పాడి,రాసి,మ్యూజిక్ సమకూర్చి అనేక మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన మరణం ఈశాన్య భారతం ని శోక సముద్రం లో ముంచింది.

Friday 7 April 2017

డాక్టర్ ఇంకా రచయిత గా రాణిస్తున్న ఆ ప్రాంత వాసి ఎందరికి తెలుసు...?


                                                                Dr.Gumlat Maio

ఈశాన్య రాష్ట్రాల్లో ఎంతో వైవిధ్యం ఉంది.కాని అది మిగతా ప్రపంచానికి తెలిసింది తక్కువ అనే చెప్పాలి.డాక్టర్ గుంలాట్ మేయొ మేఘాలయారాష్ట్రం లో Bordumsa అనే పట్టణం లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూనే మరో వైపు రచయిత గా కార్టునిస్ట్ గా తన ప్రతిభ ని చూపిస్తున్నారు.ఆయన ఫేస్ బుక్ పేజీ ని ఇప్పటి దాకా 4 మిలియన్ల మంది సందర్శించారు. ఆయన రాసిన Once upon a time in a college"  అనే ఆంగ్ల నవల ఇప్పటికి రెండు సంపుటులు గా వెలువడింది.ఇవి అమెజాన్,ఫ్లిప్ కార్ట్ ల లో లభ్యమవుతున్నాయి. ఖాళీ ఏ మాత్రం దొరికినా రచనలు చేస్తుంటానని తెలుపుతున్నారు.రస్కిన్ బాండ్,జెరోం కె జెరోం, కిరణ్ దేశాయ్ ,అరుంధతి రాయ్ ఇట్లా చాలా మంది రచయితల్లో ఒక్కో సంవిధానం తనకి నచ్చుతుందని ప్రాంతీయ భాషల్లో కాక ఈశాన్య రాష్ట్రాలనుంచి ఇంగ్లీష్ లో రాసేవారు ఇప్పుడు పెర్గుతున్నారని తెలిపారు.


నాగా లాండ్ గురించి తెలిపే TemsulaAo  రచనలు,సిక్కిం నుంచి రాస్తున్న వారు బాగా అలరిస్తున్నారని అయితే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు సంగీత ప్రియులని 20 నుంచి 50 రాక్ బ్యాండ్ లు ఈ ప్రాంతం నుంచి ఉన్నాయని రచనా రంగం లో దానితో పోలిస్తే తక్కువ గానే ఉన్నారని అభిప్రాయపడ్డారు.AIIMS ధిల్లీ లోను ,ఇటా నగర్ లోని రామకృష్ణ హాస్పిటల్ లోను ఉత్తర బెంగాల్ లోని మెడికల్ కాలేజి లోను గతం లో పనిచేశానని అన్నారు.

Wednesday 29 March 2017

అతనికి డబ్బంటే చేదా ..?



ఈ సారి సాహిత్యానికి ఇచ్చే నోబెల్ బహుమతిబాబ్ డైలాన్ అనే అమెరికన్ వాగ్గేయకారుడి కి ప్రకటించడం జరిగింది అయితే దాన్ని అతను తీసుకుంటాడా లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.జూన్ 10 వ తేదీ లోగా ఆనవాయితీ ప్రకారం బాబ్, స్వీడిష్ అకాడెమి లో తన ప్రసంగం ని వినిపించాలి.అది పెద్ద గా ఉండొచ్చు,చిన్న గా ఉండొచ్చు వేరే విషయం.అలా అయితేనే నోబెల్ బహుమతి తో పాటు ఇచ్చే తొమ్మిది లక్షల పది వేల డాలర్లు ఆయనకి ఇవ్వడం జరుగుతుంది.ఈ విషయాన్ని కమిటీ ఇప్పటికే తెలియజేసినా బాబ్ డైలాన్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు ఇంతదాకా..మరి అతని అంతరంగం ఏమిటో..!  

Thursday 23 February 2017

వికటించిన శోభా డే ట్వీట్



గత మంగళ వారం సోషలైట్ , రచయిత్రి శోభా డే ఒక ట్వీట్ చేసింది.ముంబాయి స్థానిక ఎన్నికలు జరిగినపుడు ఆ భద్రతా పరమైన విధుల్లో  లావు గా కనిపించిన ఒక పోలీస్ అధికారి ఫోటొ ని ట్వీట్ చేస్తూ భారీ బందోబస్త్ జరిగింది అంటూ వ్యాఖ్యానించింది. అయితే ఇది ముంబాయి పోలీస్ లది అని ఆమె అనుకుంది...అయితే ముంబాయి పోలీస్ దానికి స్పందించి ఈ ఫోటో తమ ముంబాయి పోలీస్ వర్గాలది కాదని పద్దతి గా వ్యాఖ్యానించడం నేర్చుకొమ్మని  సలహానిచ్చింది.అయితే ఈ ఫోటో మధ్య ప్రదేశ్ కి చెందిన దౌలత్రాం జోగేవత్ అనే పోలీస్ ఉద్యోగిది ..దీన్ని చూసిన ఆయన తీవ్రంగా స్పందించాడు,బందో బస్త్ కి ముంబాయి వెళ్ళినప్పుడు ఇది తీశారని,అయితే తాను బాగా తిని లావు ఎక్కలేదని తనకి 1993 లో గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగిన పిమ్మట అనారోగ్యం వల్ల అలా అయినానని తన మీద అనుచిత వ్యాఖ్యాలు చేసిన శోభా డే మీద ఎలాంటి చర్య తీసుకోవాలనే విషయం లో తన పై అధికారు తో సంప్రదిస్తున్నానని చెప్పాడాయన.