Saturday 8 March 2014

పాకిస్తాన్ క్రికెట్ జట్టు కి జై కొట్టి సస్పెండైన యూనివర్సిటి విద్యార్థులు



పాకిస్తాన్ - భారత్ మధ్య గత ఆదివారం జరిగిన క్రికెట్ మేచ్ ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఉద్రిక్తతలు రగిలించింది.అక్కడ ఉన్న స్వామి వివేకానంద భారతి యూనివర్సిటి లో చదువుతున్న కాశ్మీరి విధ్యార్థులు కొందరు టి.వి.చూస్తూ పాకిస్తాన్ జట్టు కి జేజేలు కొడుతుండడంతో కొందరు  ఇతర విద్యార్థులు వ్యతిరేకించారు.దీనితో ఘర్షణ మొదలైంది.ఆ రాత్రి జరిగిన సంఘటనల ఆధారంగా 67 మంది కాశ్మీరి విధ్యార్థులని వైస్ చాన్స్ లర్ సస్పెండ్ చేశారు.

ఆ తరువాత సెక్యూరిటి కల్పించి కాశ్మీర్ కి పంపేశారు. రమారమి 200 మంది కాశ్మీరి యువతీయువకులు అక్కడ చదువుకుంటున్నారు.పాకిస్తాన్ జిందాబాద్ అన్న స్లోగన్ లు చేసినందుకు గాను వారిని 123A(sedition) చట్టం కింద బుక్ చేశారు.ఈ చట్టం ప్రకారం 3 ఏళ్ళ నుండి జీవితాంతం విద్యాలయాలకి దూరంగా ఉంచవచ్చు.

అయితే కాశ్మీర్ నుంచి వెలువడే కాశ్మీర్ రీడర్ అనే పత్రిక మాత్రం యూనివర్సిటి లో గొడవ జరిగిన రోజున కాశ్మీరీ యువకుల లాప్ టాప్ లను స్థానిక విద్యార్ధులు బద్దలు చేశారని,రాళ్ళతో దాడి చేశారని ,మళ్ళీ తెల్లవారిన తరువాత తమ నిరసనని తెలియబరిచే అవకాశం కూడా లేకుండా వారిని సస్పెండ్ చేసి పంపించివేశారని ప్రచురించింది.

కొసమెరుపు ఏమిటంటే కాశ్మీర్ ముఖ్యమంత్రి అబ్దుల్లా యు.పి. ముఖ్యమంత్రి తో ఈ విషయమై సంప్రదించడంతో విధ్యార్దులపై పెట్టిన కేసు లోని తీవ్రతని (sedition) తగ్గించినట్లు గురువారం తెలిసింది.  Click here

No comments:

Post a Comment