వాయు దళం,పదాతి దళం సం యుక్తంగా తీవ్రవాదుల్ని అణచివేసే పనిలో భాగంగా రాజస్తాన్ లోనికొన్ని ప్రాంతాల్లో ఎక్సర్ సైజ్ లు (శతృజీత్)గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు.నిజ పరిస్థితుల్ని కల్పించి పాల్గొనే ఈ దశలో ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు తెలియవచ్చింది.విపరీతమైన వేడి,గాయాలు,పాము కాటు ఇలాంటి కారణాల వల్ల మరణించినట్లు వార్త.రాత్రి వేళల్లో పేరాట్రూపర్లు లక్ష్య ప్రాంతాలపై దిగి దాడి చేయడం వంటివి కూడా దీని లో భాగం.ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ ప్రమాద ప్రాంతాల్లో ని గాయపడిన సిబ్బందిని సందర్శించారు.మృతుల సంఖ్యని ఇంకా అధికారికంగా ప్రకటించవలసి ఉంది.
No comments:
Post a Comment