Showing posts with label అంతర్జాతీయ వార్తలు. Show all posts
Showing posts with label అంతర్జాతీయ వార్తలు. Show all posts

Monday 9 February 2015

మన భారతీయ కోటీశ్వరులు 16 వ స్థానం లో

4.1 అమెరికన్ బిలియన్ డాలర్లు మొత్తాన్ని స్విస్ బ్యాంకుల్లో దాచి మన భారతీయ కోటీశ్వరులు 16 వ స్థానం లో నిలిచారుట.మొత్తం 200 దేశాలనుంచి ఖాతాలు కలిగిన అకౌంట్ హోల్డర్ల ని పరిగణని లోనికి తీసుకున్నప్పుడు.

19000 మంది ఖాతాదారులు తమ దేశం వివరాల్ని వెల్లడించలేదట ఈ లిస్ట్ లో..!31.2 అమెరికన్ బిలియన్ డాలర్ల ని దాచి స్విస్ పౌరులు అగ్రశ్రేణి లో నిలిచారు.ఆ తర్వాత యు.కె.,వెనెజుల,అమెరికా,ఫ్రాన్స్ దేశాలు టాప్ ఫైవ్ లో నిలిచాయి.కాగా ఖాతాలు కలిగిఉన్న దేశాల్లో మన దేశానికి 18 వ ర్యాంక్ ఇచ్చారు.Click here

Wednesday 28 January 2015

సెకండ్ హేండ్ సైకిల్ మీద ప్రపంచాన్ని చుట్టివచ్చిన ఈ యువకుడు మీకు తెలుసా..?



చార్లీ వాకర్ (27) ది యునైటెడ్ కింగ్డం లోని Bowerchalke .అతనికి సైకిల్ మీద ప్రపంచాన్ని చుట్టి రావాలని నాలుగేళ్ళ క్రితం అనిపించింది.అంతే..!1606 రోజుల్లో ,61 దేశాల్ని పలు శ్రమలకోర్చి తిరిగి వచ్చాడు.పోయిన డిసెంబర్ మొదటి వారం లో ఇంటికి తిరిగి వచ్చాడు.తన సెకండ్ హేండ్ సైకిల్ OLD JEFF తో మూడు ఖండాల్ని చుట్టివచ్చాడు.ఈ ప్రయాణాల్లో తన సైకిల్ కి 250 కి పైగా పంక్చర్లు పడ్డాయని తెలిపాడు.మొత్తానికి మన ఇండియా తో పాటు 60 దేశాల్ని సందర్శించాడు.Click here

Thursday 8 January 2015

ఈ రోజు ఉదయం తీసిన ఇమ్రాన్ ఖాన్ దంపతుల ఫోటో చూశారా..?



పాకిస్తాన్ క్రికెటర్ ,రాజకీయ నేత ఇమ్రాన్ ఖాన్ ఈ రోజు ఉదయం టి.వి.జర్నలిస్ట్ రెహం ని నిఖా చేసుకున్న తర్వాత తీసిన ఫోటోలివి.ఇస్లామా బాద్ లోని ఆయన స్వగృహం లో కార్యక్రమం జరిగింది.వధువు గతం లో బిబిసి లో పనిచేసిన సంగతి తెలిసిందే.Click here 

Tuesday 6 January 2015

మళ్ళీ పెళ్ళాడబోతున్నాను అంటున్న ఇమ్రాన్ ఖాన్...!



62 రెండేళ్ళ  మాజీ పాకిస్తాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మళ్ళీ త్వరలోనే పెళ్ళిచేసుకోబోతున్నట్లు హిత్రూ విమానాశ్రయం లో విలేకరులకి తెలియజేశారు.రెహం అనే ఈమె బిబిసి లో గతం లో వాతావరణ వివరాలు తెలిపే రిపోర్టర్ గా ఉండేది అయితే ప్రస్తుతం ఈవిడ పాకిస్తాన్ లోని ఓ చానెల్ లో పనిచేస్తున్నది.ప్రస్తుతం ఖాన్ తెహ్రిక్ ఎ ఇన్సాఫ్ అనే పార్టీ కి అధినేత గా ఉన్న విషయం తెలిసిందే.గతం లో ఇమ్రాన్ ఖాన్, జెమీమా అనే బ్రిటిష్ యువతిని పెళ్ళాడి ఇద్దరు పిల్లల్ని కన్న విషయం తెలిసిందే.ఆమె 2004 లో ఈయనకి విడాకులిచ్చింది.Click here 

Thursday 18 December 2014

ప్రతీకార దాడుల్లో 57 మంది తీవృవాదుల్ని మట్టుబెట్టిన పాక్ సైన్యం



పెషావర్ దాడి తో మేలుకున్న పాక్ సైన్యం నిన్న 20 కి పైగా విమాన దాడుల్ని చేసి ఖైబర్ ప్రాంతం లోని తిరా లోయ వద్ద 57 కి మందికి పైగా తాలిబన్ మిలిటెంట్ లని మట్టుబెట్టింది.ఈ ప్రాంతం లోనే ఆత్మాహుతి దళాలకి మిలిటెంట్ లు శిక్షణ ఇస్తుంటారు.ఖైబర్-1 అనే పేరు తో ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.ఒక వారం లోపులో ఉగ్రవాదుల్ని ఏరివేసే దిశగా దాడులు జరుపుతున్నారు.ఈ విషయం లో ప్రధాని నవాజ్ షరీఫ్ అనుమతినిచ్చినట్లు తెలుస్తున్నది.సైన్యం జరిపిన దాడులకి ప్రతిగానే తాము పెషావర్ దాడి జరిపినట్లు తాలిబన్లు సమర్ధించుకున్నారు.Click here

Wednesday 12 November 2014

మైన్మార్ లో సంగీతాన్ని ఆస్వాదిస్తున్న ప్రధాని మోడి



ఈ రోజు బుధవారం మధ్యానం నరేంద్ర మోడి మైన్మార్ లో కాసేపు అక్కడి సంప్రదాయ వాయిద్యం వాయించిన విధానాన్ని ఓ హోటల్ లో తిలకించారు.దాన్ని వారి భాషలో పటాలా అంటారు.కొరియా నాయకుని తో సమావేశమైన తర్వాత వస్తూ ఈ సంగీతకారుని ప్రతిభని విన్నారన్నమాట.Click here 

Saturday 8 November 2014

ఈ ఏడాదికి ఆమె సంపాదనే టాప్...!



Beyonce ..ఈ పాప్ సింగర్ పేరు తప్పకుండా వినేవుంటారు.2014 సంవత్సరానికి గాను ఎక్కువ ఆదాయం పొందిన గాయనీమణుల్లో ఈమే టాప్ లో ఉంది.115 మిలియన్ల యు.ఎస్. డాలర్ల తో ఈమె మొదటి స్థానం లో నిలిచింది.గత మంగళ వారం ఫోర్బ్స్ పత్రిక ఈ సర్వే ని ప్రకటించింది.33 ఏళ్ళ బియాన్స్ అంతకు ముందు సంవత్సరం 4 వ స్థానం లో నిలిచింది.Click here 

Friday 7 November 2014

నిఘా నేత్రాలకి అందకుండా పోయిన దావుద్ ఇబ్రహిం,చోటా రాజన్ లు ఎక్కడున్నట్లు..?



దావుద్ ఇబ్రహీం 1993 ముంబాయి పేలుళ్ళ తర్వాత కనిపించకుండాపోయిన విషయం తెలిసినదే.పాకిస్తాన్ లోని కరాచి నగరం లో టోనీ క్లిఫ్టన్ రోడ్ లో అతనికి ,అతను సోదరుడు అనీస్ ఇబ్రహీం కి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ISI చక్కటి బంగళాల్లో ఆశ్రయం కల్పించిన విష్యం తెలిసిందే.అయితే ఉన్నట్టుండి నిఘా సంస్థల రాడార్ లకి కూడా దొరకకుండా దావుద్ మసలుతున్నట్టు తెలుస్తున్నది.గత నెల రోజులుగా అతని ఆచూకి నిఘా సంస్థలకి కూడా దొరకడం లేదు.గతం లో దావుద్ హాజ్ యాత్ర చేసినా ,దుబాయ్ వెళ్ళినా అతని జాడల్ని కనిపెట్టేవి నిఘా సంస్థలు.ఈసారి మాత్రం అతని అదృశ్యం వెనుక కారణాలు ఏమిటో ఎవరికి అంతు పట్టడం లేదు.

ఇదిలా ఉండగా ఇంకొక అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ఆచూకి కూడా నిఘా సంస్థలకి దొరకడం లేదట నెల రోజులనుంచి.బ్యాంకాక్ నుంచి సింగ పూర్ కి చక్కర్లు కొడుతుండే అతను జాడ కూడా తెలియకుండా పోయింది.చోటా రాజన్ దావుద్ కి ఒకప్పుడు అనుచరునిగా  ఉండి ఆ తర్వాత విడిపోయాడు.Click here 

Friday 31 October 2014

నేను ఒసామా బిన్ లాడెన్ ని ఎలా చంపానో త్వరలో చెబుతాను:ఒక Navy SEAL



ఒసామా బిన్ లాడెన్ గూర్చి తెలియనిదెవరికి..? అయితే అతడిని 2011 లో అబోటా బాద్ లోని నివాసం లో అమెరికన్ నేవీ సీల్ కమెండోలు కాల్చి చంపిన విషయం చాలా మందికి తెలుసు గాని దానిలో ఫాల్గొన్న వారి వ్యక్తిగత వివరాలు ఇంతవరకు ఎక్కడా బయటకి పొక్కలేదు.అయితే ఆ ఆపరేషన్ లో ఫాల్గొని బిన్ లాడెన్ పై కాల్పులు జరిపిన ఓ కమెండో ఈ నెల 10 ఇంకా 11 వ తేదీ ల్లో Fox news channel వారికి తన అనుభవాలు వివరించనున్నాడు.రెండు భాగాలుగా ఈ ప్రోగ్రాం వస్తుంది.ఆ చానెల్ వాషింగ్టన్ కరస్పాండెంట్ పీటర్ డూసి ఈ ప్రోగ్రాం కి హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.మన దేశ కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలనుంచి చూడవచ్చు. Click here

Sunday 12 October 2014

మలాల ఇస్లాం వ్యతిరేకి కాబట్టే నోబెల్ ఇచ్చారు:జమాత్ ఉల్ అహ్రార్



మలాల యూసుఫ్జై కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం వెనుక ఉన్న అర్ధం ఏమిటంటే ఆమె అవిశ్వాసులకి ఏజంట్  అని కొత్త నిర్వచనం ఇచ్చారు జమాత్ ఉల్ అహ్రార్ ప్రతినిధులు.ఆమె ఇస్లాం కి ఎంత మాత్రం చెందని వ్యక్తి.ఇస్లాం వ్యతిరేకులపై జరిపే పోరాటం ఆపేది లేదని మొన్న శుక్రవారం ఇస్లామాబాద్ లో వారు ప్రకటించారు. ఈ అవార్డ్ నివ్వడాన్ని తాము ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు..!Click here

వాళ్ళు ట్విట్టర్ సంస్థని ని బెదిరిస్తున్నారు : ట్విట్టర్ సి యి వో



సిరియా,ఇరాక్ దేశాల్లోకి దూసుకెళుతున్న ఇస్లామిక్ స్టేట్ (IS) తీవ్రవాదులు ట్విట్టర్ సంస్థ ఉద్యోగుల్ని చంపుతామని బెదిరిస్తున్నారని దాని సియివో డిక్ కోస్టొలొ న్యూయార్క్ లో వెల్లడించారు.ఆ తీవ్రవాదుల అకౌంట్ లని ట్విట్టర్ సంస్థ డిలిట్ చేసేయ్యడం తో వారు ఈ బెదిరింపులు చేశారని చెప్పారు.మెసేజ్ లు పంపుకోవడానికి వారు ఈ సోషల్ నెట్ వర్క్ ని ఉపయోగించుకునేవారు.అయితే అది తమ నిభందనలకు విరుద్ధం కావడం తో వాటిని డిలిట్ చేశామని,అనేక దేశాల్లో కూడా దీనికి వ్యతిరేకమైన చట్టాలున్నాయని ఆయన తెలిపారు.Click here 

Monday 6 October 2014

భారత్ ఈద్ స్వీట్స్ తీసుకోవడానికి నిరాకరించిన పాకిస్తాన్ రేంజర్లు



వాఘా సరిహద్దులో రెండు దేశాలు వేపు నుంచి పాక్,భారత్ రక్షక దళాలు చేసే కవాతుని ,జెండా అవనత దృశ్యాన్ని చూడటానికి అనేకమంది పర్యాటకులు వెళుతుంటారు.ప్రతి ఈద్ కి ఇరు  దేశాలు స్వీట్స్ ని ఇచ్చి పుచ్చుకుంటుంటాయి.అయితే ఈ రోజు ఈద్ సందర్భంగా భారత్ దళాలు ఇచ్చిన స్వీట్స్ ని తీసుకోవడానికి పాకిస్తాన్ రేంజర్లు నిరాకరించారు.కారణాలు ఏమిటనేది పూర్తిగా తెలియ రాలేదు. Click here










Sunday 5 October 2014

నా ఆస్తులెన్ని ఉన్నాయో లెక్కబెట్టలేదు: జాకీ చాన్



జాకీ చాన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు...ఫైట్స్ ని హాస్యం తో ముడివేసి వయోలెన్స్ కి మరో అర్ధం చెప్పిన నటుడతను.ఆయన భార్య మాజీ తైవానీస్ నటి..వారికి ఒక కుమారుడు పేరు జేసీ .నేను ఎక్కువగా లాస్ ఏంజిల్స్ లో నే ఉంటాను.ఏ పని చూసుకొనైనా ఇంటికి చేరతాను. రెండు మూడు ఇళ్ళు మెయింటైన్ చేయలేను.అయితే ఒకటి పనిలో పడితే ఓ నెల కూడా కనిపించకపోవచ్చు.వివిధ దేశాల్లో రెస్టారెంట్లు,  ధియేటర్లు,వాచీ,కాఫీ బిజినెస్లు ఇలా చాలా ఉన్నాయి తనకి.దాని విలువ ఎంత అంటే మాత్రం ఎప్పుడూ లెక్కపెట్టలేదు అంటాడు.అతని మేనేజరు అనడం 130 మిలియన్ డాలర్లు దాకా ఉండవచ్చునని.నాకు ఇప్పుడు 60 ఏళ్ళు..రిటైర్ అవ్వాలని ఉంది కాని సినిమాలు నన్ను అవనివ్వడం లేదు.ఇంకో అయ్దేళ్ళ దాకా నేను బిజి అంటున్నాడు జాకీ చాన్.అన్నట్లు ఆయనకి సొంత ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది.అయినా ఇతరుల నిర్మాణం లోను..అతను నటిస్తుంటాడు. ప్రపంచం మొత్తం మీద అతనికున్న అసెట్స్ లో 26 స్కూళ్ళు కూడా ఉన్నాయి.చైనా లో తన మీద ఓ థీం పార్క్ పెట్టాలనేది అతని కోరికట.Click here 

Thursday 25 September 2014

రెండవ బిడ్డ కావాలంటే ఆ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేయాలిసిందే...!



చైనా అనగానే కుంగ్ పావొ చికెన్,జాకీ చాన్,Kung Fu లాంటివి గుర్తుకు వస్తుంటాయి.చైనా అనగానే మరొకటికూడా గుర్తుకు రావాలి.ప్రతి పుట్టబోయే బిడ్డ కి బార్ కోడ్ ఇస్తున్న  దేశం. మన దేశం లో చవకగా  సరుకులు కావాలంటే రేషన్ కార్డు తీసుకొని లైన్ లో ఎలా నిలబడాలో,చైనా లో రెండవ బిడ్డ కావాలన్నా అలాగే ప్రభుత్వ కార్యాలయాల ముందు నిలబడి అనుమతి కోసం కొన్ని పత్రాల్ని నింపి ఇవ్వవలసి ఉంటుంది.ఇటీవలనే అక్కడ ప్రభుత్వం 20,000 జంటలకి రెండవ బిడ్డని కనడానికి అనుమతినిచ్చిందట.1979 నుండి ఒకే బిడ్డ అనే పాలసి తో ఉండడం వల్ల ప్రస్తుతం పనిచేసే యువశక్తి తగ్గుతూందని గ్రహించి ఈ మేరకు ఫిబ్రవరిలో కొంత వెసులుబాటుని ప్రకటించారు.జనాభా నియంత్రణ పాటించడం వల్ల 400 మిలియన్ ల జననాల్ని ఆపినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.Click here  

Friday 15 August 2014

ఇమ్రాన్ ఖాన్ వాహనం పై కాల్పులు



ఈ రోజు పాకిస్తాన్ లోని గుజ్రన్వాల లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వం లో జరిగిన ఓ ర్యాలీ లో అతని కాన్వాయ్ పై కాల్పులు జరపడం తో ఉద్రిక్తత నెలకొంది.15 నెలల క్రితం పాక్ లో ప్రజాస్వామ్య యుతం గా నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఏర్పడింది.మతపెద్ద తాహిర్ ఉల్ ఖాద్రి ఇంకా ఇమ్రాన్ ఖాన్ వంటి ప్రభుత్వ వ్యతిరేక పార్టి ల నుంచి ఆందోళనకారులు ప్రభుత్వం గద్దె దిగాలనే డిమాండ్ తో ఈ రోజు దిగ్బంధనానికి పిలుపునిచ్చారు.ఊరేగింపుదారులు డ్రమ్ములు మోగించుకుంటూ ,పెద్ద ఎత్తున గుమిగూడి ఆందోళనకి ఉద్యమించడం తో గందరగోళం చెలరేగింది.ఈ దశలో కొంతమంది కాల్పులు జరపడం తో ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్ కి బులెట్లు తగిలాయి.అయితే అతనికి హాని ఏమీ జరగలేదు.

కొంతమంది కధనం ప్రకారం ఇమ్రాన్ వెనుక ఆర్మీ సహకారం ఉండిఉండవచ్చునని అంటున్నారు.గత కొద్దికాలంగా తాలిబన్ల మీద కఠినవైఖరి అవలంబించడం కొన్ని ఆర్మీ వర్గాలకు కంటగింపుగా ఉన్నది.ప్రభుత్వ పోస్టర్లను ,వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేసినట్టు భోగట్టా. Click here

Monday 28 July 2014

ఫేస్ బుక్ పోస్ట్ తో చెలరేగిన గుంపు: 3 గురు మృతి



నిన్న ఆదివారం సాయంత్రం పాకిస్తాన్ లోని గుజ్రన్వాల్ అనే ఊరిలో హింస చెలరేగింది.ఆ ఘటనలో అహ్మదీ మైనారిటి తెగ కి చెందిన 60 ఏళ్ళ మహిళ ,ఒక 6 సంవత్సరాలు ఉన్న పాప,కేర్ టేకర్ దుర్మరణం పాలయ్యారు.ఫేస్ బుక్ లో ఒక అభ్యంతరకరమైన పోస్టింగ్ ని ఒక అహ్మదీ తెగ కి చెందిన కుర్రాడు పెట్టాడన్న వార్త తో ముస్లిం వర్గానికి చెందిన జనాలు పెద్దేత్తున అహ్మదీ తెగ కి చెందిన వారి ఇళ్ళపై దాడులు చేశారు.లూటీలు చేశారు.1984 లో అహ్మదీ తెగని నాన్ ఇస్లాం తెగగా పాకిస్తాన్ లా గుర్తించి ప్రకటించింది.గత నాలుగు ఏళ్ళలో 86 మంది అహ్మదీలు వివిధ ఘర్షనల్లో మృతి చెందారు. Click here

Friday 20 June 2014

తమ పిల్లలు కూడా తమలాగే కష్టపడి పైకిరావాలంటున్న ఒబామా దంపతులు.



ఒబామా గాని అమెరికా ప్రధమ మహిళ మిచేల్ గాని తాము లా పట్టభద్రులు అయ్యేంత వరకు చిన్న చిన్న పనులు చేసి తమ జీవిక ని సంపాదించుకునేవారు.తమ కుమార్తెలు మాలియ(16),సషా (13) కూడా అలాంటి అనుభవాల లోనుంచి పరిణితి పొందాలని వారు అభిలషిస్తున్నట్లు Parade పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు.ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఒబామా ఒకప్పుడు ఐస్ క్రీంస్ సేల్స్ మేన్ గా,పెయింటర్ గా కూడా పనిచేశారు.అలాగే మిచేల్ బుక్ బైండింగ్ షాప్ లో పనిచేశారు.పెద్ద కుమార్తె ప్రస్తుతం సిబిఎస్ టెలివిజన్ లో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నదుకు ఆనందిస్తున్నట్లు తెలిపారు.తమ వలె తమ పిల్లలు కూడా కష్టపడి పైకి రావడాన్ని తాము కోరుకొంటున్నట్లు ఈ సంధర్భంగా అన్నారు. Click here

Thursday 19 June 2014

క్రికెటర్ భార్యని వేధించిన ఆకతాయి అరెస్ట్



బంగ్లా దేశ్ కి చెందిన ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ భార్యని వేధించిన ఆకతాయి రహీద్ (23)ని గురువారం ఢాకా పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ నెల 15 వ తేదీన మీర్ పూర్ నేషనల్ క్రికెట్ స్టేడియం లో భారత్,బంగ్లాదేశ్ జట్ల మధ్య మేచ్ జరిగింది.ఆ సంధర్భం లో షకీబ్ భార్య పట్ల కొందరు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించారు.పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశారు.ఇంకా కొంత మంది పట్టుబడవలసి ఉంది.క్రికెట్ స్టేడియం వద్ద వాన వల్ల రద్దయిన మేచ్ గురించి రగడ చెలరేగి చివరికిలా పరిణమించింది.Click here

Wednesday 11 June 2014

సోనియా గాంధి పై కేసు కొట్టివేసిన అమెరికా ఫెడెరల్ కోర్ట్..!



యు.ఎస్.లోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్ట్ గత సోమవారం సోనియా గాంధి పై సిఖ్ సంఘాలు పెట్టిన ఓ కేసుని కొట్టివేసింది.న్యూయార్క్ కి చెందిన సిఖ్ ఫర్ జస్టిస్ అనే సంస్థ 1984 నవంబర్ లో జరిగిన అల్లర్ల నిందితులకు రక్షణ కల్పిస్తున్నారని ఆమె పై కేసు పెట్టారు.కాగా దాని లో సరైన విషయం లేదని ఫెడరల్ కోర్ట్ త్రోసిపుచ్చింది.అయితే పై కోర్ట్ కి వెళతామని సిఖ్ సంఘాలు అంటున్నాయి."The Alien Tort Statute " కింద అంతర్జాతీయంగా ఎక్కడ హక్కులు ఉల్లంఘన జరిగినా అమెరికా లోని ఫెడరల్ కోర్ట్ లో అప్పీలు చేసుకోవచ్చు.దీన్ని 1789 లో అక్కడి న్యాయవ్యవస్థ ఆమోదించింది. Click here

Monday 9 June 2014

ఈ దాడి వెనుక ఎవరి ప్రమేయమున్నదో...?



ఆదివారం రాత్రి పాకిస్తాన్ లోని కరాచి ఇంటర్నేషనల్ విమానాశ్రయం లో 10 మంది తీవృవాదులు జొరబడి బాంబులతో విధ్వంసం సృష్టిస్తూ ఆ తర్వాత సెక్యూరిటి సిబ్బందిపై దాడి చేశారు.సుమారుగా 6 గంటలు పాటు జరిగిన పోరాటం లో పాక్ సైన్యం పదిమంది ని చంపివేసింది.కాగా మిగతా 11 మంది చనిపోయినవారు ఇతరులుగా చెబుతున్నారు.తాలిబన్ల పై ఉక్కుపాదం మోపే దిశగా నవాజ్ షరీఫ్,సైన్యం యోచిస్తున్న ఈ దశలో దాడి జరగడం చూస్తుంటే అది వారికి సంబందించిన పనేనని కొన్ని వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.ఏ సంస్థ ఇంతవరకు ఎలాంటి ప్రకటన దాడుల విషయం లో చేయలేదు.Click here