Sunday, 16 February 2020

లక్ష దీవుల వంటకాలు అక్కడ ప్రత్యేకతలక్ష దీవులు అంటే చాలా మందికి కేవలం మన దేశానికి చెందిన దీవులు మాత్రమే.కాని కేరళ కి చెందిన ముగ్గురు యువకులు మాత్రం ఆ దీవుల కి చెందిన రకరకాల వంటకాల్ని రుచి చూపించడానికి కేరళ లోని కోజికోడ్ లో ఒక హోటల్ ని తెరిచారు.హమిదుల్లా మహ్మద్,నౌషాద్, నిషాల్ పరంబిల్ అనే విద్యార్థులు సరదాగా తమ పాకెట్ మనీ కోసం ఈ దుఖాణం ని తెరిచారు.అయితే అది ఇప్పుడు  మంచి లాభాల్ని కూడా తెచ్చిపెడుతోంది.సముద్ర చేపలు,కొబ్బరి వంటకాలు అన్నీ కలిపి 20 రకాల వంటకాలు ఇక్కడ లభ్యమవుతాయి.కేవలం మేము 700 చదరపు అడుగుల స్థలం లోనే షాపు తెరిచాము.కష్టమర్లు బాగా సమకూరారు.ప్రస్తుతం మేము కొన్ని విదేశాలకి కూడా మా ఉత్పత్తుల్ని పంపిస్తున్నాము.ప్రభుత్వం అందిస్తున్న సాయం తో లక్ష దీవుల్లో కూడా బ్రాంచ్ పెట్టబోతున్నాము.టునా పికిల్,కోకోనట్ వినెగర్,టునా మాస్ పాపడ్,టునా మాస్ ఫ్రై,ఇలాంటివే కాకుండా లక్ష దీవుల్లో లభ్యమయ్యే ఔషధ ఉత్పత్తుల్ని కూడా విక్రయిస్తున్నాము అని ఆ యువకులు అంటున్నారు.    

No comments:

Post a Comment