Showing posts with label అంతర్జాతీయ వార్తలు. Show all posts
Showing posts with label అంతర్జాతీయ వార్తలు. Show all posts

Tuesday 31 May 2016

ఏ.ఆర్. రెహమాన్ కి జపాన్ దేశపు అత్యున్నత పురస్కారం



ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ కి ఆసియా ప్రాంతపు సాంస్కృతిక  విలువలను ప్రచారం చేసినందుకు గాను ,ప్రత్యేకించి సంగీత విభాగానికి సంబందించి చేసిన సేవలకి గాను Grand Fukuoka Prize ని 2016 ఏడాది కి గాను జపాన్ దేశం ప్రకటించింది.ఈ పురస్కారం సందర్భంగా రెహమాన్ తన కళ గురించి ప్రత్యేక ఉపన్యాసం చేస్తారు.ఆయనతో పాటుగా ఫిలిప్పైన్స్ కి చెందిన అమెత్ ఆర్ ఒకాంపో (విద్య) ,పాకిస్తాన్ కి చెందిన యాసిన్ లారి (కళలు) కూడా పురస్కారాలు అందుకుంటారు.గతం లో రవి శంకర్ (సితార్),పద్మా సుబ్ర్హమణ్యం(నృత్యం),రొమిల్లా థాపర్ (చరిత్ర),అంజాద్ అలీ ఖాన్ (సరోద్ వాయిద్యం),ఆశిష్ నంది(రచయిత) ,ఇంకా ఇతరులు భారత్ నుంచి ఈ పురస్కారాన్ని పొందారు. 

Sunday 3 April 2016

స్మశానాలకి అంత డిమాండా..?



చైనా లో ఇప్పుడు బాగా బూం ఉన్న బిజినెస్ ఏమిటో తెలుసా..? స్మశాన వాటిక ల బిజినెస్..! చనిపోయిన తల్లి దండ్రులకి శాస్త్రోక్తంగా సమాధులు నిర్మించాలనేది అక్కడి వారి నమ్మకం.దానివల్ల స్థలం కొరత ఏర్పడి బీజింగ్ లాంటి నగరాల్లో అయితే ఊరి శివారుల్లోని గ్రామాల్లో నిర్మించవలసి వస్తోంది.ఈ సమాధులు నిర్మించే బిజినెస్ లో ఉన్న లింగ్ షాన్ సిమెట్రీ కంపెనీ వాళ్ళు గత ఏడాది 83.3 శాతం లాభాలు పొందారు.కాగా ఈ ఏడాది లాభాలు ఇంకా పెరుగుతాయని ఆశిస్తున్నారు.సగటున 70 వేల యువాన్ లని ఒక్కొక సిమెట్రీ ని నిర్మించడానికి చైనీయులు ఖర్చు చేస్తారు.పర్యావరణానికి ముప్పులేని రీతి లో అంటే కాల్చిన శవం బూడిదని సముద్రం లో వేయడం లాంటి విధానాల్ని పాటించమని చైనా ప్రభుత్వం వారి పౌరులకి సలహా నిస్తోంది. 

Saturday 2 January 2016

మళ్ళీ తెలుగు విద్యార్థుల్ని వెనక్కి పంపిన అమెరికన్ అధికారులు



న్యూయార్క్ విమానాశ్రయం నుంచి నిన్న శనివారం 18 మంది తెలుగు విద్యార్థుల్ని దిగీ దిగానే అకడి కష్టంస్ అధికారులు ప్రశ్నించి వారిని అందర్నీ వెనక్కి తిరిగి పంపించివేశారు.వారి వీసాల్ని ఇతర పత్రాల్ని పరిశీలించి ప్రశ్నించిన మీదట వివిధ కారణాల తో వీరిని తిప్పి పంపించివేశారు. అయితే ఆ విద్యార్తులు మాట్లాడుతూ కనీసం మంచి నీటి సౌకర్యం కూడా కల్పించలేదని  గడ్డ కట్టే చలి లో  ఫేన్ లు వేసి  ఆపమన్నా ఆపలేదని ఆరోపించారు.వారు తుపాకుల్ని ధరించి రావడం ఆందోళన కలిగించిందని మమ్మల్ని వెనక్కి ఎందుకు వెనక్కి పంపిస్తున్నారని అడిగితే అది బాస్ ఆర్డర్ అని చెప్పారని ,ఈ వీసా ఎంత ధరకి కొన్నావు అని ఒకర్ని ప్రశ్నించారని ఒక విద్యార్థి తెలిపాడు.నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ ,సిలికాన్ వేలీ యూనివర్సిటీలు బ్లాక్ లిస్ట్ లో లేవని అలాంటప్పుడు తమని వెనక్కి పంపించడం ఎందుకని వారు అనగా ఈ సారి మర్యాదగా వెళ్ళకపోతే అయిదేళ్ళ బేన్ విధిస్తామని అధికారులు తెలిపారని వెల్లడించారు.NewsVarsha

Thursday 24 December 2015

ముస్లిం సంప్రదాయ పద్దతుల్లో ఫ్లైట్ లు నడపబోతున్న హిందూ దంపతులు.



మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి షరియత్ పద్దతుల్ని అనుసరించి నడిచే విమాన సర్వీస్ ల్ని రవి గజెంద్రన్,కార్థియని గోవిందన్ అనే  హిందూ దంపతులు ప్రారంభిస్తున్నారు. దీని పేరు రాయని ఎయిర్ .ఈ ఫ్లైట్ లలో  పోర్క్ గాని మద్యం గాని సరఫరా చేయరు.సిబ్బంది అంతా ఇస్లాం కి అనుగుణమైన డ్రెస్ లో నే ఉంటారు.నమాజ్ చేసుకోవడానికి కూడా అనువు గా ఉంటాయి.పైలెట్ లు,క్రూ ఇంకా ఇతర సిబ్బంది అంతా కలిపి 350 దాకా ఉంటారు.ప్రస్తుతానికి ఈ సర్వీసులు కౌలాలం పూర్ నుంచి లాంగ్క్వి మధ్య లో నడుస్తున్నాయి.భవిష్యత్ లో ఇండోనేషియా ,ఫిలిప్పైన్స్ వంటి ఇతర దేశాలకి సైతం విస్తరిస్తామని నిర్వాహకులు అంటున్నారు.మలేషియా లో 60 శాతం దాకా ముస్లిం లు ఉండగా 6.3 శాతం దాకా హిందువులు ఉన్నారు.Click here

Thursday 8 October 2015

మా భాష రష్యన్ అంత సంపన్నమైనది కాదు: ఈ ఏడాది నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత



2015 సంవత్సరానికి గాను నోబెల్ సాహిత్య పురస్కారం బెలారస్ దేశానికి చెందిన స్వెత్లానా అలెక్సివిక్ (67) ని వరించింది.ఆమె నాన్ ఫిక్షన్ రచనలు చాలా ప్రసిద్ది చెందాయి.చెర్నోబిల్ ఉదంతం మీద,రెండ ప్రపంచ యుద్ధ కాలం లో మహిళా సైనికుల మీద ఆమె రచనలు పేరు తెచ్చి పెట్టాయి.బైలో రష్యన్ ఆమె మాతృ భాష అయినప్పటికి రష్యన్ భాష లోనే ఆమె రచనలు చేశారు.రష్యన్ భాష యే సంపన్నమైనదని ,బైలో రష్యన్ సాహిత్య పరంగా ఎన్నదగిన భాష కాదని ఆమె అభిప్రాయపడ్డారు."Second hand time" అనే ఆమె పుస్తకానికి ప్రసిద్ధ ఫ్రాన్స్ పురస్కారం ప్రిక్స్ మెడిసిస్ లభించింది.రచయిత్రి గా తనకి జర్మనీ,ఇటలీ వంటి దేశాలనుంచి  లభించిన స్కాలర్ షిప్ ల తోనే ఆమె ఎక్కువ గా ఇతర దేశాల్లో గడిపారు.బెలారస్ అధ్యక్షుడు అలెక్జాండర్ లుకషెంకో పాలన లో స్వేచ అనేదానికి అర్ధం లేకుండా పోయిందని స్వెత్లానా అంటున్నారు.Click here

Tuesday 15 September 2015

ప్రపంచం లోని టాప్ 100 యూనివర్శిటీల్లో మనది ఒక్కటీ లేదు..టాప్ రెండువందల్లో మాత్రం రెండు ఉన్నాయి...!



ఈ రోజు క్వాక్రెల్లి సైమెండ్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూనివెర్శిటీల్లో అత్యుత్తమమైన వాటిని 100 ప్రకటించగా దానిలో మన దేశానికి ఒక్కదానికి కూడా స్థానం లభించలేదు.అయితే టాప్ 200 స్థానం దాకా తేలిన లెక్క లో  మటుకు IIS బెంగుళూరు కి 147 వ ర్యాంక్ లభించగా IIT ఢిల్లీకి 179 వ స్థానం లభించింది.హార్వర్డ్ యూనివెర్శిటి గత ఏడాది నాల్గవ స్థానం లో ఉండగా  ఈ ఏడు రెండవ స్థానం లోకి వచ్చింది.నగరాల వారిగా చూస్తే లండన్ నగరం 4 అత్యుత్తమ వర్శిటీలతో టాప్ లో ఉంది.ఆ తర్వాత సిడ్నీ ,హాంగ్ కాంగ్,బీజింగ్ నగరాలు ఉన్నాయి.Click here 

హిందూ దేశం గా ప్రకటించనందుకు నిరసనల తో చర్చ్ పై బాంబులు



సోమవారం రాత్రి నేపాల్ లోని ఝాప జిల్లా లో హింస ప్రజ్వరిల్లింది.నేపాల్ ని హిందూ దేశం గా ప్రకటించడానికి అక్కడ ఏర్పాటు అయిన  Constituent assembly నిరాకరించడం తో హిందూ అనుకూల సంస్థలు ఝాపా లో పోలీస్ స్టేషన్ కి దగ్గర లోనే ఉన్న ఓ చర్చ్ లో బాంబులు పేల్చడం తో ఒక పోలీసు మరణించగా ఇద్దరు గాయపడ్డారు.తరతరాలుగా నేపాల్ హిందూ రాజ్యంగా కొనసాగిందని 2008 లో ఆ హోదా కి మంగళం పాడారని కనుక ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలని ఆ సంస్థలు కోరుతున్నాయి.28 మిలియన్ల జనాభా ఉన్న నేపాల్ ని 8 ప్రావిన్స్ లుగా విభజించాలని  అక్కడి ప్రజలు కోరుతున్నారు.గతనెలనుంచి ఇప్పటిదాకా 3 డజన్ల మంది దాకా ఈ గొడవల్లో మరణించారు.Click here

Friday 11 September 2015

కరాచీ లో ఊపందుకుంటున్న నైట్ లైఫ్...!

(Hard Rock cafe in Karachi)

ఒకప్పుడు పాక్ లోని కరాచీ నగరం పసందైన రాత్రి పూట వినోదాలకు,సంగీతానికి పేరెన్నికగా ఉండేది.అయితే మళ్ళీ ఇప్పుడు చాన్నాళ్ళ తర్వాత తెర వెనక రాత్రి జీవితం కొంతపుంతలు తొక్కుతున్నది.మద్యం,విందులు,నృత్యాలు పాశ్చాత్య సంగీతం హోరెత్తుతున్నది.ఈ కార్యక్రమాలు ప్రైవేట్ గా కొందరి ఇళ్ళలోను ఇతర నివాసాల్లోను జరుగుతున్నాయి.1950 నుంచి 1977 దాకా  ప్రముఖ జాజ్ ,పాప్ బృందాలు ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చేవి.ఆ తర్వాత  అవి నిషేధించబడ్డాయి,హింసా యుతంగా  కరాచీ మారిపోవడం తో నగర స్వరూపం మారిపోయింది.ఏమైనా మళ్ళీ పాత రోజులు తిరిగివస్తున్నట్లుగా నే ఉన్నాయి. Click here 

Saturday 8 August 2015

పట్టుబడ్డ పాక్ తీవ్రవాది ఇల్లు ఇదే..!



గత బుధవారం జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్ వద్ద బి ఎస్ ఎఫ్ జవాన్ లపై కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు మరణించగా ఇంకొక ఉగ్రవాది నవీద్ పట్టుబడిన విషయం తెలిసిందే.అయితే పైన కనిపిస్తున్న ఆ వీధి లోనే ఆ నవీద్ నివసించేది.అది పాకిస్తాన్ లోని ఫైసలా బాద్ లో రఫీఖ్ వీధి లో 3 వ నెంబరు ఇల్లు.అతని తండ్రి పేరు మహ్మద్ యాఖుబ్. అతనికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు.ఒక కుమారుడు అద్యాపకుడు కాగా ఇంకొక కుమారుడు వస్త్ర వ్యాపారం లో ఉన్నాడు.మూడవ వాడు నవీద్ .45 రోజులు పాటు లష్కర్ ఎ తోయిబా వద్ద శిక్షణ పొంది దాడుల నిమిత్తం భారత్ లోకి వచ్చాడు.గ్రామస్తుల్ని రక్షణ కవచం గా చేసుకోవాలని ప్రయత్నించగా వాళ్ళు సమయస్ఫూర్తి తో నవీద్ ని బంధించారు.Click here

Tuesday 2 June 2015

మోడి ని అరెస్ట్ చేస్తే బిలియన్ రూకలు ఇస్తాడట ...!



జమాత్ ఎ ఇస్లాం ..పాకిస్తాన్ లోని కరుడుగట్టిన ఉగ్ర వాద సంస్థ.రావల్ కోట్ లో జరిగిన మీటింగ్ లో నిన్న రెచ్చిపోయి ప్రసంగాలు చేశారు ఆ నాయకులు. సిరాజ్ ఉల్ హక్ అనే నాయకుడు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ని అరెస్ట్ చేసిన వారికి బిలియన్ రూకలు బహూకరిస్తామని ప్రకటించాడు.కాశ్మీర్ సమస్య తేలేంత దాక పాకిస్తాన్ లోని రాజకీయ నాయకులు భారత్ తో శాంతి చర్చలు జరపరాదని ,అలా ఎవరికైనా ప్రేమ ఉంటే వాళ్ళు ఢిల్లీ గాని ముంబాయి గాని వెళ్ళి పోవాలని వాళ్ళకి పాక్ లో చోటు లేదని చెప్పుకొచ్చారు.Click here

Saturday 23 May 2015

పాక్ నుంచి నూక్లియర్ ఆయుధాలు తెచ్చి ఆ దేశం పై దాడులు చేస్తాం: ఇస్లామిక్ స్టేట్



అవసరమైతే బిలియన్ డాలర్ లను ఖర్చు పెట్టైనా పాకిస్తాన్ నుంచి నూక్లియర్ ఆయుధాలను సేకరిస్తామని వాటితో అమెరికా దేశం పై దాడులు జరుపుతామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దబిక్ అనే వారి ఆన్లైన్ పత్రికలో ప్రకటించింది.The perfect storm అనే పేరుతో ఇది వెలువడింది.టాంక్ లు,రాకెట్ లాంచర్ లు,మిసైల్ సిస్టం లు, యాంటి ఏయిర్ క్రాఫ్ట్ లు సమకూర్చుకున్నాక నూక్లియర్ ఆయుధాల పై దృష్టి పెడతామని,పాక్ నుంచి మాకు సహకరించే వారి సాయం తీసుకుంటామని ప్రకటించింది.అయితే పాక్ మటుకు తమ నూక్లియర్ ఆయుధ వ్యవస్థ చాలా అంచెలతో కూడిన భద్రత మధ్య ఉంటుందని అది అంత సులభం కాదని ప్రకటనలు ఇవ్వడం గమనార్హం.Click here

Sunday 17 May 2015

ప్రాణం కాపాడిన సిక్కు మతస్థుని తలపాగా



నిన్న శనివారం న్యూజిలాండ్ లోని ఆక్ లాండ్ రోడ్ మీద స్కూలు కి నడుచుకుంటూ వెళుతున్నాడు ఓ అయిదు సంవత్సరాల బాలుడు.ఉన్నట్టుండి ఓ కారు గుద్దడం తో రోడ్డు పై పడిపోయాడు.అది చూసిన హర్మన్ సింగ్ అనే సిక్కు యువకుడు ఆ కుర్రవాడి కి రక్తం బాగా కారిపోకుండా వెంటనే తన టర్బన్ తీసి అతనికి కట్లు కట్టాడు.ఆ తరవాత ఆ అబ్బాయిని ఆసుపత్రి కి తీసుకెళ్ళగా ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు.మత పరంగా తలపాగాను బయట వీధిలో తీయడానికి సిక్కులు నిరాకరిస్తారు అయినప్పటికి మానవతా ధృక్పథం తో వ్యవహరించిన ఆ యువకుణ్ణి అంతా అభినందించారు.Click here

Thursday 14 May 2015

ఎవరికి పట్టని శరణార్ధులు వాళ్ళు.



ప్రపంచం లోనే ఎవరికి పట్టని ఎవరు దరి చేర్చుకోవడానికి ఇష్టపడని మైనారిటీలు బహుశా వీళ్ళేనని చరిత్రకారుల ఉవాచ.వీళ్ళే రోహింగ్యాలు అన బడే జాతికి చెందిన వారు.మైన్మార్ లో కి పెద్ద సంఖ్యలో వలస వచ్చిన వీరిని అక్కడి ప్రభుత్వం కూడా బయటకి నెట్టివేస్తున్నది.2009 లో బౌద్ధులకు,వీరికి  ఘర్షణ జరగడం తో రెండు వందల మంది వరకు చనిపోవడం తో అక్కడి ప్రభుత్వం వీరి పై ఉక్కుపాదం పెట్టింది.ఆంగ్ సాన్ సుకీ లాంటి వారు కూడ వీళ్ళ తరపున మాట్లాడే సాహసం చేయడం లేదు.బంగ్లాదేశ్ కి ,ఇండోనేషియా కి,ఇంకా చుట్టు పక్క దేశాలకి వెళ్ళాలన్నా అవకాశం లేక ఆ సంద్రం పరిసరాల్లోనే పడవల మీద తిరుగుతూ ఎక్కడ వీలుంటే అక్కడ గడుపుతుంటారు.Click here

Tuesday 12 May 2015

భారతీయులు తక్కువ రకం మనుషులు: చైనా డైలీ



ఈ రోజు మంగళ వారం చైనా దేశం లోని కమ్యూనిష్ట్ పార్టీ  అధికారిక మీడియా గా చెప్పబడే పీపుల్స్ డైలీ లో భారతీయుల పై దుమ్మెత్తి పోశాడు హు ఝియాంగ్ అనే రచయిత.భారతీయులు తక్కువ రకం మనుషులు ,నరేంద్ర మోడీ లాంటి ట్రిక్స్ చేసే వ్యక్తిని ప్రధాని గా ఎన్నుకున్నారంటేనే తెలుస్తోందది. అక్కడి మీడియా కూడా అర్ధం పర్ధం లేకుండా చైనా వ్యతిరేకతని ప్రచారం చేస్తుంది.మోడి అరుణాచల్ వంటి వివాదస్పద ప్రదేశాల్లోకి వెళ్ళకూడదు,అలాగే దలైలామా ని సమర్దించడం మానుకోవాలి ,టిబెట్ విషయాన్ని వదిలిపెట్టాలి .అప్పుడే ఇరుదేశాల మధ్య మచి సంభంధాలు సాధ్యం అవుతాయి అని పేర్కొన్నారు.ప్రధాని మోడి రెండు రోజుల్లో చైనా వెళతారు అనగా ఈ విషయం పైకి ఎత్తడం గమనార్హం.Click here

Tuesday 31 March 2015

ఖడ్గ మృగం నిన్న చేసిన దారుణం మీకు తెలుసా..?



నేపాల్ లోని హెతడ అనే ఊర్లోకి నిన్న రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఒక ఖడ్గ మృగం తప్పించుకుని వచ్చింది.వీధుల్లో వీరంగం వేస్తూ ఒక 61 ఏళ్ళ స్త్రీని చంపి వేసి ఆరుగుర్ని గాయపరిచింది.నిజానికి చాలా అరుదు గా అవి మనుషుల జోలికి వస్తాయిట.ఇంచు మించు అడవి లోనుంచి 20 కి.మీ. ల దూరం నడుచుకుంటూ వచ్చిందని అక్కడి పోలీస్ శాఖ ప్రతినిధి శిషు శర్మ చెబుతున్నారు.మళ్ళీ దాన్ని రిజర్వ్ ఏరియా లోకి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకోసం ఓ ఏనుగు ని తెప్పిస్తున్నట్లు వార్త.Click here

Saturday 21 March 2015

భారత్ తొండి చేసి గెలిచిందట..!



బంగ్లాదేశ్ ,భారత్ ల మధ్యన జరిగిన క్రికెట్ క్వార్టర్ ఫైనల్ మేచ్ లో అంపైర్ లు చేసిన పొరపాట్ల వల్ల భారత్ గెలిచిందని లేకపోతే బంగ్లాదేశ్ గెలిచి ఉండేదని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా అన్నారు.ఆట ఎలా ఆడారు అనేది ప్రపంచమంతా గమనించింది ఇవాళ కాకపోతే మరో రోజైనా తాము ప్రపంచ కప్ గెలుస్తామని వారి ఆటగాళ్ళని ఊరడించారు.ICC ప్రెసిడెంట్ గా ఉన్న కమల్ ముస్తఫా కూడా అంపైర్లు భారత్ టీం పట్ల అనుకూలంగా వ్యవహరించడం దారుణమని అవసరమైతే తన పదవికి రిజైన్ చేయడానికైనా సిద్ధమని వ్యాఖ్యానించారు.Click here 

Thursday 19 March 2015

భర్త పర్మిషన్ తో ఇతరులతో సంబంధాలు పెట్టుకొని పుస్తకం రాసిందామహిళ.



రాబిన్ రినాల్డొ అనే ఈ ఫోటో లో ఉన్న మహిళ వైవాహిక జీవితం పై బోరు కలిగి ఆయన యొక్క అనుమతి తోనే ఒక సంవత్సరం పాటు ఇతరులతో సెక్స్ సంబంధాలు పెట్టుకొని ఆ అనుభవాలను ద వైల్డ్ ఓల్ట్ ప్రాజెక్ట్ అనే పుస్తకంగా రాసింది.ఒక ఏడాది లో కేవలం 12 మంది తో మాత్రమే సమ్మందాలు పెట్టుకుంది కాగా దీనిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.Click here 

Tuesday 3 March 2015

ఇద్దరు బ్లాగర్లను చంపిన హంతకుణ్ణి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.



బంగ్లాదేశ్ లో ని ఢాకా లో గత గురువారం అమెరికా లో నివసించే బంగ్లా జాతీయుడైన అవిజిత్ రాయ్ ని ఘోరంగా నరికి చంపిన ఫరాబీ షఫీయుర్ రెహ్మాన్ ని నిన్న బంగ్లాదేశ్ కి చెందిన రేపిడ్ యాక్షన్ దళాలు అరెస్ట్ చేశాయి.అవిజిత్ రాయ్ నాస్తికుడు,అతని భావ జాలాన్ని చెబుతూ ముక్త మనో అనే బ్లాగ్ ని రాస్తూ  ఉండేవాడు.స్వతహాగా బంగ్లాదేశీయుడైన రాయ్ 15 ఏళ్ళ క్రితం అమెరికా కి వలస వెళ్ళాడు.అక్కడ నుంచి అతని రాతలని  ఆపమని బెదిరిస్తూ ఈ రెహ్మాన్ ట్విట్టర్ లో ఫేస్ బుక్ లో కూడా బెదిరించాడు.ఈ నెల లో బుక్ ఫెయిర్ కి గాను ఢాకా వచ్చిన రాయ్ ని రిక్షా లో వెళుతుండగా మాటు వేసి ఆపి మరీ చంపాడు ఈ రెహ్మాన్.గతం లో 2010 లో కూడా ఓ బ్లాగర్ ని చంపిన కేసు లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు.Click here

Friday 27 February 2015

అమెరికా లో భారతీయ యోగా గురువు పై రేప్ కేసు పెట్టిన మహిళలు..!



బిక్రం చౌధరి (69) హాట్ భంగిమల్లో యోగా ని నేర్పిస్తూ తనకంటూ ఓ పేరుతెచ్చుకున్నాడు.ఈయనకి మనదేశం లో ఇంకా ఇతర దేశాల్లో కూడా శిష్యులు ఉన్నారు.లాస్ ఏంజల్స్ లోని సుప్రీం కోర్ట్ లో జిల్ లాలెన్ అనే ఆమె ఈ బిక్రం చౌధరి కొన్ని ఏళ్ళ కిందట తనని రేప్ చేసినట్లు కేస్ పెట్టింది.ఆ గురువు తరపు లాయర్లు మాత్రం ఇదంతా డబ్బు కాజేయడానికి ఆమె ఆడే డ్రామా అని ఎప్పుడో రేప్ జరిగితే కేసు పెట్టకుండా ఎందుకు ఆగిందని అంటున్నారుClick here

Thursday 12 February 2015

భారతీయ వృద్ధుని ఆసుపత్రి పాలుజేసిన అమెరికన్ పోలీస్ అధికారి



సురేష్ భాయ్ పటేల్ రెండు వారాల క్రితం గుజరాత్ నుంచి అమెరికా లోని మేడిసన్ (అలబామా) కి తన కుమారుడి కుటుంబాన్ని చూడడానికి వచ్చాడు.అతని కుమారుడు గత పది ఏళ్ళనుంచి అక్కడే ఉంటూ ఓ రెండేళ్ళ క్రితమే పౌరసత్వం పొందాడు.వారం క్రితం ఆ 57 ఏళ్ళ వ్యక్తి మార్నింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు అనుమానస్పద వ్యక్తి గా భావించి ఎవరో పోలీస్ లకి ఫోన్ చేశారు.దానితో పోలీస్ లు పటేల్ ని కిందికి వంగి నిలబడమనగా సహకరించలేదని చేయి చేసుకోవడం తో అతని వెన్ను ముక దెబ్బతిని  ఆసుపత్రి పాలయ్యాడు.ఎడమ కాలు కూడా దెబ్బతిన్నదని సమాచారం.పటేల్ కుమారుడు చిరాగ్ ఒక వెబ్ సైట్ తో మాట్లాడుతూ తన తండ్రికి ఇంగ్లీష్ భాష రాదని అయినప్పటికి తమ ఇంటినెంబర్ ని వారితో చెప్పడానికి ప్రయత్నించినా వారు వినలేదని వివరించాడు.అక్కడి పోలిస్ అధికారులు దాడి చేసిన అధికారి పేరు తెలుపడానికి నిరాకరించారని ఈ విషయం పై లాస్యూట్ ఫైల్ చేస్తామని చిరాగ్ యొక్క అటార్నీ హేంక్ షెరొడ్ తెలిపారు.Click here