Showing posts with label జాతీయ వార్తలు. Show all posts
Showing posts with label జాతీయ వార్తలు. Show all posts

Saturday 14 May 2016

బీహార్ విద్యార్థులు మా పట్టణం ని చెడగొడుతున్నారు అంటున్న M.L.A.



నిన్న శుక్రవారం రాజస్థాన్ లోని కోట లో కోచింగ్ కోసం వచ్చి నివాసం ఉంటున్న విద్యార్థుల మధ్య గొడవలు జరిగి ,దాని లో సత్య ప్రకాష్ అనే బీహారి విద్యార్థి హత్య కాబడ్డాడు.ఈ యువకుడు మెడిసిన్ ఎంట్రెన్స్ కోసం కోచింగ్ కి ఇక్కడికి వచ్చాడు.25 మంది విద్యార్థులు మూకుమ్మడిగా ఇద్దరు విద్యార్థులపై దాడి చేయడం తో ఒక విద్యార్థి గాయపడగా సత్యార్తి గా పిలువబడే సత్యప్రకాష్ (19) అక్కడే మృతి చెందాడు.ఈ కోట పట్టణం రాజస్థాన్ లో కోచింగ్ కేంద్రాలకి పెద్ద పేరు.ఏటా లక్షన్నర పై చిలుకు విద్యార్థులు శిక్షణ కోసం వస్తుంటారు.గత కొన్ని రోజులు గా ఘర్షణలు జరుగుతూ ఇవి తీవ్ర స్థాయికి  చేరుకున్నాయి.అయితే కోట M.L.A భవానీ సింగ్ రజావత్ మాట్లాడుతూ బీహార్ విద్యార్థులు తమ పట్టణం కి చెడు పేరు తెస్తున్నారని ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.బీహార్ ఉపముఖ్యమంత్రి తేజశ్వనీ ప్రసాద్ యాదవ్ రాజస్థాన్ ముఖ్యమంత్రికి ఈ విషయమై లేఖ రాస్తూ దుండగుల్ని శిక్షించవలసిందిగా కోరారు. 

Saturday 7 May 2016

ICSE టాపర్ ఒడిశా లోని బాలొంగీర్ కుర్రాడు



నిన్న శుక్రవారం ICSE పదవ తరగతి ఫలితాలు వెలువడగా ఆల్ ఇండియా టాపర్ గా ఒడిశా రాష్ట్రం లోని బాలొంగీర్ కి చెందిన అబినీత్ పరిచ్చ 99.2 శాతం మార్కు ల తో నిలిచాడు.రెండవ స్థానం బెంగుళూర్ కి చెందిన సుదర్శన్ సాధించాడు.మామూలుగా మూడు గంటల పాటు ప్రతి రోజు చదివేవాడినని ,పరీక్షలప్పుడు మాత్రం 5 గంటలు చదివేవాడినని చెప్పాడు.స్పేస్ సైంటిస్ట్ కావాలనేది తన లక్ష్యంగా తెలిపాడు.ఒక చిన్న పట్టణం నుంచి జాతీయ స్థాయి లో ప్రధమ స్థానం సాధించిన ఆ విధ్యార్థిని ఆ కుర్రాడు చదివిన లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపాల్ టీనా జోసెఫ్ ప్రత్యేకంగా అభినందించారు. 

Sunday 24 April 2016

"శతృజీత్" లో ముగ్గురు మృతులు..



వాయు దళం,పదాతి దళం సం యుక్తంగా తీవ్రవాదుల్ని అణచివేసే పనిలో భాగంగా రాజస్తాన్ లోనికొన్ని ప్రాంతాల్లో ఎక్సర్ సైజ్ లు (శతృజీత్)గత కొన్ని రోజులుగా   నిర్వహిస్తున్నారు.నిజ పరిస్థితుల్ని  కల్పించి పాల్గొనే ఈ దశలో ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు తెలియవచ్చింది.విపరీతమైన వేడి,గాయాలు,పాము కాటు ఇలాంటి కారణాల వల్ల మరణించినట్లు వార్త.రాత్రి వేళల్లో పేరాట్రూపర్లు లక్ష్య ప్రాంతాలపై దిగి దాడి చేయడం వంటివి కూడా దీని లో భాగం.ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ ప్రమాద ప్రాంతాల్లో ని గాయపడిన  సిబ్బందిని సందర్శించారు.మృతుల సంఖ్యని ఇంకా అధికారికంగా ప్రకటించవలసి ఉంది.

Saturday 16 April 2016

మార్క్ జుకర్ బర్గ్ కి డొమైన్ అమ్మిన కేరళ కుర్రాడు.



అమల్ అగస్టిన్ కేరళ లోని అళువ లో ఇంజనీరింగ్ చదివే కుర్రాడు.ఒకసారి ఆసక్తి కొద్ది 200 రూపాయలు పెట్టి గో డాడి వారి దగ్గర మాక్సిమా చాన్ జుకర్ బర్గ్  పేరు మీద ఒక డొమైన్ ని రిజిస్టర్ చేయించుకున్నాడు.అయితే అది ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్  కుమార్తె పేరు ట..మొత్తానికి ఆ డొమైన్ నేం ని అమ్మమని ఆయన కార్యాలయం వాళ్ళు  అడిగి 700 డాలర్లకి ఆఫర్ ఇచ్చారు.దానితో బేరం ఆడకుండా ఆ కుర్రాడు ఒప్పుకున్నాడు.రేపో మాపో డొమైన్ ట్రాన్స్ఫర్ జరిగిపోతుంది. 

Saturday 2 April 2016

అలా చేసి ఉంటే అంతమంది మరణించేవారు కారు.



కోల్ కత్తా లో ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ కూలి 24 మంది వరకు మరణించడం వెనుక ఘోరమైన వైఫల్యం దాగి ఉందని,అంత పెద్ద నిర్మాణం జరుగుతున్నప్పుడు దాని కింది నుంచి ఎందుకని ట్రాఫిక్ ని అనుమతించారని ,అది ఇండియన్ రోడ్ కాంగ్రెస్ మాన్యువల్ లోని నిబంధనలకి కూడా  వ్యతిరేకమని ఖరగ్ పూర్ IIT ప్రొఫెసర్ భార్గబ్ మైత్ర అభిప్రాయపడ్డారు.ఆయన నేషనల్ హై వే ఆథారిటీ తో కలసి రోడ్ సేఫ్టి అంశాల పై పనిచేస్తున్నారు.

Monday 7 March 2016

మహిళల కార్ల ర్యాలి



అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న ఒడిస్సా రాజధాని భుబనేవశ్వర్ లో ఒక విన్నూత్నమైన కార్ల ర్యాలీ జరిగింది.దాదాపుగా 150 మంది మహిళలు రకరకాల థీంస్ తో తమ కార్లని అలంకరించుకొని దీని లో పాల్గొన్నారు.KIIT నుంచి మొదలైన కార్ని వాల్ లో "బేటి బచావో..సమాజ్ బచావో,జస్ట్ బి యు,విమెన్స్ ఎడ్యుకేషన్,బోల్డ్ ఈస్ బ్యూటిఫుల్" ఇలా వివిధ స్లోగన్ లతో , థీం లతో అలంకరించుకుని పాల్గొన్నారు.KIIT వ్యవస్థాపకుడు అచ్యుత్ సామంత మాట్లాడుతూ ఇది ఒక మంచి ప్రయత్నమని కొనియాడారు.మనజ పండా,హరప్రియ మల్లిక్,రోహిణి సామంత్రాయ్ డ్రెసింగ్ విభాగం లో గెలుపొందగా థిమాటిక్ విభాగం లో బిజయ భట్,బనస్మిత దాస్,ప్రాచి అగర్వాల్ మహాజన్ లు గెలుపొందారు.  

Friday 19 February 2016

ఎయిడ్స్ బాధితులకు రుణాలు ఇస్తున్నారు



చత్తిస్ ఘడ్ రాష్ట్రం లో ఎయిడ్స్ బారిన పడిన మహిళలకు ఒక్కొక్కరికి పది వేలు, గ్రూప్ గా వచ్చిన ఎస్ హెచ్ జి మహిళలకి లక్ష రూపాయల చొప్పున రుణాలివ్వడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.నామ మాత్రపు వడ్డీ ఉంటుంది.చత్తిస్ ఘడ్ మహిళా కోష్ పేరు తో పధకం మొదలయింది.అన్ని జిల్లాల కలెక్టర్లకి ఈ మేరకు ఉత్తర్వులు వెళ్ళాయి.ఏదో వ్యాపారం చేసుకొని జీవించడానికి ఈ మొత్తం ఉపయోగపడుతుందని వారి భావన. 

Tuesday 9 February 2016

మేకని అరెస్ట్ చేసిన పోలిసులు



ఒక్క మేకని మాత్రమే కాదండోయ్...దానితో పాటు మేక యజమాని అబ్దుల్ హసన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.ఈ సంఘటన చత్తీస్ ఘడ్ లోని కొరియ జిల్లా లోని జనక్ పూర్ లో నిన్న జరిగింది.ఈ మేక జుడీషియల్ మేజిస్ట్రేట్ గారి తోట లోనికి అక్రమంగా చొరబడి కొన్ని మొక్కల్ని తినివేయడమే కాక తోటని కూడ పాడు చేసిందిట.గతం లో అంటే ఫిబ్రవరి 6 వ తేదీన కూడా ఇలాగే చేయగా ఆ మేక యజమానిని పిలిచి పోలీసులు చీవాట్లు పెట్టి వదిలేశారు.అయినా బుద్ది తెచ్చుకోకుండా ఈ మేక మళ్ళీ ఆ తోట లోకి వెళ్ళి చికాకు చేయడం తో మేక మీద ,దాని యజమాని మీద మేజిస్ట్రేట్ గారు కంప్లైంట్ చేయడం తో ఇరువురిని అరెస్ట్ చేశారు.అయితే ఈరోజు వారికిద్దరికీ బెయిల్ దొరికింది. అదీ కొసమెరుపు.Click here 

Sunday 3 January 2016

వాళ్ళిద్దరూ భారతీయులు కారు.



ప్రముఖ పాప్ గాయకుడు రెమో ఫెర్నాండెజ్ ఇంకా ఆయన కుమారుడు జోనా మీద గోవా లో సిటిజెన్షిప్ ఏక్ట్ 1955,సెక్షన్ 17 కింద ఒక కేసు నమోదయింది.కాశీనాద్ సేధి అనే వ్యక్తి ఈ కేసు పెట్టారు.గత ఏడాది డిసెంబర్ లో  జోనా ఒక మైనర్ అమ్మాయిని వేధించిన కేసు చిలికి చిలికి ఇంకో రూపు తీసుకుంటున్నది. నిజానికి రెమో ఫెర్నాండెజ్ ప్రస్తుతం పొర్చుగల్ పౌరసత్వాన్ని  ఆయన కుమారుడు ఫ్రాన్స్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని కాని రెమో ప్రస్తుతం భారత ఎన్నికల కమీషన్ కి గాను మోడల్ గా ఉన్నారని అలాగే జోనా భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారని ఆరోపించడం జరిగింది.


Sunday 27 December 2015

అంతర్జాతీయ ఒడిస్సీ డాన్స్ ఫెస్టివల్ నిన్న ప్రారంభమయింది



10 వ అంతర్జాతీయ ఒడిస్సీ డాన్స్ ఫెస్టివల్ నిన్న ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లో ప్రారంభమయింది.నిన్న రబీంద్ర మండప్ లో ఆ రాస్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి మనోరంజన్ పాణిగ్రాహి దీనిని ప్రారంభించారు.ఈ నెల 30 దాకా ఈ డాన్స్ ఫెస్టివల్ సాగుతుంది.జపాన్,అమెరికా,సింగ పూర్ ల వంటి దేశాలనుంచే కాక మహారాష్ట్ర,పశ్చిమ బెంగాల్ ,చత్తిస్ ఘడ్,పాండిచ్చేరి వంటి  రాష్ట్రాలనుంచి కూడా నృత్య కారులు దీని లో పాల్గొంటున్నారు.గురు కేలూచరణ్ మహాపాత్ర రిసెర్చ్ సెంటర్ సహకారం తో జరుగుతున్న ఈ పండుగ లో 250 మంది డాన్సర్లు,200 మంది సంగీత కారులు పాల్గొంటున్నారు.ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 6 వరకు ఒక సెషన్ ఇంకా 6.30 నుంచి 9 దాకా మరో సెషన్ గా ఇవి సాగుతున్నాయి.Click


Thursday 3 December 2015

మొత్తం దేశం లోనే ఎక్కువ వేతనం తీసుకోబోతున్న లెజిస్లేటర్లు...



మొత్తం దేశం లోనే ఎక్కువ వేతనం తీసుకోబోతున్న లెజిస్లేటర్లు ఇప్పుడు ఎవరయ్యా అంటే ఢిల్లీ ఎం.ఎల్.ఏ. లేనని చెప్పాలి.ఆ మేరకు అక్కడి అసెంబ్లీ లో ఈ రోజు బిల్లు పాసయింది.వేతనం అన్ని పేకేజీలతో కలిపి మూడు లక్షల ఇరవై వేల దాకా ప్రతి నెలకు ఇక పొందుతారు.కేంద్ర ప్రభుత్వం ఆమోదించవలసి ఉన్నది.ఇది పబ్లిక్ ఫండ్స్ ని దుర్వినియోగ పరచడమేనని అజయ్ మాకెన్ (ఢిల్లీ కాంగ్రెస్ నేత) అభిప్రాయపడగా ఆప్ నేతలు మాత్రం ఆ మాత్రం జీతాలు లేకపోతే అన్ని రేట్లు పెరిగిన ఈ రోజుల్లో నెగ్గుకు రావడం ప్రజా ప్రతినిధులకి కష్టం అంటున్నారు.Click here

Saturday 28 November 2015

మంత్రి మాట వినని లేడీ I.P.S అధికారి ట్రాన్స్ ఫర్ అయిన వైనం ..!



హర్యానా లోని అంబాలా జిల్లా కేంద్రం లో నిన్న గ్రీవెన్సెస్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కమిటీ మీటింగ్ జరిగింది.దానికి హాజరైన ఫతేబాద్ జిల్లా ఎస్.పి. సంగీతా కాలియా ని ఆరోగ్య శాఖా మంత్రి కొన్ని ప్రశ్నలడగ గా ఆమె ఇచ్చిన సమాధానం నచ్చని మంత్రి ఆమె ని గెట్ అవుట్ అని అరిచారు.ఆ హుంకరింపు ని ఏ మాత్రం కేర్ చేయకుండా ఆమె అక్కడే కూర్చుండిపోయారు.అయితే నేనే వెళ్ళిపోతా  అంటూ ఆ మంత్రి అనిల్ విజ్ బయటకి వెళ్ళిపోయారు.పోలీస్ అధికారిణి సంగీతా కాలియా ని మానేసార్ లోని రిజర్వ్ బెటాలియన్ కమాండెంట్ గా బదిలీ చేయగా దేశ వ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టించింది.Click here

Thursday 12 November 2015

గిరీష్ కర్నాడ్ ని చంపుతామని బెదిరింపు..!



బెంగుళూరు విమానాశ్రయానికి కెంపె గౌడ పేరు కాకుండ 18 వ శతాబ్దానికి చెందిన టిప్పు సుల్తాన్ పేరు పెడితే బాగుండేదని ప్రముఖ రచయిత ,నటుడు గిరీష్ కర్నాడ్ వ్యాఖ్యానించిన  నేపధ్యం లో కొంతమంది కర్నాడ్ కి కూడా కాల్బుర్గి కి పట్టిన గతే పడుతుందని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.కెంపె గౌడ వర్గానికి చెందిన వొక్కలిగ కులస్తులు,బిజెపి కి చెందిన వ్యక్తులు దీని వెనుక ఉండవచ్చని భావిస్తున్నారు.కర్నాడ్ ఇంటి దగ్గర సెక్యూరిటి ని అధికారులు  పెంచారు.click here

Thursday 22 October 2015

ఉత్తరాది వారు రూల్స్ ని అతిక్రమిస్తారా..!

 

కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు నిన్న బుధవారం ఢిల్లీ లో ఒక కార్యక్రమం లో చేసిన విమర్శలు దుమారం రేపాయి.ఉత్తరాది ప్రజలు చట్టాల్ని ఉల్లఘించటం లో ఆనందం పొందుతుంటారని  గతం లో ఓ మాజీ ఢిల్లి లెఫ్ట్నెంట్ కల్నల్ అన్నారని దానితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు.దీన్ని వెంటనే కేజ్రీవాల్ తన ట్విట్టర్ పోస్ట్ లో ఖండించారు.అయితే సదరు మంత్రి అన్నదాంట్లో కూడా నిజం లేకపోలేదని కొంతమంది కౌంటర్ ఇవ్వడం కొస మెరుపు.ఇదే విషయం పై హిందూస్థాన్ టైంస్ సర్వే జరపగా 68.25 శాతం మంది  అంగీకరించారు.Click here 

Tuesday 6 October 2015

నిరసన తెలిపిన నయన్ తార..!



భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కి మేన కోడలు నయన్ తార సెహగల్ తాను 1986 లో పొందిన సాహిత్య  అకాడెమీ అవార్డ్ ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసారు.కారణం తీవృమైన  మత ఉద్రిక్తలు తలెత్తుతున్నప్పటికి నరేంద్ర మోడి కిమ్మనకుండా వ్యవహరిస్తున్నందుకు గాను ఈ విధంగా నిరసన తెలిపారు.ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో బిశద గ్రామం లో మైనారిటీల పై దాడులపై గాని ,కన్నడ రచయిత కాల్బురి మృతి పై గాని కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేకపోయిందని ఆమె విమర్శించారు.Click here

Sunday 4 October 2015

తల మీద వస్త్రం కప్పుకోలేదని నాలుగేళ్ళ కుమార్తె ని చావగొట్టాడు.



ఉత్తరప్రదేశ్ లో బరేలి కి సమీపం లోని గ్రామం లో గత శుక్రవారం ఈ సంఘటన జరిగింది.తల్లి తో కలిసి తినేటపుడు నాలుగేళ్ళ కూతురు ఫర్హీన్ తల పై వస్త్రం వేసుకోమంటే నిరాకరించిందని తండ్రి జాఫర్ హుస్సైన్ ఆ అమ్మాయిని నేలకేసి కొట్టడం తో మరణించింది.పోలీస్ స్టేషన్ లో తల్లి కేసు పెట్టడం తో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది.చుట్టుపక్కల వారు అతనికి మానసిక అనారోగ్యం అని చెబుతున్నారు.Click here

Saturday 26 September 2015

తనని అవమానించారంటూ బాయ్ కాట్ చేసిన అనువాదకురాలు



శ్రీదేవి ఎస్.కర్త అనే మళయాళ రచయిత్రి APJ అబ్దుల్ కలాం రచించిన ఓ పుస్తకాన్ని మళయాళం లోకి అనువదించారు.దాని రిలీజ్ ఫంక్షన్ ఈ రోజు థ్రిస్సుర్ లో బ్రహ్మ విహారి దాస్ అనే స్వామిజీ చేతుల మీదుగా జరిగింది.ఆయన ఉన్న వేదిక వద్దకి  వెళ్ళడానికి గాని పక్కన కూర్చోడానికి గాని అనువాదకురాలికి అవకాశం ఇవ్వలేదు ,కారణమేమంటే ఆ స్వామిజి కి స్త్రీ నీడ కూడా తాకడానికి ఇష్టం ఉండదట.అది వారి ఆచారమట.దానితో ఆ రచయిత్రి ఆ ఫంక్షన్ ని బాయ్ కాట్ చేసి వచ్చేసింది.ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ లో పేర్కోవడం జరిగింది.Click here 

Sunday 20 September 2015

నాగా లాండ్ స్త్రీలకి సురక్షిత ప్రదేశమా..?



నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో తాజా గా విడుదల చేసిన గణాంకాల ప్రకారం స్త్రీలపై  అతి తక్కువ దాడులు అంటే కేవలం 67 మాత్రమే నాగాలాండ్ రాష్ట్రం లో  నమోదు అయ్యాయి.మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా చిన్నది.మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా స్త్రీల పై జరిగే అత్యాచార ఉదంతాలు తక్కువ గానే ఉన్నాయి. వస్త్ర ధారణ విషయం లో స్లీవ్ లెస్ వంటి వాటిల్లో అక్కడి సమాజం నుంచి వ్యతిరేకత ఉండదని అయితే ఇతర రాష్ట్రాల్లో సంచరించేప్పుడు మాత్రం అలాంటి వస్త్రధారణకి దూరం గా ఉంటామని,అక్కడి యువతులు అంటున్నారు.Click here

Saturday 5 September 2015

ఆ సైనికుడు రియల్ లైఫ్ హీరో అనే చెప్పాలి.



శనివారం రోజున నిన్న ఆర్మీ లోని స్పెషల్ ఫోర్స్ కి చెందిన లాన్స్ నాయక్ మోహన్ నాధ్ గోస్వామి  ఉగ్ర వాదుల కాల్పుల్లో కుప్వారా జిల్లాలోని హఫుర్ద్ వద్ద మరణించాడు.2002 లో  టెర్రరిజాన్ని అణిచివేయడానికి ప్రత్యేకంగా ప్రారంభించిన దళం లో ఆయన చేరి మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. గత 11 రోజుల్లో 10 మంది టెర్రరిస్ట్ లను గోస్వామి మట్టుబెట్టాడు.ఒక ఉగ్ర వాదిని ప్రాణాలతో బందించాడు.ఉత్తర ప్రదేశ్ లోని నైనిటాల్ దగ్గర గల  ఆయన స్వ గ్రామం లో పూర్తి సైనిక లాంచనాలతో అంతయక్రియల్ని నిర్వహించారు.ఆయనకి భార్య ఏడేళ్ళ కుమార్తె ఉన్నారు.Click here

Monday 31 August 2015

అమితాబ్ ట్విట్టర్ అకౌంట్ ని హాక్ చేసిందెవరో..?



ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అమితాబ్ బచన్ ట్విట్టర్ ఖాతా ని మొత్తానికి ఎవరో దుండగులు హాక్ చేశారు.చేసి దానిలో బూతు సైట్లని లోడ్ చేశారు.16.6 మిలియన్ల ఫాలోయర్లు ఆయన ట్విట్టర్ అకౌంట్ కి ఉన్నారు.72 ఏళ్ళ ఆ నటుడు ఈ రోజు అదే ఖాతా లో ట్వీటుతూ ఇక ఈ ఖాతా నాకు అవసరం లేదు.హాకింగ్ చేయ్డానికి మరొకర్ని వెతుక్కునే పనిలో ఉండండిక అని చురక అంటించాడు.ఫేస్ బుక్ లో కూడా ఆయనకి ఓ ఖాతా ఉంది. Click here